Pages

Thursday, 13 December 2012

శాపగ్రస్త





శాపగ్రస్త.


క్షణకాలమే  నేను నిన్ను చూసింది,
సాటి బాట సారిగా,

ఇద్దరిచూపులు కలసింది క్షణమే ,

వేటాడే నీచూపులు నేను మరచిపోను

నీ కళ్ళలో ఏమిటా భావం,

నిన్నెలా అడిగితెలుసుకోను?

ఎర్రటెండలో ఎర్రమందారంలా నీవు.

మంచులో మల్లెపూవులా నేను.

కాలినడకన నీవు, కారులో నేను.

వెన్నెల సోయగాల సౌధంలో నేను,

కూలిపోయే గుడిసెలో నీవు,

నా దాహం తీర్చటానికి,

నీ చేతిలోని నారికేళ విన్యాసం,

నీ  కళాత్మకతను చాటింది.

నా వేళ్ళ మద్య నిర్లక్ష్యంగా ఎగిరే పదినోటు,

నీ చూపుకి  సిగ్గుతో ఒదిగిపోయింది. 

నా కారు ముందు నడి  ఎండలో నడిచే నీవు,

సగం ప్రపంచాన్ని వెనక్కి నెడుతున్నావు.

గుక్కపెట్టే నా బిడ్డని సముదాయించలేకుంటే ,

చొరవ చూపి నువ్వు నా బిడ్డను తీసుకున్నావు, 


నన్ను, నీవు చూసిన చూపు 

నేను మరచిపోలేను.


ఏ డబ్బూ, ఏ దర్పమూ, తీర్చలేని  

నా బిడ్డ దాహం, నా బిడ్డ ప్రాణం, 

స్తన్యమిచ్చిన  నీ అమ్మతనం ఆదుకుంది.

నా  నాగరికత సిగ్గుతో నన్ను వెక్కిరించింది.

ఈ సారి వంద నోటు నీ చూపుకి చిన్నబోయింది.

నీ కంటి అద్దమందు నేను  మరోమారు, 

పగిలిన అద్దంలో అనాకారి ప్రతిబింబాన్నయ్యాను   

నేను శిల్పినై ,నిన్ను శిలను చేసి , 

నీ జీవితం పై  నేను పయనిస్తున్నాను.

నీ సమాదిపై  నా పునాది వేసుకుంటున్నాను.

కానీ, నీ మానవత  ముందు...ప్రతి సారీ తలవంచుతున్నాను.





24 comments:

  1. మెరాజ్ గారూ!..జస్ట్ ఒక పోస్టులో...ప్రతి బ్లాగర్ కు ఒక స్వప్నం లాంటి వండవ పోస్ట్ మైలురాయిని చేరుకుంటారు...ముందస్తు అభినందనలు...మీ శాపగ్రస్త భిన్నంగా ఉంది...@శ్రీ

    ReplyDelete
    Replies
    1. శ్రీ గారు,
      ధన్యవాదాలు, కవిత భిన్నంగా ఉంది అన్నారు కానీ ఎలా ఉందొ చెప్పలేదు.

      Delete
  2. నీ కంటి అద్దమందు నేను మరోమారు,
    పగిలిన అద్దంలో అనాకారి ప్రతిబింబాన్నయ్యాను...

    కవితలోని ఆర్థ్రత నచ్చింది.. కానీ ఆ చిత్రం అంత apt గా లేదనిపించింది ఫాతిమాజీ...
    advanced congrats to century post..:-)

    ReplyDelete
    Replies
    1. వర్మ గారూ,
      కవిత మెచ్చిన మీకు, ధన్యవాదాలు.
      చిత్రం మీరు చెప్పినతర్వాత మార్చాను, కానీ ఈసారి కూడా సరైనది దొరకలేదు.

      Delete
  3. కానీ, నీ మానవత ముందు...ప్రతి సారీ తలవంచుతున్నాను.

    This is to be true

    ReplyDelete
    Replies
    1. sir,
      మీరు సమయం వెచ్చించి చదివి,
      నన్ను ఆశీర్వదించటం నా అదృష్టం గా భావిస్తాను.

      Delete
  4. సర్ (కష్టేఫలే శర్మగారు) అభిప్రాయమే నాది కూడాను.
    మీ మానవత ముందు.........ప్రతిసారీ ప్రణమిల్లుతున్నాను.

    ReplyDelete
    Replies
    1. భారతి గారూ,
      మీ అభిమానానికి నా కృతఙ్ఞతలు .

      Delete
  5. ఎన్ని హోదాలైనా,ఎంత డబ్బైనా మానవత్వంతో సరితూగలేవని
    చక్కగా చెప్పారండీ.. చాలా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. రాజీ గారికి ,
      నమస్కారాలతో మా మీద మీకున్న అలక కారణం తెలియ రాలేదు.
      అయినా సరే కొంత సమయం కినుక వహించి, ఇప్పుడు సడలించి మమ్ము కరుణించి నందులకు ధన్యులము అయ్యాము.
      కవిత మెచ్చిన మీకు మా ధన్యవాదములు...:-))

      Delete
    2. "Meraj Fathima"గారూ..
      అయ్యో మీరు నాకు నమస్కారం చెప్పకూడదండీ :)
      నేను ఈ మధ్య అసలు బ్లాగులనే చూడలేదు అందుకనే కామెంట్స్ ఇవ్వలేదు..
      అంతే తప్ప వేరే కారణం ఏమీ లేదండీ..
      తప్పుగా భావించవద్దని మనవి :)

      Delete
  6. చాలాచక్కగా చెప్పారండీ.

    ReplyDelete
  7. మెరాజ్ గారూ ,
    మానవత్వాన్ని మరోమారు ఆకాశాని కెత్తేశారు .

    ReplyDelete
    Replies
    1. రాజా రావ్ సర్, , నేను మానవత్వాన్ని ఎత్తేసినా ,గొప్పగా చాటినా అది మీవంటి గురువుల ఆశీర్వాదమె.
      ఓ సందర్బంలో మీరు నొక్కి వక్కాణించారు ఫాతిమా కవితలు సమజానికి పనికొస్తాయి అని ,
      అది చాలు అంతకంటే నాకు ఏ డాక్టరేట్ అవసరం లేదు.

      Delete
  8. wondeful Meraj. eduraina prati sanniveshaanni akshareekarinche mee vidwath ki Salaam e ishk meree jaan.

    ReplyDelete
  9. మాతృత్వం విలువ తెలుసుకోలేని అవివేకులను
    చక్కగా మందలించారు. మృదువైన మాటలతోనే
    చెంపలు ఛెళ్ళుమనేలా!
    బయటకు ' నాగరికత ' నటించినా అంతరాత్మ ఊరుకోదు అని
    గుర్తు చేసారు!!
    వంద కవితలకు శుభాభినందనలు!!!

    ReplyDelete
    Replies
    1. శ్రీనివాస్ సర్, నేను రాసిన కవితలని చదివి అందులో నేను చెప్పాలనుకున్న బావాన్ని చెప్పగలిగానా లేదా అని మీ వ్యాఖలో చూసుకుంటాను నేను.
      నా మొదటి కవిత ఆంధ్ర భూమి లో అచ్చయిన రోజు మీరు నన్ను ఆశీర్వదించి మీరు ఇంకా రాయాలి, సామాజిక పరమైన రచనలు చేయండీ అన్నారు.
      తప్పకుండా రాస్తాను సర్, నా వెనుక నా బ్లాగ్ మిత్రులు మీ వంటి గురువులూ ప్రోత్సహం ఉండగా ఇంకేమి కావాలి.
      ధన్యవాదాలతో..మెరజ్

      Delete
  10. సమాజంలోని రెండు పార్స్వాలను చక్కగా వివరించారు ఫాతిమా గారు. కానీ కవిత్వంలోని అవేధన చిత్రంలో కనిపించడం లేదు... anyway good post.

    ReplyDelete
    Replies
    1. డేవిడ్ గారూ, నేను చెప్పాలి అనుకున్నది మీరు గ్రహిస్తారు,
      సమాజంలోని రెండు విభిన్న కోణాలను చూపేందుకు నేను ప్రయత్నిస్తాను.
      ఇక బొమ్మ సరైనది దొరకలేదు..మీ స్పందనకు కృతఙ్ఞతలు.

      Delete
  11. ఈ మానవత్వా భావం కేవలం రచలకేనా లేక ఎవరైన ఆచరిస్తున్నారా అని డౌట్

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. యోహాంత్ గారూ, ఏదీ అనుమానంతో యొచించవద్దు,
      ఎవరు ఆచరిన్చారో లేదో మనం సోదించాలేము,
      ఇకపోతే నేను ఆచరించగలిగితేనే రాస్తాను. ఈ విషయం గతంలో కూడా ఓ వ్యాఖ్యకు సమాదానంగా రాసాను.
      అందరినీ ఉద్దరించే శక్తి నాకు లేకపోవచ్చు కానీ నా శక్తికి తగ్గ మంచి పని చేయటంలో నేను మున్డుంటాను.
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete