దగా గాడు
మనముందు బిచ్చ మెత్తుతూనే..
మనకు పచ్చనోటు ఆశ చూపేటోడు.
పల్లె దీపాలని ఆర్పేసి మనల్ని
కటిక చూకట్లోకి తోలేసేతోడు.
ముక్కిపోయిన దుడ్డు బియ్యాన్ని
మనకు ముష్టిగా ఎసేటోడు.
సర్కారీ కొలువులన్నీ చంకనెట్టుకొనేటోడు.
బాష బాగాలేదని బదనాం చేసేటోడు.
బొంద పెట్టటానికి కూడా చందా అడిగేటోడు.
కమ్మగా మాట్లాడి కళ్ళుగప్పె కతర్నాకోడు.
కులచిచ్చు బెట్టి కుమ్ములాటబెట్టేతోడు.
పొరగాళ్ళని మట్టుబెట్టి కళ్లజూసేటోడు.
శవాలమీద చిల్లరేరుకొనే చత్తగాడు.
సావుకబురు మోసుకొచ్చే సోదిగాడు.
నిలెయ్యి ఊరినడి బొడ్డున నక్కజిత్తులోడిని.
పాతెయ్యి పచ్చనోటితో నినుకొంటానన్నోడిని.
కలం మళ్ళీ ఎర్ర సిరా లో ముంచారా ;)
ReplyDeleteబాగుందండీ దగాకోరులపై కవితా ధ్వజం!
చిన్నిఆశ గారూ,యేమి లాబం ఎర్ర సిరాలొ ముంచి.
Deleteపచ్చ సిరా తో పవర్ ఉండాలి ఏమంటారు?
మీ స్పందనకు ధన్యవాదాలు.
ReplyDeleteప్రస్తుతం సమాజంలో దగాకోరుల విన్యాసాలను,
వాళ్ళకి చేయాల్సిన శాస్తిని చక్కగా చెప్పారండీ..
దగాకోర్లు పెన్నులకు ఎక్కడ వింటారండీ, గన్నులకే వినటం లేదు.
Deleteరాజీ గారూ థాంక్స్ మీ స్పందనకు.
very nice. Nijaanni nipputo kadiginatlu undi.
ReplyDeletevanajaa.. nippu saripodu kadagataaniki.
Deletethanks mee spandanaku.
మిరాజ్ గారి విప్లవగీతమా
ReplyDeleteప్రేరణ గారూ, ఆశాగీతం.
Deleteఅభిమానించే మీలాంటి వారున్నారు కదా అందుకే ఇంత ధైర్యంగా పాడుతున్నా.
ఎక్కడ దొరికాడు మీకీ దగా గాడు.
ReplyDeleteమీ కత్తి ఈసారి రాజకీయాలమీదకు ఎత్తినట్లున్నారు!
ధైర్యే సాహసే లక్ష్మీ!
సర్, ఐదేళ్లకొకసారి కనిపిస్తాడు.
Deleteప్రభుత్యోగులైన మీకు కనిపించడు అనుకుంటా:-))
కలం లాబం లేదు అందుకే, ఇలా గళం ఎత్తటం.
కొత్త టాపిక్ ఎంచుకున్నారు మేరాజ్ గారూ!...బాగుంది....@శ్రీ
ReplyDeleteశ్రీగారూ, ధన్యవాదాలు.
Deleteబ్లాగు రచనలో మిరాజ్ గారే మాకాదర్శం ఇక మీదట .
ReplyDeleteసర్,మీ అభిమానాన్ని సదానిలుపుకుంటాను.
Deleteమీ వందో పోస్టుకు స్పందించ డం అక్కడ కుదర లేదు . మీ బోటి బ్లాగరుల కలాల గళాలు నిరంతరాయంగా నినదిస్తూ ఆకాశాన్నీ భూమినీ ఏకం చేయాల్సిందే - వందలాది పోస్టులలో ..... మీ కలం కలకలం రేపడం ఖాయం . మమ్మల్ని మీ రచనల విస్ఫులింగాల శగలో వేడిమిని సంతరించుకొని కార్యోన్ముఖులను కానివ్వండి .
ReplyDeleteసర్,మీ దీవన ఉన్నంత వరకూ నా కలానికి బయం లేదు.నా మనొభావాలకు మీ సంస్కార వ్యాఖ్యలతొ స్పందించి,నన్ను ఇంతదూరం నడిపించిన గురువులు మీరు. మీకు నా వందనాలు.
ReplyDelete>>పాతెయ్యి పచ్చనోటితో నినుకొంటానన్నోడిని>>
ReplyDeleteనడిరోడ్డుమీద ఈ నినాదం వినిపించే రోజు రావాలి.
వస్తుంది, తప్పకుండా వస్తుంది. కనీసం మన మనవళ్ళ రొజుకైనా..:-))
ReplyDelete