ఇదీ జీవితం.
నిన్నటి అలలమీద ఎగసిన విచిత్రం,
నేడు కలలలో నిగూడ చిత్రం.
ప్రతి పలుకులోనూ ఓ ఒప్పందం,
ప్రతిరోజూ తొణికిసలాడే గాలి దీపం.
చలాకీగా సంద్రాన్ని ఈదటం నైపుణ్యం.
ఆగని నావకు లంగరె అనవసరం.
అవాస్తవ బాటని ఎన్నుకోవటమే శరణ్యం.
అందుకే దారంతా ఒంటరి ప్రయాణం.
ప్రేమ నేర్పే పలుకులే మోసపు గుళికలు.
కానీ కార్చే కన్నీరే కళ్ళకు కొస మెరుపులు.
వేదనలో రోదనై ఇంకిన రక్తపు కన్నీరు.
దేహమంతా పారదర్శకమై పారుతుంది.
రంగును కోల్పోయి రాలిన హరిత పత్రం.
హంగును కోల్పోయిన చెల్లని హామీపత్రం.
ఆక్రోశ, అసహనాల అభ్య ర్దనల మద్య,
కాలం వెంబడి వర్తమానమై సాగిపో...ఇదే జీవితం.
very very nice madam
ReplyDeleteramesh garu, thank you.
Deleteబాగుందండి.
ReplyDeleteManchidandi.
DeleteThis comment has been removed by a blog administrator.
ReplyDeleteజీవితాన్ని ప్రాక్టికల్ గా చెప్పారు కవితలో...బాగుంది!
ReplyDeletechinni aasa garu, mee prasamsaku naa krutagnatalu.
Deleteజీవిత సత్యం
ReplyDeleteAniket garu thank you.
Deleteనూతన సంవత్సర శుభాకాంక్షలు, మీకు మీ కుటుంబ సభ్యులకు, మీ బ్లాగు మిత్రులకు, అందరికీ!
ReplyDeleteకొత్త సంవత్సరం స్త్రీలకు సంపూర్ణ రక్షణ కల్పించాలని ఆశిస్తున్నాను.
మీ కవితలు మరింతగా మానవత్వపు పరిమళాలు వెదజల్లాలని కోరుకుంటున్నాను.
ఉద్యోగరీత్యా చెన్నై బదిలీ కావడం వల్ల కొంత ఆలస్యంగా మీ కవిత చూసాను.
చాలా బాగా రాసారు.
శుభాభినందనలు.
సర్, మీకు, మీ ఆత్మీయులకు, కుటుంబ సభ్యులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు.
Deleteమీరు ఉద్యోగ ఉన్నత పదవుల్లోకి వెళ్ళిన సందర్బంగా నా హృదయపూర్వక అభినందనలు.
పరవాలేదు, మీ భాద్యతలకంటే ఎక్కువ కాదు నా కవితలు.