Pages

Thursday, 24 January 2013

మీ మనసు(లు)ల్లో ఎదగాలని.





మీ మనసు(లు)ల్లో  ఎదగాలని.


నన్ను చూసి బొంద కూడా
పక్కున నవ్వింది
అక్కున చేర్చుకొంటూ...

భూమిపై   ఉన్నన్నాళ్ళూ ,
యెంత క్షోబ  పడ్డానో,
పంచేంద్రియాలతో  పరుల మాటలు
వింటూ.

అమ్మ కూడా తమ్ముడి
బట్టలు సరిపోతాయని
సంబర పడిపోతూ,

తోటి  ఆడపిల్లలు ,
పోడుగబ్బాయిలకు ,
నాతోనే లేఖలు పంపితే
కన్నీళ్ళను  ఆపుకుంటూ.

ఆలి వస్తే
అర్డంచేసుకుంటుందనీ ,
సంతానమైతే
సర్డుకుపోతారనీ ఆశపడుతూ...

మంచి పని చేస్తే,
మనిషి  అంటారనీ..
మీ అందరి కోసం మంచినే
ఎన్నుకొంటూ..,

దారివెంట వెళ్తుంటే,
నాకేవరైనా  నమస్కరిస్తే
బాగుండు అనుకుంటూ..

పురుష అహంకారం
అని తిట్టే అతివలు,
పురుష ఆకారాన్నే ,
చూస్తున్నారే  అని బాదపడుతూ...

సంతానానికి
బరువు కాకున్నా,
పరిచయానికి పనికిరానని
తెలుసుకున్నా...

ఏమి చేయను ,
ఎదగని మీ మనసుల్లో ,
ఒదిగిపోయిన
మరగుజ్జునే..


















6 comments:

  1. బాగుందండీ, మరగుజ్జు మనసుని కవితనే అద్దం లో చూపెట్టారు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు మెచ్హిన మీకు.

      Delete
  2. మరుగుజ్జుల మనోగతంను చక్కగా అక్షరీకరించారు మెరాజ్ గారు.

    ReplyDelete
    Replies
    1. భారతి గారూ, ధన్యవాదాలు.

      Delete
  3. శరీరం కుంచుమే అయినా ఆశలు అనంతం.
    గుండె గుప్పెడే అయినా అందులో పొంగే ప్రేమ సాగరమంత!
    బాగుంది మీ దృష్టి కోణం!

    ReplyDelete
    Replies
    1. నిజమే కదా మనస్సు చూడరు ఎవరూ, మీ ప్రసంశకు సంతొషం సర్,

      Delete