Pages

Wednesday, 16 January 2013

చెల్లని ఆశలు





చెల్లని ఆశలు


చెప్పాలనుకున్న పలుకులన్నీ..,
గొంతులోనే  ఆగిపోతుంటే.

రాయాలనుకున్న పదాలన్నీ..,
కాగితాన్నే  వెక్కిరిస్తుంటే.

ఉబుకుతున్న కన్నీళ్ళే..,
కారణం  అడుగుతుంటే.

అణగారిన  కోరికలన్నీ ..,
కలలకే  అంకితమవుతుంటే.

దరి చేరని బంధాలన్నీ..,
దిగంతాలను దాటి వెళ్తుంటే.

హక్కులను సందించే  ఇజాలన్నీ...,
దిక్కులేదన్న  నిజాన్ని నిగ్గదీస్తుంటే .

ఆకశాన  చుక్కలన్నీ..,
చందమామని  పట్టుకోలేకుంటే.

అంతరాన అల్లుకున్న  ఆశలన్నీ..,
తెల్లబోయి గొల్లుమంటుంటే.

చేసుకొన్న బాసలన్నీ..,
సాక్ష్యమెవరని  అడుగుతుంటే.

అగోచరమైన అనురాగానికి..,
అంధ విశ్వాసాన్నే... ఆధారమనుకో...అంతే ..అంతే .









13 comments:

  1. అయినా అంతగా నమ్మాలా!? అందుకే అన్నీ ప్రశ్నలే!
    బావుంది మెరాజ్.

    ReplyDelete
    Replies
    1. జీవిత నావని ముంచినా,తేల్చినా ,కూల్చినా అది నమ్మకమే. మానసిక సంఘర్షన మనస్సును పరిపరి విదాల ఆలొచించెలా చేస్తుంది. వనజా ధన్యవాదాలు.

      Delete
  2. ఎలా ఉన్నారండి?
    పది రోజుల కేరళ మంగుళూరు
    యాత్ర తర్వాత ఈ రోజు సాయంత్రం ఇల్లు
    చేరాము.
    మీ కవితలు చదవాలి.
    మళ్ళీ నా స్పందన పోస్ట్ చేస్తాను.
    సంక్రాంతి శుభాకాంకషలు!

    ReplyDelete
    Replies
    1. సర్, బాగున్నాము, మీరూ,మేడం,పిల్లలూ క్షెమం అనుకుంటాను.

      Delete
  3. చల్లని రోజులు రాని అశలన్నీ చెల్లనివేనా?
    బాగుందండీ!

    ReplyDelete
    Replies
    1. మీ పేరులొనే ఆశ ఉంది. అసలు ఆశలు ఎప్పుడూ చాలా వరకు చెల్లవు. అందుకే ఆశకు అంతం ఉండదూ అంటారు. ధన్యవాదాలు మీ స్పందనకు.

      Delete
  4. చాలా బాగుంది మేడమ్ మీ కవిత..చెల్లని ఆశలు ..నిరాశ వాదం తో కూడిన కవితని కూడా ఎంత చక్కగా వర్ణించి చెప్పారండి .చేసుకొన్న బాసలన్నీ..,సాక్ష్యమెవరని అడుగుతుంటే.అగోచరమైన అనురాగానికి..,అంధ విశ్వాసాన్నే... ఆధారమనుకో.బాగుంది

    ReplyDelete
    Replies
    1. తమ్ముడూ.. మీ స్పందనకు సంతొషం. నా బ్లాగ్ కి స్వాగతం.

      Delete
  5. అగోచరమైన అనురాగానికి...
    అంధ విశ్వాసాన్నే... ఆధారమనుకో...

    చక్కగా చెప్పారు. చాల బాగుంది మెరాజ్ గారు.

    ReplyDelete
    Replies
    1. భారతి గారూ, మీ స్పందన నాకెంతొ సంతొషాన్నిచ్హింది.

      Delete
  6. దరి చేరని బంధాలన్నీ..,
    దిగంతాలను దాటి వెళ్తుంటే.

    హక్కులను సందించే ఇజాలన్నీ...,
    దిక్కులేదన్న నిజాన్ని నిగ్గదీస్తుంటే...

    సూపర్బ్ లైన్స్...మేరాజ్ గారూ!....@శ్రీ .

    ReplyDelete
    Replies
    1. శ్రీ గారూ, మీ అభిమానానికీ స్పందనకూ ధన్యవాదాలు.

      Delete
  7. mee kavetalu superb fatemagee.sama kaalena raajakeeyalu meeda kuuda kavetalu evvande.

    ReplyDelete