Pages

Saturday, 19 January 2013








అగ్ని కవాతు.



ఎవరు ఆదుకుంటారు,
దిక్కులేని  పూబాలలను.

అజ్ఞాత హస్తాలు వివస్త్రను చేస్తుంటే..
ఆర్తనాదాలు  చేసినా  ఎవరు వింటారు?

టెలివిజన్  సీరియల్కి  చిక్కుకున్న వాళ్ళా. 
ఇంటర్ నెట్ లో ఇరుక్కున్న వాళ్ళా.?

క్లబ్బుల్లో కబుర్లాడే వాళ్ళా?
పబ్బుల్లో.. తైతక్కలాడీ వాళ్ళా?

దుస్సావాసాల   మధాంధుల మూకను,
ఎవరు అడ్డుకుంటారు?

అడిగినంత  దబ్బిచే వాళ్ళ  అమ్మ,నాన్నలా?
అర్దరాత్రి  వరకూ మందు  పోయించే  బారువాళ్ళా ?
వారికి  పర్మిషనిచ్చిన   సర్కారు వాళ్ళా.?

చెల్లీ.. అయిన వాళ్ళు లేని నిన్ను ఎవరూ  ఆదుకోరు
నీకోసం ఎవరూ  రారు.

విష వైకృత  క్రీడకు.. అంతం పలుకు.
చీకటి  దుప్పటి  చాటున  నక్కిన  
నాగరికులను  నడి  బజారుకు లాగు.

పగటి పూట పరువుకెరిసే పురుషోత్తములనూ..,
రాత్రిపూట  రాసలీలకు  తయ్యారయ్యే  పురుషపుంగవులనూ..

నీ దేహంపై  దాహం తీర్చుకున్న మదాన్దులకూ..
తిరగబడు,తెగాబడు , చండ్రనిప్పులు చేతబట్టి,
అగ్ని కవాతు చెయ్యి, మగాడనే ముద్రని  చిద్రం చెయ్యి.

రోకలి  చిగురించదూ ..,ఎడారి తడినివ్వదూ..
నీ అరచేతులనే చురకత్తులు చేసుకో,

తెగించు, చిరునామా లేని, చిల్లుకానీ లేని ,
నీకు జరిమానా  ఉండదు, ఎందుకంటే,
ఖాకీ పట్టించుకోడు  కనుక  ...పరేషానీ  ఉండదు.

















6 comments:

  1. చాలా బాగుంది ఈ పోస్ట్!

    ReplyDelete
    Replies
    1. తమ్ముడూ.. సంతొషం. ఎలా ఉన్నావ్.

      Delete
  2. Replies
    1. లొకెష్ గారూ, ధన్యవాదాలు, బ్లాగ్ కి స్వాగతం.

      Delete

  3. కని పెంచిన ఘనులనూ ,
    విలువలు నేర్పని విద్యాలయాలనూ -
    బజారు కీడిస్తే -
    పరిష్కారం దొరుకు తుందేమో !

    ReplyDelete
    Replies
    1. కచ్హితంగా సర్, ఎక్కడ లోపం ఉందో అక్కడే పరిష్కారం వెతకాలి.

      Delete