ఛీ..ఛీ.. సిటీ బస్సు.
ఎక్కకుండానే కదిలించే బస్సూ..
యెక్కుతూనే జలదరించే లుక్సూ..
లోపలి కెళ్ళమనే కండక్టర్ గద్దింపూ..
లోనికెళ్తూనే సీటుకోసం అర్దింపూ..
టిక్కెట్టు డబ్బులు తీయటంలో సర్కస్సూ..
బట్ట తొలిగిన చోట ఎగిరొచ్చి పడే గ్లాన్సూ..
బస్సంతా సిగారు ధూప సుగంధమూ..,
కూర్చున్న మగవారి బూతుల పంచాంగమూ ..
వికలాంగుల సీటులో కాలేజీ కుర్రతనమూ..
ఆడంగుల కళ్ళలో కాటేసే గుర్రుతనమూ..
ముసలి, ముతకా,బిడ్డ తల్లులూ, గర్బిణీలూ..
వాలిపోతూ, తూలిపోతూ, జారిపోవడాలూ..
వారి పాట్లు, అగచాట్లూ, చేసే ఎక్ష్సర్సైజులూ ..
పోకిరీగాళ్ళకు దొరికే ఉచిత చిత్ర ప్రదర్సనలూ..
డబ్బు సంచిలో ముఖం దాచుకున్న కండక్టరూ..
గబ్బు గల్లీలనూ, ఇరుకు సందులనూ..ఈదిస్తున్న డ్రైవరూ....
Cool
ReplyDeleteఅదే మన ఆదరాబాదు చిటీ బస్సూ :)
ReplyDeleteచికిందరాబాదు చీదర బస్సులూ ఇదే గొడవ.సర్, మీ స్పందనకు ధన్యవాదాలు.
Deleteపోదురూ బడాయి!
ReplyDeleteమెచ్చు కుంటున్నారా ? చీవాట్లేస్తున్నారా ?
జిలేబి.
అయ్యొ .. అంతా మెచ్హుకొలే.. దేశమును ప్రేమించుమన్నా.. బస్సు అన్నది మంచేయన్నా..
Deleteమీ స్పందనకు ధన్యవాదాలు సర్.
mm...correct...ga chepparu....buslo vellaalante i agachaatlu tappavu sumaa
ReplyDeletenice..chaalaa baagaaundandii...
రొంబ థాంక్స్ :-) నిజమే మస్సు ప్రయాణం నరకమే.
Deleteబస్సు పై మీ కవిత బాగుంది.
ReplyDeleteఇవేకాక బస్సులు స్వయంగా చేసే అకృతాలు కూడా ఎన్నో ఉన్నాయి.
డిల్లీలో బస్సే అత్యాచార వేదిక అయింది కదా!
Thank you sir.
DeleteThank you sir.
Delete' బస్సు చక్రం ప్రగతికి చిహ్నం ' - అంటే ఇదేనేమో!
ReplyDeletesir, ayinaa manchi cheppinaa daanni vimarsinche cheedapurugula samaajam manadi. chakrame gati mari.
Deleteమరి మధ్యమధ్యలో బస్సునాపుతూ రన్నింగ్ బస్సులెక్కే మనగురించి రాయలేదేమండి
ReplyDeleteraastaanu,
Deleteసిటి బస్సు ఎక్కితే ప్రయాణమంతా బేజారు...అయినా తప్పదు కదా బడుగు జీవులకు ఇదే ఇప్పటికి పెద్ద దిక్కు ..
ReplyDeleteNijame kadandee ... yelaa unnaa tappadu , aa charges koodaaa perigi vaallaki inkaa kastamgaa untundi paapam.
Deletecity bus పై మీ కవిత బాగుందండి.
ReplyDeleteకాని తప్పదండీ!కాని చాలా మందికి అదే కదండీ conveyance.
Hri gaaroo, yennaallaku mee raaka. chaalaa rojulu choosaanu mee comment kosam palakarimpu kosam. baaagunnaara, naa prati kavitanoo mechhukoni, spoortinichhevaaru.
ReplyDeleteవికలాంగుల సీటులో కాలేజీ కుర్రతనమూ..
ReplyDeleteఆడంగుల కళ్ళలో కాటేసే గుర్రుతనమూ..
Ikkada prasa, yasa bhasha and rhymes, hmm...adirindanukondi...
Raja, s/w engr, chennai
rajasofunny