Pages

Thursday, 21 March 2013



   చూడు 

   మానవ మృగాలు 
   పాలుగారే బుగ్గలను కూడా,
   తడిమి తపన తీర్చుకున్తున్నాయి.

   కొత్త పుంతలు తొక్కే,
   నాగరికతలన్నీ  నగ్నంగా,
   నాట్యం చేస్తున్నాయి.

   తేనే పూసిన మాటలతో,
   కపటమద్దిన   చేతలతో,
   మాలిమి చేస్తున్నాయి.

   ఆరేళ్ళ  ఆడపిల్లల్ని,
   రాక్షస క్రీడకు   బలిచేసి,
   నూరేళ్ళు నిండేలా చేస్తున్నాయి,

   సైకోల ఉన్మాద చర్యలు 
   స్వై ర్య  విహారం చేస్తూ,
   కసిగాయలపై  కసిగా,
   "కఫన్" కప్పుతున్నాయి.

   (కఫన్ ..చనిపోయినప్పుడు కప్పే తెల్లని వస్త్రం )
 

8 comments:

  1. మొగ్గలపై
    తుమ్మెదన్నా వాలదే
    కానీ ఈ మనుషులు?
    ******
    mrugaale nayamani pinchelaa pravarthisthunnaaru

    ReplyDelete
    Replies
    1. మ్రుగాలతో అస్సలు పోలచకూడదు.

      Delete
  2. ఈ వికృతానికి అంతం లేదా? రాదా?మనమేం చేయలేమా?

    ReplyDelete
  3. మనమే యెమైనా చేయగలం సర్, ప్రతి స్త్రీ తిరగబడాలి, ఆయిదాన్ని పట్టాలి సిక్షలు భయంకరంగా ఉండాలి

    ReplyDelete
  4. కష్టేఫలేగారు !
    చక్కగా అడిగారండి 'మనమేం చేయలేమా? అని.
    ఈ వికృతాలన్ని చూసి చూసి ఏమీ చేయలేక
    'మనము ఏమీ చేయలేమా....? అనే ఓ బ్లాగ్ ను పెట్టానండి.
    చదివి మీ స్పందనను తెలియచేయగలరు.

    మేరాజ్ గారు,

    మీ రచనలు సమాజ బాగు వైపు వేలుతున్నయండి.నాకు చాలా ఆనందంగా ఉందండి.

    చేయగలమనే మీ optimism చాలా నచ్చిందండి.
    అయితే ఒక్కసారి-'ఇంకా ఎంతమందిని చంపుతారు?' అనే నా పోస్టింగ్ చదివి స్పందించా గలరు.
    అన్యాయాలను, అరాచకాలను ఎదిరించే వాళ్లకు ప్రభుత్వ పరంగా ఎటువంటి support ఉండదండి.
    మన ప్రభుత్వాలే అరాచకాలు.ఇది ఎలా ఉంటుందంటే- anti-కరప్షన్ బ్యూరో లోనే కరప్షన్ ఉన్నట్లు.

    ReplyDelete
  5. బాగుంది....వీటికి పరిష్కారాన్ని కూడ చుపిస్తే బాగుంటుంది.

    ReplyDelete
  6. మానవ మృగాల మదపు ఆకలి కొత్త పుంతలు తొక్కి అనాగరికంగా, నగ్నంగా నర్తిస్తూ, తేనే పూసిన మాటలు, కపటమద్దిన చేతులు .... ఒక ఆరేళ్ళ పసితనాన్ని, తన రాక్షస క్రీడకు బలి చెయ్యడం ....
    ఈ ఉగ్ర ఉన్మాద వాద చర్య .... స్వై..ర్య విహారం చేస్తూ, కసిగాయలపై కసిగా, ....
    అడవి మృగాలు సంచరిస్తున్నాయి మానవుల రూపం లో .... జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ "చూడు" కవిత సమాజానికి ఒక కనువిప్పు కలిగించాలని ఆకాంక్షిస్తూ ....
    ఫాతిమా గారు మీ భావనలకు ఏకీభావన తెలియపరుస్తున్నాను.

    ReplyDelete