ఆడపిల్ల
విరిసీ విరియని కలువని
కొత్త కొలనులో పాతి పెడితే,
తట్టుకొని నిలిచి తలఎత్తుకుంది.
గుండెల్లో ఎగిసిపడే దిగులుని,
స్పర్శించి పరామర్సించితే,
కంటనీరుదాచేస్తూ కళ్ళు వాల్చింది.
బరువు అనుకొని బలురక్కసి పొదలమద్య,
అదృశ్య లోకాలలో విసిరేస్తే,
విషాదగీతికై విలపించింది.
అనాగరిక ఆటవికుల మద్య,
జీవించమని ఆదేశిస్తే,
తలవంచుకొని ఆచరించింది.
దేవుడు ఎదురై ఎమికావాలీ అంటే,
పెదవి విప్పి ఒకటే వేడుకుంది,
ఆడజన్మ తప్ప, ఏదైనా ఇమ్మంది
దేవుడు ఎదురై ఎమికావాలీ అంటే,
ReplyDeleteపెదవి విప్పి ఒకటే వేడుకుంది,
ఆడజన్మ తప్ప, ఏదైనా ఇమ్మంది
మేరాజ్ గారు,
contemporary society కి సరిపోయే నిజాన్ని చాలా బాగా చెప్పారండి
హరిగారూ,బ్లాగ్ కేవలం మీ కామెంట్ కోసమే చూస్తున్నాను, అందరూ ఫేస్ బుక్ లో చూస్తున్నారు , మీకు ఫేస్ బుక్ ఉంటే చెప్పండి, మీ స్పందనకు ధన్యవాదాలు.
ReplyDeleteబాగుంది మెరాజ్ గారూ.
ReplyDeleteకొన్ని భావాల్ని మీరు చాలా భిన్నంగా, అలవోకగా పలికిస్తారు కవితల్లో!
చిన్ని ఆశ గారూ, చాలా కాలానికి కలిశారు. సంతొషం, మీ స్పందనకు అభిమానానికీ ధన్యవాదాలు
Deleteబాగుంది అండి.. ఈ కవిత చదివితే చిన్నప్పడు స్కూల్ లో పాడిన కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా అనే పాట గుర్తుకు వచ్చింది అండి..
ReplyDeleteధన్యవాదాలు మీ చిన్నతనం గుర్తొచ్హింది అన్నారు సంతొషం
Deleteదేవుడు ఎదురై ఎమికావాలీ అంటే,
ReplyDeleteపెదవి విప్పి ఒకటే వేడుకుంది,
ఆడజన్మ తప్ప, ఏదైనా ఇమ్మంది ..... బాధాకరం
విరిసీ విరియని కలువొకటి, గుండెల్లో దిగులుని స్పర్శించి పరామర్సించితే, కన్నీరు దాచేసుకుని, బరువనుకోని బలురక్కసి పొదలమద్య, అదృశ్య లోకాల్లోకి విసిరేస్తే, విషాదగీతికై లోలో విలపించింది. ............... ఆ దేవుడు ఎదురై వరమేదైనా కోరుకో అంటే .... ఒక్క ఆడజన్మ తప్ప, ఏదైనా ఇమ్మని అడిగింది.
ReplyDeleteఆదిశక్తి, మాతృమూర్తి, దేవతా స్వరూపిణి అయిన ఒక స్త్రీ జన్మ .... అవాంచనీయం, అదీ ఒక కవయిత్రి దృష్టిలో కావడం .... సమాజం మనుగడకే ప్రశ్నార్ధకం అనిపిస్తుంది. అందరమూ మనసుపెట్టాల్సిన విషయం.
ఒక మంచి ఆలోచనాత్మక కవిత! అభినందనలు ఫాతిమా గారు!