సాక్షి
అమ్మ అన్నపూర్ణ సాక్షిగా ,
పల్లెటూరు ఒకటుండేది.
అన్న రైతన్న సాక్షిగా ,
అక్కడ అన్నం దొరికేది.
కరువు కాటకాల సాక్షిగా,
ఇప్పుడక్కడ ఆకలి తాండవిస్తుంది.
ఎండిన పొలాల కళేబరాల సాక్షిగా,
సొక్కి సోలిన వరి పంటే ఉంది.
రాబందుల వికృత రెక్కల సాక్షిగా,
మా పాడి గేదె కాయం ఉంది.
తెచ్చుకున్న అప్పుల సాక్షిగా,
మా రైతన్న ఊగిన ఉరికొయ్య ఉంది.
పట్టనీకరణపు తళుకుల సాక్షిగా
పల్లె మరోమారు వల్లకాడైంది.
ఇప్పుడు మన నాగరికత సాక్షిగా
పల్లెని సినిమాల్లో చూడొచ్చు .
పట్నం నుండి తెచ్చిన ప్లాస్టిక్ చెట్ల సాక్షిగా,
పల్లె కళకళ లాడుతుండటం చూడొచ్చు.
కండలు తిరిగిన సీమ హీరో సాక్షిగా,
మన బక్క రైతన్నని మరచిపోవచ్చు.
మారిన, మారుతున్న సమాజాన్నిలా రెండు కోణాల్లో కవితీకరించటం మీకే చెల్లు. బాగుంది మెరాజ్ గారూ!
ReplyDeleteమీ అభిమానానికి ఆదరణకు ధన్యవాదాలు.
Deleteబాగా చెప్పారు !
ReplyDeleteహర్షా సంతోసహం నీ స్పందనకు
Deleteఊగిన ఉరికొయ్య ఉంది.
ReplyDeletean excellent illusion అంది.
'ఉరికొయ్య' అంటే సరిపొయ్యేది.అయితే ఊగిన అనే
ముందు మాట వల్ల ఇంకా ఎక్కువ irony తోడయింది అనేది నా ఉద్దేశ్యం. మీరేమంటారు?
mee maate nijam antaanu.
Deleteమీ పోస్టింగ్ లాంగ్ ఫేసు కు కామెంట్ పెట్టాను చూడరా?
ReplyDeleteపట్టనీకరణపు తళుకుల సాక్షిగా పల్లె మరోమారు వల్లకాడైంది. excellent
ReplyDeleteAli thanks.
Deleteరెండు సమాజాల వైరుధ్యం అలోచించేలా ఉంది.
ReplyDeleteఒకప్పుడు అన్నపూర్ణ ఆ పల్లెటూరు
ReplyDeleteకరువు కాటకాల పుణ్యం ఇప్పుడక్కడ .... ఆకలి, ఎండిన పొలాల కళేబరాల, రాబందుల వికృత రెక్కల టపటపలు.
ఒక పక్కన పాడి గేదె కాయం, ఆ పక్కనే రైతన్న కొని తెచ్చుకున్న అప్పుల ఉరికొయ్య.
ఒకప్పుడు అన్నపూర్ణ ఆ పల్లెటూరు ఇప్పుడు శ్మశానతుల్యం రైతు జీవితం దుర్దశను ఇంత వాస్తవంగా చిత్రించగలగడం ....
అభినందనలు ఫాతిమా గారు