నీకోసం
వాస్తవ లోకాన
ఊహా సౌదంలో ..
ప్రేమని వెతుకుతూ ..
వేకువనే,
మదిలో వేదనతో
గుండె నిండా రోదనతో
ఎండిన పెదవులకు,
పలుకుల తొలకరి,
తళుకుల సింగారింపులు
చలం మైదానాన్ని,
గిజిగాని వసంతాన్ని,
సృజించి తరింపు.
అంతరాంతరాలలో,
నీ ప్రేమకై అన్వేషిస్తూ,
నిరసన రుచిచూస్తూ,
కలకూ, మెలుకువకూ
భాషకూ,భావానికీ,
అంతుపట్టని నీ ఆత్మ సౌందర్యం
అందుకోలేని అభాగినినై,
ఆశల ,ఊసుల మద్య,
నిరాశా,నిట్టూర్పుల నా అంతరంగం
good and natural
ReplyDeleteచలం మైదానాన్ని,
ReplyDeleteగిజిగాని వసంతాన్ని....ఇద్దరు మహానుభావుల కాంబినేషన్ బాగుంది.
వాస్తవ లోకం ఊహా సౌదంలో .... ప్రేమ కోసం వేకువనే, ఎండిన పెదవుల, తళుకుల సింగారింపులు
ReplyDeleteఅంతరాంతరాలలో, నీకై అన్వేషిస్తూ, కలో, మెలుకువో .... భాషో,భావమో, అంతుపట్టని ఆత్మ సౌందర్యం
అందుకోలేక అభాగినినై ....
అంతరంగ మధనం ప్రతి పదం లోనూ
ఫాతిమా గారు పోరాట లక్షణం మీ భావావెసం లో ప్రస్పుటంగా కనిపిస్తుంది.
అభినందనలు