నీ తలపుల్లో
వెన్నెల వెల వెల పోతుంది
తిమిరాన్ని తరమలేనంటుంది.
నిశి నిండిన నా మది విలపిస్తుంది.
నీ ప్రేమకు మూగ సాక్షిగా.
నిద్దుర ఎరుగని కనులు ,
నిశ్సబ్దంగా నీకై రోదిస్తున్నాయి.
స్తంబించిన కాలం నిలదీస్తుంది,
యెంత సేపు ఈ నిరీక్షణా అని.
ఉక్రోషం ,ఉద్వేగంగా ఉంది,
గట్టిగా నిన్ను పిలవాలని ఉంది.
గుండెపగిలేలా అరవాలనీ,
ఈ వేదనను చేదించాలని
కలవరంతో కనులురాల్చిన అశృవులను,
కాలి బొటనవేలు నేల రాస్తుంది విరహగీతికగా.
పచ్చటి మోము రుదిరవర్ణం దాలుస్తుంది,
మెలిపెట్టిన పైటకొంగు పళ్ళ మద్య గింజుకొంటుంది .
నిరీక్షణే నీరసించేలా,అలిగిన అభిసారికలా
నిర్జన ప్రదేశాన నిద్ర ఎరుగని నిశాచరిలా.
కాలమనే ఇనుపగోళాన్ని కాలికి కట్టుకొని,
This comment has been removed by the author.
ReplyDeleteవెన్నెల వెల వెల పోతుంది
ReplyDeleteతిమిరాన్ని తరమలేనంటుంది.
కలవరంతో కనులురాల్చిన అశృవులను,
కాలి బొటనవేలు నేల రాస్తుంది విరహగీతికగా.
చాలా చాలా బాగా రాసారండి !!
vidyasaagar gaaroo, dhanyavaadaalu
Deleteఎప్పటిలాగే బాగారాసారండి.
ReplyDeletePadma thanks
DeleteThis comment has been removed by the author.
ReplyDeletewow..this is wonderful andi...chaala bavundi
ReplyDeleteRaja
s/w engr
rajasofunny gmail
bagumdi nice feeling.
ReplyDeleteతిమిరాన్ని తరమలేని వెన్నెల .... వెల వెలా పోతూ, నిశి నిండిన మది .... విలపిస్తుంది. నిశ్సబ్దంగా రోదిస్తుంది.
ReplyDeleteఉక్రోషం, ఉద్వేగం .... గట్టిగా నిన్ను పిలవాలని, గుండెపగిలేలా అరవాలనీ, .............
నిరీక్షణ నీరసం, అలిగిన అభిసారిక నిశాచరిలా .... కాలాన్ని కాలికి కట్టుకొని, నడుస్తూ, నిరంతరం నీ తలపుల్లో తడుస్తూ వుంది .... ఎదురు చూపుల విరహ వేదనను చక్కని పదాలు, చిక్కని భావం తో "నీ తలపుల్లో" కవితలో కవయిత్రి ఆవిష్కరించిన విధానం బాగుంది. అభినందనలు ఫాతిమా గారు!