నా.... . నీవు
హేమంతంలో పూచే చేమంతిలా,
నీ హసితం ఓ సుభాషితం.
గ్రీష్మంలో విరిసే మల్లియలా,
నీ వదనం ఓ వరం.
మలయా మారుతంలా
నీ పలుకు ఓ పులకరింపు.
కరిమబ్బు రాల్చే చినుకులా
నీ పిలుపు ఓ చిరుజల్లు.
గలగలా పారే సెలయేరులా,
నీరాక ఓ ఏరువాక.
మలి సంధ్యలో శశి పంపే ఆహ్వానం లా,
నీ చూపు వెన్నెల బాకు.
ఎడారిలో దాహం తీర్చే చలమలా,
నీ స్నేహం ఓ ఊరడింపు.
బాగారాసారు.
ReplyDeleteThanks padma garu
DeleteWOWWWWWWWWWWWWWWWWWW..
ReplyDeleteHarsha thank you
Deleteహటాత్తుగా ఊడి పడ్డ ఎండల వేడిమికి
ReplyDeleteమీ కవిత ఓ గ్లాసెడు కొత్త కూజా నీళ్ళు
Dhanyavaadaalu Raja Rao garu
Deleteబాగుంది మీ కవిత
ReplyDeleteనీ హసితం ఓ సుభాషితం.keep smiling. It's nice.
ReplyDeleteఆ హాసం ఓ సుభాషితం, ఆ వదనం ఓ వరం, ఆ పలుకు ఓ పులకరింపు, ఆ పిలుపు ఓ చిరుజల్లు, ఆతని రాక ఓ ఏరువాక .... ఆ చూపు వెన్నెల బాకు .... ఆ స్నేహం ఓ ఊరడింపు.
ReplyDeleteఅన్ని లక్షణాలున్న స్నేహం నిజంగా ఓ సుభాషితం, ఓ వరం, ఓ పులకరింపు చిరుజల్లు, ఓ ఏరువాకే .... ఆ చూపు వెన్నెల బాకే
ఎప్పుడూ సామాజిక కవితల అణువుల విశ్ఫొటనాలు కనబడే చోట ఒక నూతనత్వాన్ని చూస్తున్నాను. చక్కగా ఇమిడిపోయారు అత్మీయ భావనల్ని ప్రజెంట్ చెయ్యడం లోనూ! అభినందనలు ఫాతిమా గారు!