Pages

Tuesday, 2 April 2013






అడగండి  చెపుతాడు



విలేఖరి: విత్తును నమ్ముకున్నావ్ ఎమైంది?
రైతు : మొలకెత్తనని మొడికేసింది 


వి.: వానను నమ్ముకున్నావ్ ఎమైంది?
రై : రానని మొరాయించింది.

నీ : నీ డొక్కలెందుకు ఎగిరెగిరి పడుతున్నాయి?
రై : వాటికింకా ఆకలిగుర్తుంది 


 వి:   నీ బక్కచిక్కిన ఎద్దులేవి?
 రై :   కట్లు విప్పి గడ్డిఉన్న చోటుకెళ్ళమన్నా.

 వి : నీవు  ఏ పండగ చేసుకుంటావ్?
 రై :  పస్తుల పండగ.

 వి.: నీ ఆస్తులేమైనాయి ?
 రై  : అప్పులకు జమ అయ్యాయి.

 వి. :నీ అయ్య ఉండాలిగా యేడి?
 రై :  రోగాలు ఎత్తుకెల్లాయి (తెల్ల కార్డ్ లేక)

 వి  : కరంటు కోత ఉంది తెలుసా?
 రై  : తెలుసు 

  వి :రెండు గంటలు ఇస్తారు చాలా?
  రై : రెండు నిమిషాలు చాలు.

  వి: పురుగుల మందు వాడుతున్నారా?
  రై : ఓ ఇంటిల్లిపాదీ.

   వి.:  మల్లి కలుద్దాం .
   రై : వీలుండదు, ముందు,ముందు ఊరుండదు 

   వి.: మరి ఏముంటుంది ?
    రై : వల్లకాడు.

    వి : అయితే ఈ సారి  ఇంకా హంగామా ఉంటుంది  తెలుసా?
    రై  : తెలుసు, పిసాచాలు వస్తాయి  పరామర్సించటానికి.


5 comments:

  1. వి: పురుగుల మందు వాడుతున్నారా?
    రై : ఓ ఇంటిల్లిపాదీ. (Super)


    వి : కరంటు కోత ఉంది తెలుసా?
    రై : తెలుసు
    నా రై : అవును దానికీ నేను అలుసే ;-)

    వి.: మల్లి కలుద్దాం .
    రై : వీలుండదు, ముందు,ముందు ఊరుండదు (Super)
    ____

    వి. ఎందుకు నవ్వుతున్నావు
    రై . ఏడవలేక ..

    పుట్టెడు ధుఖ్కములొ ఫక్కున నవ్వు వస్తుంది అంటే ఇదే . బాగుంది!!

    ReplyDelete
  2. సాగర్ గారూ, మీ కామెంట్ కి ధన్యవాదాలు

    ReplyDelete
  3. వి: పురుగుల మందు వాడుతున్నారా?
    రై : ఓ ఇంటిల్లిపాదీ.

    వి.: మల్లి కలుద్దాం .
    రై : వీలుండదు, ముందు,ముందు ఊరుండదు

    వి.: మరి ఏముంటుంది ?
    రై : వల్లకాడు.

    వి : అయితే ఈ సారి ఇంకా హంగామా ఉంటుంది తెలుసా?
    రై : తెలుసు, పిసాచాలు వస్తాయి పరామర్సించటానికి.

    ఇందులో దేనికదే సాటి. హాట్స్ ఆఫ్ అంది మేరాజ్ గారు.

    పై వాటిలో దేన్నీ మెచ్చుకోవాలో అర్థం కావట్లేదు.

    సామాజిక స్పృహను తట్టిలేపుతున్నారు. జోహార్లండి.కీపిట్ అప్ ప్లీజ్.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు హరి గారు.

      Delete
  4. బాగుంది. చాలా బాధకరం రైతుల పరిస్థితి

    ReplyDelete