" శ్వాసించని క్షణాలు "
ఒక్కో క్షణం నీది కానిది అవుతుంది,
ప్రేతాత్మల సంభాషణ తో్... ,
నిన్ను చిద్రం చేసేస్తుంది.
అల్లండుతున్నా కనికరం లేకపోతుంది,
అనుమానపు అంకుశంతో..,
నిన్ను పొడిచేస్తుంది.
మవునపు శవపేటికలో నిన్ను దాస్తుంది.
పిశాచాల పలకరింపులతొ ...
నిన్ను తూట్లు పొడుస్తుంది.
కలసిరాని కాలాన్ని నెత్తికెత్తుతుంది,
చంపడము అనే సరదాతో...,
నిన్ను హింస పెడుతుంది.
ఇప్పటికింతే అనుకోవల్సి వస్తుంది,
శ్వాసించని క్షణాలతో....,
నిన్ను విగతజీవిని చేస్తుంది.......... (ఇదీ జీవితం)
భయంకరమైన జీవిత సత్యం చెప్పారు.
ReplyDeleteపద్మ గారూ, జీవితం ఎంత వేదనను ఇవ్వగలదో, గుండెకు ఎంత బాదను ఇవ్వగలదో..మనసున్న మనుషులంగా మనం తెలుసుకోగలం, కానీ ఈ జన్మ కింతే అనుకొని భ్రమలని నమ్మకుండా వెళ్ళటమే మనం చేయవలసింది.
ReplyDeletechaala baaga chepparu fathima garu
ReplyDeletemee spandanaku dhanyavaadaalu.
Deleteఇది జీవితం...ఇదే జీవితం.
ReplyDeleteనాది కాని ఒక్కో క్షణం నన్ను చిద్రం చేసి .... అల్లాడుతున్నా కనికరించని అనుమానపు అంకుశం .... పదునైన ఆయుధం .... కలసిరాని కాలం నన్ను హింసించి చంపేందుకు సరదా పడుతుంటే .... శ్వాసించలేని ఆ క్షణాలతో.... ఇప్పటికింతే అని సరిపెట్టుకోవడమే జీవితమని సర్దిచెప్పుకున్నా!
ReplyDeleteఘాడమైన భావనల వచన కవిత్వం చదువుతున్న ఫీల్ "శ్వాసించని క్షణాలు" కవిత ద్వారా కలిగించిన కవయిత్రికి .... మరిన్ని ఉద్వేగభరిత కవితల్ని భావాల్ని మీ కలం నుంచి ఆశిస్తున్నానని తెలియపరుస్తూ .... "శ్వాసించని క్షణాలు" కవితను అభినందిస్తూ మీకు ధన్య అభినందనలు ఫాతిమా గారు!