నిన్ను తలచీ...నవ్వుకొంటే...
ఎవరన్నారు
నువ్వు ఎదగలేదనీ..
ఎవరన్నారు,
కల్లాకపటం ఎరుగని నిన్ను,
వెర్రివాడని.
ఏదీ తెలీని పసితనం
మాయలో, మంత్రాలో ఎరుగని
అమాయకం
చెట్టులా ఎదిగినా,
పొత్తిళ్ళ నాటిలా,
చీరకుచ్చిళ్ళు వదలని
చిన్నతనం.
తోటి పిల్లలు తూలనాడినా,
గేలిచేసినా,
చప్పట్లు కొట్టే
స్వచ్చదనం.
మీసాలు వస్తున్నా,
ముద్దలు పెట్టమనే
మొండి తనం.
తప్పేదో, ఒప్పేదో తెలీక
ఆశలూ, ఊసులూ అర్ధంకాని
నా వెనుక నక్కే
కుర్రతనం.
జోల్లు కారుస్తున్నావని,
చెల్లి విసుక్కున్నా,
మనసారా నవ్వుకొనే
మంచితనం.
రెక్కలొచ్చి అందరూ,
ఎగిరిపోయినా
అమ్మ కొంగు వదలని
ఆత్మీయం.
నీకై యోచిస్తూ
విలపించే నాకోసం
అపర భ్రహ్మ లా,
ఫోజిచ్చిన అమ్మతనం.
చాలా బాగుంది .
ReplyDeleteచెట్టులా ఎదిగినా,
పొత్తిళ్ళ నాటిలా,
చీరకుచ్చిళ్ళు వదలని
చిన్నతనం.
touching one
ReplyDeleteజోల్లు = బహుశ: అది సొల్లు కావొచ్చు..మరి జొల్లు ?
ReplyDeleteకవితావేశం చాల బావుంది.
రెక్కలొచ్చి అందరూ,
ReplyDeleteఎగిరిపోయినా
అమ్మ కొంగు వదలని
ఆత్మీయం......
చాలా బాగుంది ఫాతిమ గారు. మనం వాళ్ల గురించి చులకనగా చుస్తాం కాని అమ్మయకత్వంతో కూడిన వాళ్ల మంచి తనాన్ని ఎంత బాగా చెప్పారు. హృదయాన్ని హత్తుకునేలా ఉంది.