Pages

Monday, 23 June 2014

నీ తోడుకై.....,

    





     
     


    నీ తోడుకై.....,

    నిరీక్షణో..... తపస్సో తెలీదు,

    ఉలి చేతపట్టి  కాలాన్ని తొలుస్తూ,

    మదినిండా ఎదురుచూపుల కవాతులైతే..,
    ఎదరంతా..,ఎగిసిపడే సాగర ఘోషే..,

    కాలమంతా  కాలుడై కాటేస్తుంటే..,

    కొత్త  స్వర్గాన్ని  సృష్టించాలనే   ఆశతో..,

    గుండెలో పాకుతున్న పొడి,పొడి పదాల్లో..,

    తడి నింపుకున్న తడబడే  తమకంతో... ,

    ఒలుకుతున్న  వాలు  పొద్దు,

    గాయం  చేసి  వెక్కిరించి సాగిపోతుంటే..,

    లోన  దాగిన  నీ తలపుల  వలపురంగును ,

    మనోపలకంపై  చిత్రించాలని చూస్తూ.., 

    కొత్త  కొమ్మవై  విస్తరిస్తూ  నీవూ...,

    రాలుపూవునై...,రంగు కోల్పోతూ నేనూ..,

    నిస్సారమైన  ఈ నిరీక్షణ,

    నిక్షిప్త  హృదయం  చాటున...,
    లక్ష్మణ రేఖను దాటలేనంటుంది.  









3 comments:

  1. అలనాడు రాధ తమాల వృక్షచ్చాయాల్లో
    వంశీ కృష్ణుడికై ఎదురు తెన్నులు చూస్తూ చూస్తూ
    తపించినతీరును గుర్తు చేస్తుంది మీ 'నీ తోడుకై '.

    "లోన దాగిన నీ తలపుల వలపురంగును ,
    మనోపలకంపై చిత్రించాలని చూస్తూ..,
    కొత్త కొమ్మవై విస్తరిస్తూ నీవూ...,
    రాలుపూవునై...,రంగు కోల్పోతూ నేనూ..,"

    .... కవిత లోని భావం , బాధ అన్నీ పై వాఖ్యాల్లో
    చాలా అందంగా వర్ణించారు ఫాతిమా గారూ.

    ఉద్రేకమైనా ..
    ఉద్భోధలైనా ..
    ప్రయాసలైనా ..
    ప్రేమ కవితైనా ...
    ఏదైనా రాయగల సత్తా మీకుంది.
    Hats off to you madam.

    మీ జ్ఞానసంపదకు మరో మారు 'salute ' చేస్తూ ..
    అభినందనలతో,
    *శ్రీపాద

    ReplyDelete
  2. ఎదనిండా ఎదురుచూపుల కవాతులైతే..,
    ఎదరంతా..,ఎగిసిపడే సాగర ఘోషే..,

    కొత్త కొమ్మవై విస్తరిస్తూ నీవూ...,
    రాలుపూవునై...,రంగు కోల్పోతూ నేనూ..,

    నిస్సారమైన ఈ నిరీక్షణ,
    నిక్షిప్త హృదయం చాటున...,

    ప్రతి పదం ప్రశంసార్హ మైనదే అయినా ...
    పొగడ్తలు పందిరి వేయకుండా ...
    సింపుల్గా మూడు మొగ్గలు పూయించి ...
    అంజలి ఘటిస్తూ ...

    ReplyDelete
  3. నిరీక్షణో..... తపస్సో ...., ఉలి చేతపట్టి కాలాన్ని తొలుస్తూ .... మదిలో ఎదురు చూపుల కవాతులైతే.., ఎదరంతా..,ఎగిసిపడే సాగర ఘోష.., కాలం కాలుడై కాటేస్తూ.., కొత్త స్వర్గం సృష్టించాలని..
    నీ తలపుల వలపును, మనోపలకంపై చిత్రించే తపనతో.., కొమ్మై విస్తరిస్తూ నీవూ..., రాలుపూవునై...,రంగు కోల్పోతూ నేను.., ఈ నిస్సార నిరీక్షణ, నిక్షిప్త హృదయం చాటున..., లక్ష్మణ రేఖను దాటలేక

    ఎంతో లోతైన భావనలు మళ్ళీ మళ్ళీ చదివితే కానీ ర్ధం కాక అర్ధమయ్యేకొద్దీ అర్ధం ఇనుమడిస్తూ .... నీ తోడుకై కవిత
    చాలా బాగుంది
    అభినందనలు మెరాజ్ గారు!

    ReplyDelete