మన్నూ,మిన్నూ ఏకం చేసి,
ఎదురు తెన్నుల నయనాలు నీకై ,
దారంతా పరచి ఉంచాను.
తనివి తీరని ఆశా దాహంతో,
గుండె ఆర్చుకుపోతుంటే,
ఎద తలపుల తడితో తమీ తీర్చాను.
సడిచేయని నిశిరాతిరి ... ఈ వీధి నిశ్శబ్దంతో
జత కడుతూ.. నా కన్నీటి మడుగులో,
నీ ప్రతిబింభాన్ని చూస్తున్నాను.
ఊహల చరణాలను వల్లెవేస్తూ,
ఊపిరి నిట్టూర్పులతో పల్లవిస్తూ,
నీకై అన్వేషిస్తున్నాను .
నెమరువేతలు పచ్చిగాయాలై,
నిదురలేని నయనాలు నిప్పుకణికలై,
నెత్తురొలుకుతున్నాయి.
నిప్పుల నెగడులో ఎదకాగు నిండా,
వ్యద వంపుకొని మరణరహిత సమీరాన్నై,
సంచరిస్తున్నాను.
నీ తలపుల తోటలో..,
నెత్తుటి పూల నెత్తావినై..,
నీకై పరాగమై పరుగెత్తుతున్నాను.
నా ప్రాణమా...,
ఓ మారు ఈ దారివంట నడిచి వెళ్ళు,
నీపాదాలు కందకుండా..,
నా అరిచేతులపై నడిపిస్తాను.
ఫాతిమా బెహన్ జీ ,
ReplyDeleteకవిత బాగున్నది , కాకుంటే క్రమం కొంచెం మారిస్తే ఇంకా అద్భుతంగా వుంటుందనిపించింది .
ప్రతి మూడిణ్ట , ఆఖరున "ను" తీస్తే కవితకు అందం వస్తుందనిపించింది .
ఈ కమెంటుని అవసరమైనంతవరకు వుంచవలసినది . అవసరం లేకుంటే తీసివేసినా ఫరవాలేదు .
భాయ్ సాబ్, నాకు కావ్లసింది ఇలాంటి కామెంట్సే..,
ReplyDeleteనన్ను సరిదిద్దేవీ, నాచేత ఇంకా బాగా రాయింపచేసేవేఏ ఇవే.
ఇది ఒక సోదరునితో... పోటీ పడి అతి కొద్ది సమయాన రాసినది. నిజమే... నేను గమనించాను .." ను" వల్లా ఎక్కడికక్కడ పూర్తీయిన భావన కలుగుతుంది... ధన్యవాదాలు మీకు.
మన్నూ, మిన్నూ ఏకం చేసి .... ఎదురు తెన్నుల నయనాలు నీకై దారంతా పరచి ........ సడిలేని నిశిరాతిరి .... మా వీధితో జత కట్టి .... కన్నీటి మడుగులో, నీ ప్రతిబింబం చూస్తూ .... ఊహల చరణాలు వల్లెవేస్తూ, ఊపిరి నిట్టూర్పులు పల్లవిస్తూ .... నీకై అన్వేషణ
ReplyDeleteనెమరువేతలు పచ్చిగాయాలు నిద్దురరాని నయనాలు నిప్పుకణికలు నెత్తురులొలుకుతూ .... సంచరిస్తున్నాను. నిప్పుల నెగడులో ఎదకాగు నిండా, వ్యద వంపుకొన్న మరణరహిత సమీరాన్నై,..... ఓ మారు మా దారివెంట నడిచి వెళ్ళవా, నీపాదాలు కందకుండా నా అరిచేతులు అడ్డువేసేందుకు సిద్దంగా నిరీక్షిస్తున్నా .... ఓ ప్రాణమా ...., నా ప్రాణమా!
ప్రాణమంతా ఒక్కరిపైనే పెట్టుకున్న మనోభావనల భావరాగ పరాకాష్ట ఈ కవిత
చాలా బాగుంది
అభినందనలు మెరాజ్ గారు!
నా కవిత కు కొత్త విష్లేషణ నిచ్చే మీ వాఖ్యలు సంతోషాన్నిస్తాయి.
ReplyDeleteధన్యవాదాలు సర్.