Pages

Thursday, 26 June 2014

నీకై...వేచి.

    


    






    నీకై...,

    నీ ప్రతి కదలికా 
    ఓ కడలి అలై...,

    నీ ప్రతి చర్యా..,
    ఓ  సంకేతమై....,

    నీ ప్రతి  తలపూ...,
    ఓ నిట్టూరుపై .., 

    ఈ  జీవితమూ..,
    బహు భారమై..,

    నీవు  ఊహించగలవా..?
    నేనిలా గుండెకోతను  రాతగా మార్చుకున్నానని. 

    నీకు తెలుసా...? 
    బ్రతుకు  పరాదీనమైనదనీ..,
    అగోచర అభిమానాల్లో..... , 
    అక్షరీకరించలేని కావ్యమైనదనీ... ,
    కంటి నీటిని  కలం సిరాగా   వాడుకొని,
    కరకు పాళీతో  విరహపు   కవిత రాస్తుందనీ...., 


  

5 comments:

  1. తెలిస్తే ఇన్ని బాధలు ఎందుకు మీరజ్.....

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete

  3. ఫాతిమా గారూ !

    అద్భుత మైన కవిత ఇది.
    మీ కవితలకు భిన్నం గానూ
    చాలా అపూర్వంగానూ ఉంది.
    కొన్ని భావాలైతే చాలా అద్భుతంగా
    కుదిరాయి.

    " నీకు తెలుసా...?
    బ్రతుకు పరాదీనమైనదనీ..,
    అగోచర అభిమానాల్లో..... ,
    అక్షరీకరించలేని కావ్యమైనదనీ... ,
    కంటి నీటిని కలం సిరాగా వాడుకొని,
    కరకు పాళీతో విరహపు కవిత రాస్తుందనీ....,

    మంచి కవితనందించిన మీకు అభినందనలతో పాటు
    ధన్యవాదాలు కూడానూ ఫాతిమా జీ.

    *శ్రీపాద

    ReplyDelete
  4. బిన్న రీతిన రాసిన కవితకు అంతే భిన్నంగా స్పందించిన మీకు నా ధన్యవాదాలు సర్.

    ReplyDelete