రాగం పరాగమైతే.... ,
ముందుకు వేసే ప్రతి అడుగూ ..,
చీకట్లో తడబడుతూ.. తూలిపోతున్నట్లూ ,
కొన్ని కల్పనలు వాస్త రూపాన,
చిక్కటి అభిమానాన్ని చిలుకుతున్నట్లూ,
నాకు నేనే నప్పని ఎన్నో వైనాలు,
నన్ను నేను చిన్నబుచ్చుకునే
ఎన్నో సందర్బాలూ....,
అంతరంగ మనొవేధనే ఎప్పుడూ..,
అజ్ఞాత తెరువరిలా....,అరుదెంచుతుంటే,
మినుగురునై వెతికే సమయాన రెక్కలు తెగి,
గాయం మీది గాయం..
నను మరింత మానవీయం చేస్తుంది.
దూరాన నీవున్న పూలసౌధమూ ,
నీ చుట్టూ నర్తించే దీపకాంతీ...,
నా జైలు గోడలను పరామర్శిస్తుంది.
ఆ కాంతి ఏ నడిరేయినో..నన్నాలింగించుకొని,
ఓదార్చి నా గుండెలపై క్రీనీడలా తేలుతూ,
నా మనోగతమై నిలుస్తుంది.
అందుకే...,
తెగనరికిన ఈ మోడును,
చిగురులెత్తించటము నీ తరం కాదు,
స్వాతి చినుకువై..... అమని చెక్కిలి ముద్దాడు,
అలిగిన ఇంట మలిగిన దివ్వె,
వడిశిల తగిలిన విహంగమై..,
నుసిగా...... నేలరాలి ..,
నీ అరికాలిని దిష్టి చుక్కగా ముద్దాడునేమో.....
చాలా బావుంది. "ఆందుకే" తరువాత ఉన్న పదబంధాల్ని క్రొత కవితగా పొందుపరిస్తే బావుంటుందేమో?
ReplyDeleteనిజమే..మీ సలహా బాగుంది.
Deleteనా బ్లాగ్ కి స్వాగతం.
మెరాజ్ ఫాతిమా గారు! శుభోదయం!!
ReplyDeleteకొన్ని కల్పనలు కొన్ని వాస్తవ రూపాలు చిక్కటి అభిమానాన్ని చిలుకరిస్తూ, నీవున్న ఆ పూలసౌధం, నీ చుట్టూ నర్తించే ఆ దీపకాంతి నన్నూ, నా జైలు గోడలను పరామర్శిస్తూ .... ఏ నడిరేయినో ఆ కాంతి వీలుచూసుకుని .... నన్నాలింగించుకొని, ఓదార్చుతూ నా మనోగతమై నిలుస్తూ ఉంది.
నిజం!
తెగనరికిన ఈ మోడు, చిగురులెత్తుతుందని ఆశించకు, స్వాతి చినుకువై..... అమనినైనా ముద్దాడు, అలిగిన ఇంట మలిగిన దివ్వె, వడిశిల తగిలిన విహంగమై.., నుసిగా నైనా నేలరాలి ..,నీ అరికాలిని దిష్టి చుక్కై ముద్దాడునేమో.....
బాధ, ఆవేశం, త్యాగం ప్రకృతి న్యాయం మూలాలుగా .... జీవితాధ్యయనం చేసి రాసిన .... అతి చక్కని కవిత
అభినందనలు
నా కవితకు మీరిచ్చిన విష్లేషణ చాలా బాగుంది సర్,
Deleteధన్యవాదాలు.
చంద్రగారన్నట్లు నిజంగా ఇది జీవితాన్ని ఎంతో అధ్యయనం చేసి రాసిన ఓ మంచి వాస్తవ రచన ,మీరజ్ చాలా బాగుంది .
ReplyDeleteదేవీ.., మనచుట్టూ జరిగే ఎన్నో అనుబవాలూ, భావాలే ఈ కవితలు.
Delete
ReplyDeleteఫాతిమా గారూ !
సరిలేరు మీకెవ్వరూ .. అంటేనే సరిపోతూందేమో మరి.
" నాకు నేనే నప్పని ఎన్నో వైనాలు,
నన్ను నేను చిన్నబుచ్చుకునే
ఎన్నో సందర్బాలూ....,
అంతరంగ మనొవేధనే ఎప్పుడూ..,
అజ్ఞాత తెరువరిలా....,అరుదెంచుతుంటే "
ఎంతో భావగర్భిత మైన భావాలివి.
మీకే సాధ్యం ఇలా చెప్పడం.
ఆనిముత్యాలతో ముగింపు పలికారు.
" అలిగిన ఇంట మలిగిన దివ్వె,
వడిశిల తగిలిన విహంగమై..,
నుసిగా...... నేలరాలి ..,
నీ అరికాలిని దిష్టి చుక్కగా ముద్దాడునేమో..... "
అపురూపమైన కవిత ఇది.
అందలం ఎక్కింది ఎప్పుడో తన సత్తా చూపించి.
అభినందనలు ఫాతిమా గారూ.
*శ్రీపాద
నాకు సరిలేకపోవటమేంటీ..,మీ వంటి వారు ఉన్నారుగా.
Deleteసర్, నేను ఈ సాహితీపోరాటాన ఓ చిన్ని ఆయుదాన్ని అంతే,
అతిరథమహారదులున్నారు...మీ స్పందనకు సంతోషం .