అమ్మంటే..... ?
చిట్టితల్లీ నిన్ను తనివి తీరా చూద్దామంటే,
కన్నీటి పొర అడ్డు పడి కనిపించటం లేదు.
వరాలతల్లీ అక్కలేరీ అని అడగకు,
అన్నలు నావెంట రారా అనీ అడగకు.
అడుగులు వడిగా పడనీ...అడ్డురాకు.
చీకటికి తడబడుతున్నా చప్పుడు చెయ్యకు.
ఆడపిల్ల వద్దనుకున్న ఈ ఇంట,
నా అమ్మతనాన్నే వదిలేసుకుంటున్నా
.
నా తల్లీ నిన్ను నిర్జీవిగా చూడటం కన్నా,
పరజీవిగా చూడటమే మేలనుకున్నా
అమ్మనే కానీ దానికంటే ముందు ఒకరికి ఆలిని,
అంతకంటే ఆర్దిక స్థోమత లేనిదాన్ని.
మిన్నగా ఉన్న ఈ మేడ ముందు నిన్నొదిలి వెళ్తున్నా,
క్షమించరా కన్నా ..నాకే దారీలేదు ఇంత కన్నా.
చిన్ని కన్నా... నిన్నే దర్మాత్ముడో ఆదరిస్తే,
నా వరాల పంటా.. ఈ అజ్ఞాత అమ్మ దీవెనలతో,
దిక్కులేని ఎందఱో ఆడపిల్లలకి ఆలంభనవై ,
ఈ అజ్ఞాత అమ్మ ఆయుషు కూడా పోసుకో..