Pages

Saturday, 2 February 2013

అనాద




అనాద

గోరుముద్దలు  పెట్టలేదు,
చిట్టికతలూ  చెప్పలేదు,

లాల పోయలేదు,
లాగు వేయలేదు.

చెత్త బుట్టలో పడేశావు,
చేతులు  దులుపుకున్నావు.

మాసిపోయిన పాతలూ,
మట్టి కోట్టుకున్న చేతులూ.

విదిలింపులూ, కదిలింపులూ,
ఇకిలింపులూ,సకిలింపులూ.

అమ్మ ఎలా ఉంటుందో  చూడాలనీ,
ఎందుకు కన్నదో నిలదీయాలనీ.

ఎలాంటి దయనీయ స్థితి  ఈ పనికి  పురికొల్పిందో?
ఎలాంటి కమనీయ స్థితి నీ కడుపున ఊపిరి పోసిందో?

పారవేసిన అమ్మ రాదు,
చేరదీసే అమ్మే లేదు.

జన్మనిచ్చిన  అమ్మని  జగమంతా వెతుకుతూ,
ప్రతి దయగల అమ్మ కళ్ళలో  తన జన్మని  వెతుకుతూ.....





4 comments:

  1. మరీ గుండెలు పిండేలా అనాధల గురించి చెప్పేస్తే.......

    ReplyDelete
  2. యేమి చేయాలి అలా రాస్తే తప్ప హ్రుద్యమున్న మీ లాంటి వారి దర్సనం కావటం లేదు. నమస్తే సర్.

    ReplyDelete
  3. అనాద = నాదము లేనిదనా?

    ReplyDelete
  4. సారీ... అది అనాథ. (అప్పుతచ్హు:-) )

    ReplyDelete