అమ్మంటే..... ?
చిట్టితల్లీ నిన్ను తనివి తీరా చూద్దామంటే,
కన్నీటి పొర అడ్డు పడి కనిపించటం లేదు.
వరాలతల్లీ అక్కలేరీ అని అడగకు,
అన్నలు నావెంట రారా అనీ అడగకు.
అడుగులు వడిగా పడనీ...అడ్డురాకు.
చీకటికి తడబడుతున్నా చప్పుడు చెయ్యకు.
ఆడపిల్ల వద్దనుకున్న ఈ ఇంట,
నా అమ్మతనాన్నే వదిలేసుకుంటున్నా
.
నా తల్లీ నిన్ను నిర్జీవిగా చూడటం కన్నా,
పరజీవిగా చూడటమే మేలనుకున్నా
అమ్మనే కానీ దానికంటే ముందు ఒకరికి ఆలిని,
అంతకంటే ఆర్దిక స్థోమత లేనిదాన్ని.
మిన్నగా ఉన్న ఈ మేడ ముందు నిన్నొదిలి వెళ్తున్నా,
క్షమించరా కన్నా ..నాకే దారీలేదు ఇంత కన్నా.
చిన్ని కన్నా... నిన్నే దర్మాత్ముడో ఆదరిస్తే,
నా వరాల పంటా.. ఈ అజ్ఞాత అమ్మ దీవెనలతో,
దిక్కులేని ఎందఱో ఆడపిల్లలకి ఆలంభనవై ,
ఈ అజ్ఞాత అమ్మ ఆయుషు కూడా పోసుకో..
బాగా వ్రాశారు ఫాతిమా గారు!
ReplyDeleteమీకు నా బ్లాగ్ కి స్వాగతం. నచ్హినందుకు ధన్యవాదాలు.
Deleteబాగుంది ఫాతిమా గారు
ReplyDeleteచిన్ని గారూ, ధన్యవాదాలు.
Deleteకవిత బాగుంది అండి... కాని బిడ్డను వదిలేయటం బాగోలేదు అలా చేస్తే అమ్మ అంటారా ???
ReplyDeleteనిజమే కానీ కొన్ని పరిస్థితులు అలా ఉంటాయి మరి, థాంక్స్ మీ స్పందనకు.
Deleteహర్షా, ధన్యవాదాలు.
ReplyDeleteMADAM MEE SAMAJIKA SPRUHA ADHBHUTHAM.
ReplyDeleteబాగుంది
ReplyDelete