తప్పుకుం(టా)టూ
కుక్కలు గతికిన
ఎంగిలాకుల్లో
పరమాన్నాలు వెతుకుతూ ...
పందులు దొర్లే
మురికి గుంటల్లో,
చిరుగు బట్టలు ఉతుకుతూ...
పాలితిన్ సంచుల
చిల్లు డేరాల్లో,
జీవనం సాగిస్తూ,
దోమల దండులో,
నా శరీరాన్ని నేనే,
రాత్రంతా వెతుకుతూ...
మాంత్రికుని శాపంలో,
చిలకగా మారి,
ఆకలి పంజరంలో బందీ అవుతూ...
జనాబా లెక్కల్లో ,
ఆడో,మాగో అర్ధం కానట్టూ,
అసలు మనిషినన్న స్పృహే లేనట్టూ....
నన్ను చూసీ చూడనట్టు,
నటించే నీతో, నావంతుగా
నేనూ నీతో ఏకీభవిస్తూ ....
భారతీయులంతా,
నా సహోదరులే కానీ
నేను మాత్రమే మీకేమీ కానని అనుకుంటూ....
భారతీయులంతా,
ReplyDeleteనా సహోదరులే కానీ
"నేను మాత్రమే మీకేమీ కానని అనుకుంటూ.... "
beautiful గ చెప్పారండి.
చిన్నప్పటినుండి "భారతీయులందరూ .....
అని చదువుకుంటున్నాము.అయితే ఎక్కువ శాతం ఫాలో కారనేది నా ఉద్దేశ్యం,నా observation కూడా.ఎందుకంటే చాలా చిన్నవిషయాల్లోనే-
అంటే for example-బస్సుల్లోగాని,ట్రైన్సుల్లో గాని ROOM (seat) ఉన్నాకూడా వాళ్లకు offer చేయరు.offer చేయడమేంటి,అసలు వాళ్ళు అడిగినా కూడా ఇవ్వరు.ఇంత చిన్న విషయాల్ల్లోనే సోదర భావం కనపడదు.
ఇక వేరే విషయాల్లో ఉంటుందా!?
అందుకనే మీ చివరి ఈ line-నేను మాత్రమే మీకేమీ కానని అనుకుంటూ....
బాగా నచ్చింది .సూపర్బ్.keep it up.
మీరన్నది అక్షరాలా నిజం, వారిని సహోదరులుగా కాదు సాటి మనుషులుగా కూడా చూడం.
ReplyDeleteమీరన్నది అక్షరాలా నిజం, వారిని సహోదరులుగా కాదు సాటి మనుషులుగా కూడా చూడం.
ReplyDeleteచిన్న చిన్న మాటలతోనే శక్తివంతమైన కవితనల్లారు.
ReplyDeleteఉచిత సలహా అనుకోకపోతే ఒకమాట.మొదటి లైనులోనే ఆకలి దుస్థితిని సమర్థవంతంగా ఆవిష్కరించారు.మళ్ళీ క్రింది లైన్లలో దాన్నే స్పృశించారు.
మాంత్రికుని శాపంలో,
చిలకగా మారి,
ఆకలి పంజరంలో బందీ అవుతూ...
అవి లేకపోయినా కవిత ఔన్నత్యం తగ్గిపోదని నా ఉద్దేశ్యం
శ్రీకాంత్ గారూ, మీ సలహా నాకు నచ్హింది, ఇకముందు జాగ్రత్త పడతాను. నా బ్లాగ్ కి స్వాగతం.
ReplyDeleteభారతీయులంతా,
ReplyDeleteనా సహోదరులే కానీ
"నేను మాత్రమే మీకేమీ కానని అనుకుంటూ....బాగుంది ఫాతిమ గారు.