ఆశావాదిని
చెట్టంత కొడుకు
శవంగా మారితే..
తల కొరివి పెట్టిన నష్ట జాతకుణ్ణి.
నట్టింట కోడలి గాజులు
పగలగొడుతున్నా,
కట్టుబాట్లకు తలవంచిన అసమర్దుణ్ణి.
భుజాలమీద ఆడించిన,
నా రక్త బంధాన్ని,
భుజం మీద మోసిన దౌర్భాగ్యుణ్ణి.
విధి కి ఎదురొడ్డి
పోరాడ డానికే నిర్ణయించుకున్న
మట్టి పాము వంటి మధ్యతరగతి మనిషిని.
కోడలికి పూలూ, గాజులూ పెట్టి,
సీమంతం చేయించి,
కూతుర్ని చేసుకొన్న త్యాగపరుణ్ణి.
కొన్ని నెలల్లో ,
నా ఇంట బుడి బుడి అడుగులేసే,
నా రక్త బంధాన్ని ఆహ్వానించే ఆశావాదిని.
నా వంశం నిలవాలని,
మనవని కోసం కోడలిని,
నా ఇంటి చాకిరీకి వాడుకొన్న స్వార్దపరుణ్ణి.
ReplyDeleteభుజాలమీద ఆడించిన,
నా రక్త బంధాన్ని,
భుజం మీద మోసిన దౌర్భాగ్యుణ్ణి.
నిజంగా దౌర్భాగ్యులే అండి.
బాగుందండి
చక్కని రచనండీ.
ReplyDeleteహరి,ప్రసాద్ రావ్ గార్లకు నా వందనాలు.
Deleteమధ్య తరగతి జీవన చిత్రం ఇంతేనేమో ....బాగుంది ఫాతిమ గారు
ReplyDelete