కుంపటి
వెళ్ళింది.
అన్న తెచ్చిన వాడినే
మనువాడింది.
అమ్మ చెప్పినవన్నీ,
ఆలకించింది.
అక్క వెళ్ళినట్లే ఏడుస్తూ,
వెళ్ళింది.
అయినా అత్తింట కొత్త కుంపటి అయింది.......
మామగారి మీసానికి
వెరసింది,
మగని మగ రోషానికి
జడిసింది.
అత్తగారి ఆరళ్ళను,
భరించింది,
ఆడపడచుల కోరికల చిట్టా,
తీర్చింది.
అయనా కుంపటి వారికీ భారమైంది(పాతదైంది )
అందుకే కుంపటి చితిపై కూర్చుంది.
కాలి బూడిదైంది... తేలికైంది.
ee kaveta nu mansu hattu konaala ruupondencharu.
ReplyDeleteఈ కవిత చదివాక మనసంతా భారమైంది :-(
ReplyDeleteచాలా హృద్యంగా ఉందండి మెరాజ్ గారు.
ReplyDeleteఅందుకే కుంపటి చితిపై కూర్చుంది.
ReplyDeleteకాలి బూడిదైంది... తేలికైంది.
ఈ రెండు లైన్లలో నేటి కోడలి దుస్థితి చాలా బాగా విసదీకరించారండి!
hatsoff to you.
Hari, bhaarati, telugammaayi,saambu gaarlaku naa nammassulu.
ReplyDeleteso sad:(
ReplyDeleteపరిస్థితిని మనసును అత్తుకునేలా కవిత్వీకరించారు..
ReplyDelete