చిరాకెందుకో ....
చీటికి,మాటికి చిరాకు పడతాడు,
మా బావ చచ్చినోడు,
అయినా ఏమిచేయలేను,
ఎందుకంటే వాడు నాకు నచ్చినోడు .
పొద్దుగాలనే లేపు
పొలాని కెళ్ళాలి అన్నాడు,
ఆడి కాలికి కోడెదూడని కట్టేసాను,
అదీడ్చు కెళితే నా తప్పా..?
సినిమా కెళ్లదామె,
నీ చెల్లిని వెంట పెట్టుకురా అన్నాడు,
ఆడి చెల్లిని తీసుకెళ్ళాను,
అరె మూతి ముడుసుకున్నాడు...
అత్తంటే పెద్దదిక్కే ఎర్రిమోఖమా,
అంటాడు కదా, ఆడి అత్తయితే,
సంతోషిస్తాడని మా అత్తని ఎల్లగొట్టి ,
ఆడత్తని పిలిపించినా.. అయినా మూతి ముడుపే...
నన్ను "నువ్వే నా బంగారం" అంటాడు,
అందుకే నా ఒంటిమీది బంగారం
మా చెల్లికేట్టి దాని మనువు జరిపించినా
మంచిపనే కదా చేసినాను అయినా చిర్రు,బుర్రులె.
మేడారం జాతర కెళ్లితే,
సందట్లో తప్పిపోటాడని,
పక్కన తప్పెట్లు పెట్టిన్చినా,
అరె, అగమానం అంటాడే.....
హహః...మేరాజ్ గారూ!....ఎంతమంది అనుకుంటారో మీ బావ అవ్వక పోవడం ఎంత మంచిదయిందో అని........బాగుంది....:-) అత్తంటే పెద్దదిక్కే ఎర్రిమోఖమా,
ReplyDeleteఅంటాడు కదా, ఆడి అత్తయితే,
సంతోషిస్తాడని మా అత్తని ఎల్లగొట్టి ,
ఆడత్తని పిలిపించినా.. అయినా మూతి ముడుపే... ఇలాంటి మరదలు హమ్మో ...హమ్మో...:-)...@శ్రీ
శ్రీ గారూ, అంతేనంటారా..అయినా ఎవరేమంకుంటే యెమండీ మా బావ బంగారు.
Deleteపొద్దుగాలనే లేపు
ReplyDeleteపొలాని కెళ్ళాలి అన్నాడు,
ఆడి కాలికి కోడెదూడని కట్టేసాను,
అదీడ్చు కెళితే నా తప్పా..?
సినిమా కెళ్లదామె,
నీ చెల్లిని వెంట పెట్టుకురా అన్నాడు,
ఆడి చెల్లిని తీసుకెళ్ళాను,
అరె మూతి ముడుసుకున్నాడు...
ఈ కవిత చాలా గమ్మత్తుగా అనిపించింది ఫాతిమాగారు. అల్లాహ్ మీకు తోడుండుగాక! ఆమీన్!
ఆప్ కా కామెంట్ దేక్కర్ బహుత్ ఖుష్ హోగ్యా మైనే. ఆపకా దువా ఖుబూల్ హోగా, అస్సలామలైకుం .
Deleteఅంతేనండి.....బావకేం ఎరుక పాపం మరదలెంత ఎర్రిదో :-)
ReplyDeleteThis comment has been removed by the author.
Deleteపద్మా ఇక నుండి గడుసుగా ఉంటాను :-)
Deleteసినిమా కెళ్లదామె,
ReplyDeleteనీ చెల్లిని వెంట పెట్టుకురా అన్నాడు,
ఆడి చెల్లిని తీసుకెళ్ళాను,
అరె మూతి ముడుసుకున్నాడు...
magaalla manastatwaanni chaalaa baagaa cheppaaru.
simply superb.ee vishayam paine nenoka post pettaanu-
MY DRESS IS NOT A YES ane title tho.chadivi mee comment pettaroo
తప్పకుండా చూస్తాను.
Deleteఈ మరదలు మాణిక్యం...
ReplyDeleteజ్యొతి కొంచం మా పద్మ కి చెప్పవా నన్ను ఎర్ర్రిది అనుకుంటుంది పిచ్హితల్లి.
Deleteమరి అలా చేస్తే బావగారికి చిరాకు రాదేటి? ;)
ReplyDeleteనిజమే..
Deletebagundi
ReplyDeleteచిరాకు తప్పించే బుగ్గమీద చిన్ని ముద్దు గుర్తుకు రాఆలేదేమో చిన్నారికి
అయ్యొ... తట్టనే లేదు మట్టి బుర్రకి.:-)
Deleteహహహ.... గడసరి మరదలు. చాలా బాగుంది మెరాజ్ గారు.
ReplyDeleteభారతి , చాలా సంతోషం మీ స్పందనకు.
Deletebaavalu anta ante maradallu anta inte
ReplyDeleteకదా, మరదళ్ళు లేని వాళ్ళు సర్దాగా ఉండలేరు.
Deleteమీ కవితలు చదివిన తరువాత నాకు కవితలు రాయాలనిపించి నేను కూడా ఓ కవితా బ్లాగ్ ప్రారంభించాను ఫాతిమా గారు.కానీ మీ అంత కవితా పాండిత్యం నాకు ఏ మాత్రం లేదు సుమా!
ReplyDeletehttp://muthyapuchinuku.blogspot.in
ahmed chowdary గారు,
Deleteమీ పేరు నన్ను ఆకర్షించింది.
మీ పేరు లౌకిక వాదాన్ని తెలియపరుస్తోంది.
మీ ముత్యుపు చినుకు బ్లాగ్ లో మీ కవితను చదివాను.
బాగా వ్రాసారు.
" కానీ...కానీ...ప్రకృతి నంతటినీ సింగారించుకున్న నీవు మాత్రం
నన్ను ఏనాడూ ఓదార్చలేదు".
మీ చెలీ మిమ్ములను కరుణించి, ఓదారుస్తుంది,
మీరు ఇలాగే కవితలు రాస్తుంటే.
u r doing well.please continue.
good luck.
Hari గారూ, మీ అభిమానం కూడ బేద ద భావాలు లేకుండా ఉంటుంది కదా.
Deleteతప్పకుండా రాయగలరు, చదివే మంచి అభిరుచి ఉంది కనుక తప్పకుండా రాయగలరు, మీ అభిమానానికి సంతొషం.
ReplyDeleteఈ కొంటె మరదలితో బావ ఎలా ఏగుతున్నాడో ఎమో పాపం
ReplyDelete