Pages

Saturday, 16 February 2013

చేతులు.










చేతులు


పాలబువ్వ  తినిపించి,
నిన్ను  మరిపించిన  చేతులు .

వళ్ళంతా  రుద్ది
నిన్ను శుద్దిచేసిన చేతులు.

ముక్కు తుడిచి,
నిన్ను ముద్దుచేసిన చేతులు.

వేడి అన్నాన్ని,ఆర్చుకు,మార్చుకు,
ఊది తినిపించిన చేతులు

గుండెకు హత్తుకొని,
పాలిచ్చి  పాలించిన చేతులు.

పోలమారిన నీకు పలుమార్లు,
నెత్తిన సుతారంగా కొట్టిన చేతులు.

కాల చక్రాన్ని తిప్పి,
కాయలు కాచిన చేతులు.


నీ రాత దిద్దుతూ..తన రేఖలను అరగదీసుకున్న  చేతులు.
పొట్టకోసం, బట్టకోసం శక్తి ఉడిగి  నీ ముందు చాపిన  ఆ చేతులు.

చిరుగు కొంగున దాచిన తాయిలం .. నీకీ రోజు,
సిల్క్ కొంగున దొరుకుతుందేమో చూడు.... చూడు, చూడు,

నువ్వు ఓ సారి  బాల్యం లోకెళ్ళి.. చూడు.
అక్కడ  నీ ప్రతి  అడుగూకూ  ... ఆసరా ఇచ్చింది  ఈ చేతులే


ముసలితనంలో  ముడతలు పడ్డ ఆ చేతులు,
ముద్ద  కోసం  నీ ముందు   చాపిన రోజు,
నువ్వు దాటింది ఉమ్మ నీరు కాదు, స్వార్ధపు  సెలయేరు.




8 comments:


  1. "నువ్వు దాటింది ఉమ్మ నీరు కాదు, స్వార్ధపు సెలయేరు."

    మేరాజ్ గారు,మీకు జోహార్లండి!
    what a beautiful illusion.excellent andi.superb andi.
    నీది "స్వార్థం" అని చెప్పడమే కాకుండ,చాలా చాలా స్వార్థం అని,ఆ స్వార్థాన్ని సెలయేరుతో పోల్చడం రియల్లీ గ్రేట్ .ఎక్కువ
    స్వార్థం అని చెప్పటం చాలా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. హరి గారూ, మీ వివరణ చాలా బాగుంటుంది. సర్, మీరు చాలా రోజుల వరకూ కనిపించలేదు బ్లాగ్ లో, మీకు ఎఫ్.బి ఉంటే నా ఎఫ్.బి. లో కవితలు చూడండి.

      Delete
  2. nuvvu దాటింది....... దాటి పోతున్న వారు ఒక్కసారి చదివితే అనిపించింది కానీ దాటి పోయేవారికి ఈ అనుభూతులు ఉన్తాయి అనుకోవడం పిచ్చే!
    చాలా బాగుంది మీరాజ్.
    లక్ష్మి రాఘవ

    ReplyDelete
  3. "నువ్వు ఓ సారి బాల్యం లోకెళ్ళి.. చూడు.
    అక్కడ నీ ప్రతి అడుగూకూ ... ఆసరా ఇచ్చింది ఈ చేతులే"

    ఎప్పటికీ మర్చిపోకూడని గొప్ప విషయాలు చాలా బాగా చెప్పారండీ..

    ReplyDelete
  4. లక్ష్మి గారూ, రాజీ గారూ, మీరు మెచ్హటం నా అద్రుస్టం అనుకుంటాను. నిజమే కదా ఆ చెతులు ఎంత పవిత్రమో..

    ReplyDelete
  5. లక్ష్మి గారూ, రాజీ గారూ, మీరు మెచ్హటం నా అద్రుస్టం అనుకుంటాను. నిజమే కదా ఆ చెతులు ఎంత పవిత్రమో..

    ReplyDelete
  6. "నువ్వు ఓ సారి బాల్యం లోకెళ్ళి.. చూడు.
    అక్కడ నీ ప్రతి అడుగూకూ ... ఆసరా ఇచ్చింది ఈ చేతులే"....నిజమే కదా ..చాలా బాగుంది ఫాతిమ గారు

    ReplyDelete