Pages

Monday, 4 February 2013

మూగ వేదన














మూగ వేదన 

గుండెకు  స్పందన నేర్పి,
బ్రతుకు  బాటను  చూపి,
శ్వాసను   తీసుకెళ్ళావు.

కనుపాపల  పలకలపై,
నే నచ్చిన  నీ చిత్రాన్ని  గీసి,
చూపును  తీసుకెళ్ళావు.

మది వాకిట వలపు తోరణమై,
తనువును  పులకింపజేసి,
బాటసారివై  సాగిపోయావు.

ఎడారి   ప్రస్తానములో,
సైకత  తెరువరినైతే,
ఎండమావువై  వెక్కిరించావు.

నా  మది  విషాద  వేదికపై,
నిశీది   నాటకానికి,
కన్నీటి  అంకం  పలికావు.

ఆశల   అంపశయ్యపై,
మూన్నాళ్ళ ముచ్చటకై,
మూగ సాక్షిని  చేసావు.







  

5 comments:

  1. ఆశల అంపశయ్య అన్నది అద్భుతంగా ఉంది.
    మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అనుకోవద్దు!
    మీ పదాల పొందిక మరెక్కడా కనరాదు!
    శుభాభినందనలు!!

    ReplyDelete
  2. ee kaveta ku add chasena photo chala bagunde

    ReplyDelete
  3. సర్, మీ అభిమానానికి నా నమస్సులు. సాంబు గారు మీ స్పందనకు సంతొషం.

    ReplyDelete
  4. శ్రీ ఫాతిమాగారికి, నమస్కారములు.

    కవిత చాలా చక్కగా,లోతైన భావంతో వున్నది. ఈ కవితలో `జీవాత్మ, పరమాత్మతో మొరపెట్టుకున్నట్లు' వున్నది.

    మీ స్నేహశీలి,
    మాధవరావు.

    ReplyDelete
  5. మాదవ రావ్ సర్, క్రుతగ్నతలు.

    ReplyDelete