శరం
నిన్ను గుచ్చే బాణం,
నిన్ను చేదించే బాణం ,
నిన్ను బాదించే బాణం.
మలినం లేని నవ్వును,
కాల్చి మాడ్చి వేసి,
ముఖానికి మసి పూస్తుంది.
కళ్ళలోని కాంతిని ,
వెతికి,వెతికి కోసి,
నేల చూపుల్లోకి విసిరేస్తుంది.
నిన్ను వేదించి,
వెటకారంతో శోదించి,
ఎదుట పడకుండా చేస్తుంది.
మాటల తూటాలతో,
ముఖం లో నవ్వును,
మాయం చేస్తుంది.
నీ చితిమంటల్లో,
ఎవరి ఆకృతినో వెతికి,
నీ తలపులనూ తరిమేస్తుంది.
గురి చూసి వదిలిన,
అనుమానపు శరం,
గుండెనే చీల్చుతుంది.
"గురి చూసి వదిలిన,
ReplyDeleteఅనుమానపు శరం,
గుండెనే చీల్చుతుంది"
Too Good.
పద్మగారూ, మీ స్పందనకు ధన్యవాదాలు.
Deletevery good kavita
ReplyDeleteసాంబు గారూ, ధన్యవాదాలు.
Deleteచేదించే = చేదించే
ReplyDeleteబాదించే = బాధించే
దోషములనిపించలేదా?
నిజమే, పరుగే పరుగు అంతె .
ReplyDeleteశ్రీ ఫాతిమా గారికి, నమస్కారములు.
ReplyDeleteఈ కవిత నాకు తికమకగా వున్నది. నాకు అర్ధమయినంతవరకూ, నా విశ్లేషణ:-
ఈ శరము వేరేవాళ్లు నా పైన వెయ్యబడిందని అనుకుంటే, శరానికి ఛేదించే గుణం వుంటుంది.
* నా మనస్సు మకిలం కానిది అయితే, నా నవ్వు నిర్మలంగా వుంటుంది. అప్పుడు ఆ బాణం నా నవ్వును ఎలా కాల్చి, మాడ్చి, మసి పూస్తుంది;
* నా మనస్సు నిర్మలమైనది అయినప్పుడు నా కళ్ళల్లోని కాంతిని ఎట్లా తీసేస్తుంది?
* నా మనస్సు నిర్భయమయినప్పుడు, మాటల తూటాలతో ఎట్లా నవ్వును మాయం చేస్తుంది;
* నా మనస్సు, బుద్ధి నిరుపమానం అయినప్పుడు ఆ అనుమానపుబాణం ఎట్లా నా గుండెను చీలుస్తుంది?
దయచేసి నా సంశయాలను నివృత్తి చేయగలరు.
మీ స్నేహశీలి,
మాధవరావు.
మీ ఉద్దెస్యం మనస్సు నిర్మలంగా ఉంటే, అలాగే ఉండనిస్తారనే కదా మీరు అనేది. నెవ్వర్....ఈ అనుమానం అనేది మనల్ని ఎదుటి వాళ్ళు ఎలా హింసపెట్టగలరూ చెప్పాను, అనుమానితులు మనల్ని శాంతంగా ఉండనివ్వరు.
ReplyDelete