Pages

Thursday, 12 December 2013

నా... చెలి

     





    నా... చెలి, 

     ఓనాటి   అందమైన జీవన  మలుపులో,
     తను నాకు  తారసపడింది.

     నా  మట్టి  హృదయాన   ప్రేమను విత్తి,
     చిరుమొలకై  అంకురించింది.

     నిత్య  జ్ఞాపకమై నన్ను   వెన్నాడుతూ,
     కాలాన్ని కట్టిపడేసింది.

     అర్ధంకాని  ప్రపంచాన,నిద్దురలేని లోకాన,
     నన్ను నిర్దాక్షిణ్యంగా  నెట్టివేసింది. 

     అంతదూరం  ఎందుకెళ్ళావని అలుకలుపోయి,
     బుంగమూతితో  బులిపిస్తుంది.

     అంతలోనే నా మనో..గాయానికి  మందువేసే,
     ధన్వంతరి  నీవేనని  దైర్యపడుతుంది.

     మురిపించి,మరపించి వలపుల వలవేస్తే,
     ఎక్కడైనా చెలినేగానీ  వలపుతోటలో కాదంటుంది.

     పిలుపుగాలం వేసి... సమూహం నుండి వేరుచేసి 
     పక్కున  నవ్వి  వెక్కిరిస్తుంది.

     ఊగిసలాడే  ఊహలమద్య  ఊపిరిపోసుకుంటూ,
     నా  ఎదపై వాలి   సేదతీరుతానంటుంది.

     అక్షర,అక్షరాన  నన్ను  నింపుకున్న
     నా  చెలి  ఓ  నడిచే పుస్తకం.

     నన్ను చంద్రునిగా భావించిన  
     నా చెలి  ఓ  వెన్నెల  సంతకం. 

  






20 comments:

  1. మీ అందమైన జీవిత మలుపులో చిరుమొలకై అంకురించి , బుంగమూతితో బులిపించి , వలచి , పిలచి , అలరించిన ఆ నెచ్చెలి చంద్రుని అంత చల్లగా , వెన్నెల అంత హాయిగా ఉంది మీరజ్ . చాలా బాగుంది కవిత .

    ReplyDelete
    Replies
    1. దేవీ, మీ లాగే స్త్రీ హ్రుదయం కదా అందుకే మీకంత చల్లగా కనిపిస్తుంది.
      ధన్యవాదాలు మీ ప్రశంసకు.

      Delete
  2. మీ చెలి నాకెంతో నచ్చింది

    ReplyDelete
    Replies
    1. అందుకే.. మీ కవితల్లోనూ,చిత్రాల్లోనూ తనే కనిపిస్తుంది.
      మీలా సున్నిత హ్రుదయాలకు నా చెలి తప్పక నచ్చుతుంది.
      పద్మా... ధన్యవాదాలు.

      Delete
  3. Very beautiful expression!!

    ReplyDelete
  4. చెలి మనసెరిగిన,
    చెలి కాడి మనసు,
    మీకింత బాగా ఎలా తెలిసింది?
    'మనో స్కానర్' ఎప్పుడు కొన్నారు ?
    'మానసిక శాస్త్రం'ఎప్పుడు నేర్చుకున్నారు ?

    ReplyDelete
    Replies
    1. చూశారా..మానసిక వైద్య నిపుణులు మీకే అంతుచిక్కని చెలి మనస్సు నేను పట్టేయగలిగాను.
      "మనోస్కానర్ " లో ఇంకా ఎన్నో చూడాలి.
      ఇక మానసిక శాస్త్రం అంటారా... సహవాసదోషం :-))
      (సర్, మీ స్పందనకు ధన్యవాదాలు).

      Delete
  5. జీవితం మలుపులో తారసపడిన ఒక అందం నా....చెలి .... ఈ మట్టి హృదయాన ప్రేమమొలకై అంకురించి, మురిపించి, మరపించి వలపుల వలవేస్తే, ఎక్కడైనా కానీ .... వలపుతోటలో మాత్రం కాను "చెలిని" అంటూ .... బ్రతిమాలితే పక్కున నవ్వి వె క్కిరిస్తూ, సరిలెమ్మని సర్ధుకుపోతుంటుంటే ఊపిరిపోసుకున్న వయ్యారం లా, నా ఎదపై వాలి సేదతీరుతానంటుంది.
    నిజానికి, నా చెలి .... అక్షర, అక్షరాన నన్ను నింపుకున్న ఓ నడిచే పుస్తకం. నన్నే చంద్రునిగా భావించిన ఓ వెన్నెల సంతకం.
    వేసవి వేళల్లో అయితే మరీనూ .... వేచి చూడాలనిపించేలా .... ఎంతో చల్లగా చాలా చాలా బాగా వుంది ఆ చెలికాడి భావనల్లో చెలి స్థానం. అభినందనలు మెరాజ్ ఫాతిమా గారు!

    ReplyDelete
    Replies
    1. చంద్ర గారూ, చల్లని చంద్రుని కొసం చెలి మనో భావనలు మీ వాఖ్యలో అభివర్నించారు.
      ధన్యవాదాలు మీ స్పందనకు.

      Delete
  6. `కన్ను గిలిగిస్తాది నన్ను బులిపిస్తాది` అని నండూరిసుబ్బారావు గారు ఎంకి పాటల్లో రాసిన `బులిపించడం` అనే మాట మళ్ళీ మీ కవితలో చూశాను. మీ కవిత ఎప్పటిలాగానే చాలా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. చూశారా.. నాఅచెలి నండూరివారి "ఎంకి " ని తలపిస్తుంది,:-))
      ధన్యవాదాలు మీ స్పందనకు.

      Delete
  7. Very nice fathima gaaru...:-):-):-):-)
    "mangamma atha..." story supero super..:-):-)

    ReplyDelete
  8. Replies
    1. Fathima gaaru...meelanti vaaru nannu "gaaru" andam komchem ibbandigaa undi. just Karthik anandi chaalu..endukante neninkaa studentne...kavitvamlo kooda..:-):-)

      Delete
  9. కవిత బాగుంది.
    భావయుక్తంగా ఉంది.

    ReplyDelete