రెప్పలు (రెక్కలు) విప్పని కల.
బతుకంతా నిద్రిస్తూ...
కేవలం కలలో మాత్రమే జీవిస్తూ,
విషాద క్రీనీడలో తచ్చాడుతూ,
వెలుగు కిరణాలను ఏరుకుంటూ.
అంతర్మదన పోరులో,
మనస్సు శకలాలను అతుక్కుంటూ ,
అక్షరాలను కూర్చుకుంటూ,
అలసిపోయి మూర్చపోతే,.
పదాలన్నీ ఒక్కసారే పెదాలు విప్పి,
చన్నీళ్ళు చిలకరించి పలకరిస్తున్నాయి.
రెప్పలు విప్పి చూసేసరికే,
రెక్కలు కట్టుకొని ఎగిరిపోతున్నాయి.
బతుకంతా నిద్రిస్తూ...
కేవలం కలలో మాత్రమే జీవిస్తూ,
విషాద క్రీనీడలో తచ్చాడుతూ,
వెలుగు కిరణాలను ఏరుకుంటూ.
అంతర్మదన పోరులో,
మనస్సు శకలాలను అతుక్కుంటూ ,
అక్షరాలను కూర్చుకుంటూ,
అలసిపోయి మూర్చపోతే,.
పదాలన్నీ ఒక్కసారే పెదాలు విప్పి,
చన్నీళ్ళు చిలకరించి పలకరిస్తున్నాయి.
రెప్పలు విప్పి చూసేసరికే,
రెక్కలు కట్టుకొని ఎగిరిపోతున్నాయి.
ReplyDelete"పదాలన్ని ఒక్కసారే పెదాలు విప్పి
చన్నీళ్ళు చిలకరించి పలుకరిస్తున్నాయి"
పై వాఖ్యాలు చదివాక గుండె ద్రవించ కుండా ఎలా వుంటుంది
రాతి గుండెను కూడా కదిలించే శక్తి ఉంది మీ కలం లో . ఎంత బాగా అన్నారు !
వాస్తవికత ఎలా వున్నా....
కలల్లో జీవించడమనేది మనిషికి ఓ వరం.
చాలా బావుందడీ ఫాతిమా గారూ ,
- శ్రీపాద
శ్రీపాద గారూ, ధన్యవాదాలు మీ స్పందనకు,
Deleteహ్రుదయం ద్రవించగలిగిన నా కవిత ధన్యం చేసుకున్నది
బ్రతుకంతా నిద్దురే! కలల్లో జీవిస్తూ, విషాదపు క్రీనీడల్లో వెలుగు కిరణాలు, అక్షరాలను ఏరి కూర్చుకుంటూ, అలసి మూర్చపోతే, ఆ పదాలన్నీ పెదాలు విప్పి, చన్నీళ్ళు చిలకరించి .... రెప్పలు విప్పి చూసేసరికి, రెక్కలు కట్టుకొని ఎగిరిపోతూ ....
ReplyDeleteఎంత అందమైన ఊహ .... అక్షరాలు మమతానురాగాలు చూపించడమే కాకుండా అల్లరి చేస్తూ ఎగిరిపోవడం
అభినందనలు మెరాజ్ ఫాతిమా గారు!
నిజమే అలసిన మనస్సుకు (కవి మనస్సు) సేద తీర్చేది అక్షరాలే.
Deleteఎవరి కలల సామ్రాజ్యానికి వారే అధిపతులు.....అందుకే కలలంటే నాకు భలేఇష్టం అవి రెక్కలు విప్పినా విప్పకపోయినా సరే...మీ కవిత బాగుందండి.
ReplyDeleteకలల సామ్రా్జ్ఞీ... మీ కలలెప్పుడూ అందమైనవి కావాలని దీవిస్తూ...
Delete
ReplyDeleteలోకమంతా
ఉంది వెలుగు,
చూడ గలిగేంత !
ఏరుకుంటే దొరికేవి
స్థబ్ద కిరణాలే !
సాధిస్తే దొరుకుతాయి,
స్నిగ్ధ కిరణాలూ !
నిత్యాంతర్మధనం
కాకూడదు, నిరాశా వ్రణం !
చిలికించాలి అది,కర్తవ్యామృతం !
కలల లో జీవించినా , ఇలలో ,
చేయించాలి, ఒక అవిశ్రాంత రణం !
గెలిచి, ఆస్వాదించాలి, ప్రతి అరుణ కిరణం !
నిజమే .. అరుణ కిరణాలకై ఎదురుచూస్తూ..చూస్తూ ఉంటే,
Deleteసాయం సంద్య అవుతుంది:-))
మీ స్పూర్తి నిచ్చే వ్యాఖ్యలకు నా ధన్యవాదాలు సర్.
అక్షరాల్ని, పదాల్ని అలవోకగా ఒడిసిపట్టి ఒడుపుగా చక్కని కవితలల్లుతున్నారుగా మీరు!
ReplyDeleteనాకైతే ఏవీ రెక్కలు కట్టుకుని ఎగిరిపోతున్నట్టుగా ఎక్కడా అనిపించట్లేదు, కనిపించట్లేదు మరి...!
అన్నట్టు, అంతర్మథనమే లేకపోతే జీవితమంతా నిస్సారంగా, నిస్తేజంగా బాగా పూర్వకాలమే ఎవరో చెప్పినట్టు, ఎక్కడో చదివినట్టు గుర్తు. అహరహం అంతర్మథనం చేసి కవితామృతాల్ని పంచండి, సరిపోతుంది :-)
అయ్యో.. రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుంటే మీరన్నట్లు పట్టుకొని మీ ముందు పడేశాను.
Deleteనిజమే మీరన్నది అంతర్మథనం మనిషిని ఉత్తేజితుణ్ణి చేస్తుంది,
లేకుంటే మనిషి జడపదార్దమ్లా ఉంటాడు.
మీ స్పందనకు సంతోషంగా ఉంది.
మూర్చను పోగొట్టే చన్నీరు చిలికే
ReplyDeleteపదాలు మీ నేస్తాలుగా ఉండడం
మా అదృష్టం.
చక్కటి కవిత.
భావ గర్భితంగా ఉంది.
చిన్ని మరు మల్లెలా ఉంది.
స్వచ్చంగానూ, సువాసనా భరితంగానూ ఉంది.
ధన్యవాదాలు సర్,
Deleteమరుమల్లెతో నా కవితలని పోల్చారు చాలా సంతోషం.
సర్, నా పుస్తక సమీక్ష రేడియో లింక్ ఇచ్చారు, ఇప్పుడు ఎవరూ రేడియోస్ వినటం లేదని నేను ఎవరికీ చెప్పలేదు, యాద్రుచ్చికంగా మీరు వినటం జరిగింది. ధన్యవాదాలు.
DeleteI have so impressed your poem, could you please upcoming poems!!
DeleteI have posted on my FB wall, since I like it
ReplyDeleteరాం సర్, నమస్తే, మీ అభిమానానికి నా ధన్యవాదాలు.
Delete