అనురాగ శ్వాస
ప్రకృతి అందాలన్నీ
మౌనంగా పలకరించే వేళ,
సన్నజాజిపూలు రాలుతున్నట్లు
మదిలో ఆమె తలపులు,
చీకటి తెరలను చీల్చుకొని,
తెలి వెన్నెలలా ఆమె రూపం,
యోజనాల దూరాన ఉన్నా,సమీపానే
అనిపించే ఆమె విలాసం.
అనురాగపు గాడతకు నిలయంగా,
ఆమె తలచే నా మదీ నివాసం
కమ్మని కావ్య పరిమళాల సుగందమై,
రేరాణిలా,వెన్నెల కిరణమై.....
నిత్యం నాకై అన్వేషించే రాదికలా,
అలిగిన అబిసారికలా...
సమీరంలా,నా చరణాలను స్పృశించీ....
అంతలో ,ఎదలోతుల్లో అంతర్బాగమైన నా చెలీ.....
నీ మనో పాఠాలను చదివిన నేను,
అక్షర ,అక్షరానా అనురాగాన్నద్దుతాను.
అద్భుతంగా వుంది... ప్రకృతిలో నవయవ్వనం ప్రతిఫలిస్తునట్టుంది!
ReplyDeleteనాగేంద్ర గారూ, చాలాకాలానికి నా బ్లాగ్ దర్సించారు సంతోషం.
Deletepremikuni manasunu darshimpajessavu. Dyavarai Narendar Reddy Ghazal Poet
Deleteమనో పాఠాలు చదవగల శక్తి మీకే ఉంది.
ReplyDeleteకవిత చాలా బాగుంది.
మగవారి మనసులలోకి చూసి రాస్తున్నట్లుంది.
రవి గాంచనిచో కవి గాంచును అన్న వాకాయ్న్ని నిజం చేసారు.
This comment has been removed by the author.
Deleteనా మనూ(న:) దర్మం అది,
Deleteమీరన్నట్లు కవి ప్రతి భావననూ తాకగలడు.
సర్, ధన్యవాదాలు మీ స్పందనకు.
ప్రకృతి అందాలు మౌనంగా పలకరించే వేళ, యోజనాల దూరాన ఉన్నా, సమీపానే అనిపించే విలాసం. కమ్మని ఆ కావ్య పరిమళాల సుగందం, ఆ వెన్నెల కిరణం, నిత్యం .... నాకై అన్వేషించే ఆ రాదిక, ఆ అలిగిన అబిసారిక .... సమీరంలా, నా చరణాలు స్పృశించిన ఆ చెలి .... ఆ మనసు పాఠాలను చదివి నేను, అక్షర, అక్షరానా అనురాగాన్నద్దుతాను.
ReplyDeleteఎంత నమ్మకం ఎంత బరోసా ఇస్తున్నారు ఒక పురుషుడి మనోభావనల్ని సున్నితంగా అక్షీకరించడం మీ వల్లే అవుతుందన్నట్లు .... కవిత
అభినందనలు మెరాజ్ ఫాతిమా గారు!
స్త్రీ హ్రుదయాన్ని అర్దం చేసుకోగల ప్రతి పురుషుడూ అలాంటి అనురాగాన్ని ఇవ్వగలడు,
ReplyDeleteసున్నిత భావాలు స్త్రీలకే ఉంటాయి అనుకోవటం తప్పు, పురుషునిలో కూడా అమ్మ ప్రేమ ఉంటుంది.
సర్, మీ స్పందనకు ధన్యవాదాలు.
ఆ జంట బందం అనురాగ రాగాలతో అల్లుకొని మరుమల్లె తీగలా సాగిపోదా . మీరజ్ చాలా బాగుంది కవిత.
ReplyDeleteనిజమే కదా, అలాంటి బంధాలే కలకాలం ఉంటాయి.
Delete