తప్పటడుగులు
ఆకాశాన్ని అందుకోవాలనుకొనే
నిర్మాణ సౌధాలు అస్థి పంజరాల్లా,
అగుపిస్తున్నాయి.
సిమెంట్ తట్టతో నిచ్చెనెక్కే
అమ్మని అందుకొవాలనే
బుడి,బుడి అడుగుల ఆరాటం.
ఎగుడు,దిగుడు నేలపై నడిచే
లేత పాదాలలో కసుక్కున దిగిన ఇనుపమేకూ..
విలవిల లాడే పేద గుండెలూ,
బోసి నవ్వుల పసికూన నిదురలోనే,
ఒక్కసారిగా కూలిన కర్ర్ర్లల వంతననే
తన శవపేటిక చేసుకొంటే,
ఆకలి గొన్న చిన్నారి అమ్మపాలకై పాకుతూ,
నోరు తెరుచుకున్న బోరు గుంటలో జారి,
మృత్యువుతో కరచాలనం చేస్తుంటే,
దయనీయ జీవితాలతో
దాగుడు మూతలాడుతూ
"విధి" వీధి వాకిట్లోకి విసిరేస్తుంటే,
భవిత శూన్యమై,బ్రతుకు భారమై,
కడుపు చేతబట్టుకొచ్చిన కూలి జనాలకు,
కూలిపోతున్న భవనాలే ఆవాసాలైతే... ,
మనవంతుగా
మానవీయ హస్తాలను ముందుకు చాపి,
సజీవ చైతన్యాన్ని నింపి,
కడుపుకోతలను అరికడదాం.
,
ఆకలి గొన్న చిన్నారి అమ్మపాలకై పాకుతూ, నోరు తెరుచుకునున్న బోరు గుంటలో జారి, మృత్యువు ఒడిలో బావురుమంటుంటే, భవితవ్యం కోసం, భారమైన బ్రతుకును, కడుపును .... చేతబట్టుకునొచ్చిన కూలి జనాలకు కూలిపోతున్న భవనాలే ఆవాసాలౌతున్న దయనీయ పరిస్థితుల్లో .... మానవీయ హస్తాలను ముందుకు చాచి, సజీవ చైతన్యాన్ని నింపి, కడుపుకోతలను అరికట్టడంలో .... కొంతైనా పాత్రను మనం పోషించగలమా!? ప్రశ్నించుకుందామా??
ReplyDeleteఅంటూ కవయిత్రి చక్కని సందేశాన్ని ఇవ్వడంతో పాటు మానవత్వాన్ని బాధ్యతాయుతంగా ఆవిష్కరించారు.
అభినందనలు మెరాజ్ గారు! శుభోదయం!!
మీ ప్రశంసా వ్యాఖ్యకు ధన్యవాదాలు సర్,
Deleteప్రభుత్వమో,పార్టీలో,ప్రజాప్రతినిధులో,........వాడో,వీడో,ఎవడో.....చేయాలని వాదిస్తూ కాలయాపన చేసేకంటే నేనేంచేయగలనూ,నా కర్తవ్యం ఏమిటీ అని మానవత్వ దృక్పధంతో ఆలోచించే ధోరణిని అలవరచుకున్ననాడే ఈ సమాజం ప్రగతి పధంలో పయనిస్తుందని నా నమ్మకం .మీరజ్ మీ మనసెప్పుడూ సమాజంలొనే తిరుగుతుందనడానికి ఇదొక నిదర్శనం .
ReplyDeleteదేవీ, మీ అభిమానానికి ధన్యవాదాలు.
Deleteనా కర్తవ్యం నేను కొంతవరకే నిర్వర్తిస్తున్నాను , ఇంకా చేయగలిగే శక్తి కావాలి.
Well said.
ReplyDeleteధన్యవాదాలు సర్.
Deletehappy new year andi
ReplyDeleteశశి గారూ,మీకు కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు.
Deleteపేదవాడి జీవితం గురించి చక్కగా చెప్పారు ఫాతిమా గారు!
ReplyDeleteమీకు, మీ కుటుంబ సభ్యులకు ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు!!
మీకూ,మీ ఫ్యామిలీ కి నా హ్రుదయ పూర్వక శుభాకాంక్షలు నాగేంద్ర గారూ.
Delete