మనస్సు
ఉండటానికి గుండె దొరకనప్పుడు,
మైలు దూరాన తచ్చాడుతుందీ మనస్సు.
కనికరం చూపించామంటే ,
కల్లోలం సృష్టిస్తుందీ మనస్సు.
చేరువు కాలేని దూరాలను కొలిచి,
అలసిపోతుందీ మనస్సు.
తేమ నిండిన శ్వాసై,నీరు అందని చేపై,
విలవిల్లాడుతుందీ మనస్సు.
అగ్గయి భగ్గున మండి పైకెగసి,
నివురై నేలరాలుతుందీ మనస్సు.
దేహంనుండి తెగిన అంగమై,
అవిటిదవుతుందీ మనస్సు.
ఊపిరి సలపనీక ఉక్కిరిబిక్కిరి చేస్తూ,
ఉరితాడవుతుందీ మనస్సు.
అలమటించే గుండె గుడారంలో మకాం వేసి,
అరబ్బీషేకు గుర్రమవుతుందీ మనస్సు.
తలపులూ,తపనలలూ ,ఆశలూ ,ఊసులూ,
తలకెక్కించి తమాషా చూస్తుందీ..... మహమ్మారి మనస్సు.
"ఉండటానికి ఒక గుండె గూడు కోసం తచ్చాడుతుంది. కల్లోలం సృష్టిస్తుంది. కొలిచి, అలసిపోతుంది. నీరు అందని చేపై, విలవిల్లాడుతుంది. నివురై నేలరాలుతుంది. తెగిన అంగమై, అవిటిదవుతుంది. ఉక్కిరిబిక్కిరి చేస్తూ, ఉరితాడవుతుంది. అరబ్బీషేకు గుర్రమవుతుంది. చివరికి తలపులూ, తపనలూ ,ఆశలూ ,ఊసులూ, తలకెక్కించి తమాషా చూస్తుంది .... మహమ్మారి మనస్సు."
ReplyDeleteమనస్సు భిన్న రూపాల్ని చాలా బాగా ఆవిష్కరించారు మెరాజ్ ఫాతిమా గారు.
అభినందనలు.
వివిద రూపాల మనస్సు విశ్వరూపం మనకు ఏదో ఒకసారి అవగతమవ్వక మానదు.
Deleteమీ స్పందనకు ధన్యవాదాలు చంద్ర గారు.
మనసు అలజడిని ,మనసు పడే వేదనని , మనసు బలహీనతని , మనసు పడే ఆరాటాన్ని ... మనసుతో రాసారు . చాలా బాగుంది .
ReplyDeleteఅవును దేవీ... మనసుపెట్టే రాశాను:-))
Delete
ReplyDeleteవిల విల లాడిస్తూ ,
ఉక్కిరి బిక్కిరి చేస్తూన్న,
తమస్సుకు వేయాలి, ఉరి !
మనస్సు కు కాదు !
మనస్సు ఎపుడూ,
ఉషస్సు ను కోరాలి,
స్వేఛ్చా విహంగమై,ఎగరాలి !
దిగంతాలను దాటుతూ, ఎదగాలి !
మనస్సు తమస్సులోనే తచ్చాడుతుంటుంది.
Deleteదాన్ని ఉషస్సులోకి లాగుతున్నవే ఈ అక్షరకిరణాలు.
సర్, ధన్యవాదాలు మీ స్పందనకు.
మనసు విశ్వరూపం బాగా విశదీకరించారు.
ReplyDeleteఅర్థం చేసుకోవడమే అదుపు చేయడానికి ఆరంభం.
మనసు చెప్పినట్లు వినాలా, మన కర్తవ్యంపై మనసు పెట్టాలా అనేది
ఎవరికి వారు నిర్ణయించుకోవాలని బాగా సూచించారు.
సైకోఎనాలసిస్ లాగుంది.
కాకికేం తెలుసు సైకోఎనాలసిస్ అన్నారు శ్రీ శ్రీ.
కానీ కోకిల గురించి ఏమీ చెప్పలేదు.
అభ్యంతరం పెట్టలేదు.
గో ఎహెడ్.
మనసుచెప్పినట్లు వింటే ఇంకేమీ లేదు, విహంగంలా ఎగురాగలదూ, కోతిలా గెంతా గలదు.
Deleteఅందుకే దాన్ని మహమ్మారీ అన్నాను. ఒకే ఈ సారి కోకిలలా(కవి కోకిల ) ఆలోచిస్తాను మార్గం దొరక్కపోదు :-))
సర్, ధన్యవాదాలు మీ స్పందనకు.
మనసు గురించి ఎక్కువ ఆలోచిస్తే మనశ్శాంతి లోపిస్తుందేమో ఆలోచించండి. మనసు బుద్ధి పరస్పరం ఘర్షణలమయం. బుద్ధిని ఎక్కువ ఉపయోగిస్తూనే మనల్ని అభిమానించేవారికోసం మనసు పెట్టి ఆలోచించాలి. లేకపోతే మనసు మనం చెప్పినట్లు వినదు. అది మహమ్మారిగా మారిపోతుంది. మనసును ప్రకృతికి అంకితం చేస్తే బుద్ధి సరిగ్గా పనిచేస్తుంది కదండి.. ఫాతిమాగారూ.. మీ కవితా మహిమను అందించారు. బాగుంది. మనసును గురించి ఎంతగా చెప్పినా ఇంకా ఏదో వెలితిగా అనిపిస్తుంది. ఉపమ తో ఉసులాడించారు, అదరగొట్టారు. కానీ బెదరగొట్టారు మనసుని మహమ్మారితో.
ReplyDeleteసర్, చాలాకాలం తర్వాత స్పందించారు.
ReplyDeleteమనస్సు గురించిన మీ అభిప్రాయాలు బాగున్నాయి.
ధన్యవాదాలు మీకు మరోమారు.
Ssss......ur right.
ReplyDeleteBaagaa cheppaarandee.
మనసు గతి ఇంతే...మనిషి బ్రతుకంతే...మనసున్న మనిషికీ సుఖములేదంతే అన్నారు ఆత్రేయ. మీ కవిత - క్రింద కామెంట్లు - మీ స్పందన అన్నీ చూశాక మనిషి మాట వినేలా మనసుకు వికాసం కలగడానికి మానసిక సంఘర్షణను అర్ధం చేసుకోవడం-అనుభవించడం మనిషికి తప్పదనే వాస్తవ బాటలోనే ఉన్నారనిపిస్తోంది. మీ కవిత - కామెంట్లు అన్నీ మనసును ఆలోచింపజేసేవిగా ఉన్నాయండీ.
ReplyDelete