అనాథ
చిట్టికథలూ చెప్పలేదూ..,
లాల పోయలేదు,
లాగు వేయలేదూ...
చెత్త బుట్టలో పడేశావు,
చేతులు దులుపుకున్నావు.
మాసిపోయిన పాతలూ,
మట్టి కొట్టుకున్న చేతులూ.
అంతటా... విదిలింపులూ,కదిలింపులూ,
ఇకిలింపులూ,సకిలింపులూ.
అమ్మ ఎలా ఉంటుందో చూడాలనీ,
ఎందుకు కన్నదో నిలదీయాలనీ.
ఎలాంటి దయనీయ స్థితి ఈ పనికి పురికొల్పిందో?
ఎలాంటి కమనీయ స్థితి నాకు ఊపిరి పోసిందో?
ఎదురుచూసినా...పారవేసిన అమ్మ రాదు,
ఎంత ఏడ్చినా....చేరదీసే అమ్మే లేదు.
జన్మనిచ్చిన అమ్మని జగమంతా వెతుకుతూ.... ,
ప్రతి దయగల అమ్మ కళ్ళలో తన జన్మని వెతుకుతూ.....
లాల పోయలేదు,
లాగు వేయలేదూ...
చెత్త బుట్టలో పడేశావు,
చేతులు దులుపుకున్నావు.
మాసిపోయిన పాతలూ,
మట్టి కొట్టుకున్న చేతులూ.
అంతటా... విదిలింపులూ,కదిలింపులూ,
ఇకిలింపులూ,సకిలింపులూ.
అమ్మ ఎలా ఉంటుందో చూడాలనీ,
ఎందుకు కన్నదో నిలదీయాలనీ.
ఎలాంటి దయనీయ స్థితి ఈ పనికి పురికొల్పిందో?
ఎలాంటి కమనీయ స్థితి నాకు ఊపిరి పోసిందో?
ఎదురుచూసినా...పారవేసిన అమ్మ రాదు,
ఎంత ఏడ్చినా....చేరదీసే అమ్మే లేదు.
జన్మనిచ్చిన అమ్మని జగమంతా వెతుకుతూ.... ,
ప్రతి దయగల అమ్మ కళ్ళలో తన జన్మని వెతుకుతూ.....
"జన్మనిచ్చిన అమ్మని జగమంతా వెతుకుతూ.... ,
ReplyDeleteప్రతి దయగల అమ్మ కళ్ళలో తన జన్మని వెతుకుతూ..... "
ఈ పంక్తులు చదువగానే హృదయం ఆర్ద్రమయింది.
అభినందన!
మీ నుండి ప్రశంసను అందుకోవటం సంతోషంగా ఉంది డాక్టర్ గారు.
DeleteREALLY HEART TOUCHING
ReplyDeleteఆర్,జి రెడ్డిగారు, ధన్యవాదాలు.
Deleteనా బ్లాగ్ కి స్వాగతం.
చెత్త బుట్టలో పుట్టిన నేను మాసిపోయి, దుమ్ముకొట్టుకుపోయి .... విదిలింపులూ, కదిలింపులూ, ఇకిలింపులూ, సకిలింపులూ. పడుతూ తిరుగుతున్నాను. నువ్వు ఎలా ఉంటావో చూడాలని, నన్ను ఎందుకు కన్నావని నిలదీయాలని మాత్రం కాదు.
ReplyDeleteఅర్ధం చేసుకోగలను ఎంతటి దయనీయ స్థితి నీదో .... నన్నలా చెత్త బుట్టలో పారెయ్యాల్సిరావడం?
ఎవరూ చేరదీయని నేను జన్మనిచ్చిన నీకోసం జగమంతా వెతుకుతున్నా ...., ఏ దయగల అమ్మ కళ్ళలోనైనా నిన్ను చూడొచ్చని .... అమ్మా!
అనాథ జీవితాన్ని అద్భుతం గా ఆవిష్కరించారు. అభినందనలు మెరాజ్ ఫాతిమా గారు! శుభోదయం!!
మీ విష్లేషణలో నా కవితను సరికొత్తగా్ చూసుకోవటం నాకు అలావాటైంది,
Deleteధన్యవాదాలు మీ అమూల్యమైన సమయం వెచ్చించి చదువుతున్నందుకు.
అనాథను చేరదేసే అమ్మ కావాలి
ReplyDeleteపారవేసే అమ్మను ఆపి
ఆమెకు పాపను పెంచే ధైర్యాన్ని ఇచ్చే సమాజమూ కావాలి
అలాంటి సమాజం కొసమే ఈ అక్షర పొరాటం,
Deleteసర్, మీ స్పందనకు ధన్యవాదాలు.
జన్మనిచ్చిన అమ్మని జగమంతా వెతుకుతూ.... ,
ReplyDeleteప్రతి దయగల అమ్మ కళ్ళలో తన జన్మని వెతుకుతూ.....
ఇంతటి అద్బుతమైన భావనని అత్యద్బుతముగా పొందుపరచారు...
మీకు నా అభివాదములు .... నమో వందనాలు
సాగర్ గారూ, నచ్చిన కవితని మనస్పూర్తిగా మెచ్చుకుంటూ, నాకు ఈ పోరుబాటలో సహకరించే మీకు నా ధన్యవాదాలు.
DeleteHeart touching!!
ReplyDeleteప్రతీ కుటుంబం ఒక్కరిని దత్తత తీసుకున్నా ఈ స్థితి ఉండదు కదా.....
ఇప్పటి వారు చాలామంది కేర్ ఫౌండేషన్ లాంటి వాటి ద్వారా చేస్తున్నారు కానీ అది అందరూ చేయగలిగితే అనాధాలే ఉండరుకదా....
అమ్మా నాన్నలు ఆలోచించాలి ముందు, వారు నిరాశ్రయులైతే.. ఇక వేరే విదానాలు చూడాలి.
Deleteఅనూ... ఎన్నో కారణాలు కలసి ఆ పసికూనలని బలితీసుకుంటున్నాయి.
నా ప్రతికవితకీ మీ స్పందన ఉండటం సంతొషాన్నిస్తుంది.