Pages

Friday, 29 November 2013

బాల్యం







     బాల్యం  

        అందమైన  ముంగిట్లో   తిరుగాడాల్సిన  తువ్వాయి,
      సౌధాల సోపానాల నెక్కే  సిమెంటు  తట్టవుతుంది. 

      పున్నమి పుప్పొడిలాంటి  జాబిలికూన,
      శ్రమజీవై  మసిచేతులతో  మురికితేలుతుంది. 

      చిట్టి రెక్కలతో  ఎగరాల్సిన చిన్ని పావురం,
      రాబందుల ముక్కులకు రక్తపు ముద్దవుతుంది. 

      బాలకార్మిక  జీవనం భారంగా మారుతుంది,
      బతుకు బరువై  భవితలేకుండా  పోతుంది. 

     రూకల  మూటలుంటేనే  బడి తలుపు తెరిచేది.
     నూకలు కూడాలేని  ఈ బడుగులకిక  చదువేది?  

     "అ,ఆ" లు కాదు ఆకటిరాతలు  రాస్తున్నారు.
     మద్యాహ్న బువ్వుంటేనే  బడి వంక  చూస్తున్నారు. 

     అందుకే ..... 

     బుడతలకు  బువ్వతోపాటు  నవ్వుల  ఎరవేద్దాం,
     బుజ్జగించి,  బులిపించి  అక్షరాల  వలవేద్దాం.  

     వారిచేతనే  బంగరు  భవితకు   బాటవేయిద్దాం,
     బాటకడ్డుగా  ఉన్న  ఆకటి  కూకటివేళ్ళను తోలిగిద్దాం.   





13 comments:

  1. 'కని'పించడమే మగటిమి గా, పురుషాహంకారం !
    కన లేక పోవడమే, తమ ఓటమి గా, స్త్రీల అంధకారం !
    నడుమ, కన రాని, పసి కూనల భవితవ్యం !
    కబంధులు కబళించే, ' కను పాపల ' బాల్యం !

    ReplyDelete
    Replies
    1. బాల్యం మసిబారటానికి మీరన్న కారణాలే ఎక్కువ.
      స్త్రీలలో ఆర్దిక స్వాతంత్ర్యం లేకపోవటం వల్లా బిడ్డల భవితకు మంచి బాట వేయలేకపోతున్నారు.
      సర్, మీ చక్కటి విష్లేషణకి ధన్యవాదాలు.

      Delete
  2. బుడతలకు బువ్వతోపాటు నవ్వుల ఎరవేద్దాం,
    బుజ్జగించి, బులిపించి అక్షరాల వలవేద్దాం.

    వారిచేతనే బంగరు భవితకు బాటవేయిద్దాం,
    బాటకడ్డుగా ఉన్న ఆకటి కూకటివేళ్ళను తోలిగిద్దాం.

    Very nice. I m late.

    ReplyDelete
    Replies
    1. మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది.
      "హారం" వల్లా మాకందరికీ దూరంగా ఉన్నారన్నమాట.

      Delete
  3. నిజమే మీరన్న బాటలో పయనిద్దాం.....చాలా బాగుందండి

    ReplyDelete
    Replies
    1. పద్మ గారూ, మీ సహకారానికి నా వందనాలు.

      Delete
  4. Fathima gaaru...ee madyana exams vundi blogla prapanchamlo adugupettaledu.. Nenu miss ayina mee postlu ippude chadivaanu...chaalaa chaalaa baagunnayi. "athani raka kosam" naaku chalaa bagaa nachindi...:-):-):-)
    inkaa ee post vishayaniki vaste komchem alaa alaa balyamloki teesukeltoo komchem bhadanu raalchindi.

    ReplyDelete
    Replies
    1. కార్తిక్ గారూ, ఆలస్యంగా అయినా చదివిన మీకు ధన్యవాదాలు.
      exams సరిగా రాసిఉంటారని అనుకుంటున్నాను.

      Delete
  5. "పసిప్రాణాలు శ్రమనమ్ముకుని, సౌధాల సోపానాల నెక్కే సిమెంటు తట్టై, చిట్టి రెక్కల చిన్ని పావురం, రాబందుల ముక్కులకు రక్తపు ముద్దై, బాలకార్మిక జీవనం భారమై భవితలేకుండా పోతున్నప్పుడు, రూకల మూటల బడుల్లో "అ,ఆ" లు కాదు ఆకటిరాతలు .... మద్యాహ్న బువ్వుంటేనే బడి అనిపించినప్పుడు
    .....
    బుడతలకు బువ్వతోపాటు నవ్వుల ఎరవేస్తే, బుజ్జగించి, బులిపించి అక్షరాల సూదిమందిస్తే
    బంగరు భవితకు బాటవేయించొచ్చేమో! బాటకడ్డుగా ఉన్న ఆకటిని కూకటివేళ్ళతో తోలిగించొచ్చేమో "

    మీ అక్షర ప్రయోగం బాగుంది. ఆశావహమైన ఆలోచన భావన అభిలాష కవిత లో అంతర్లీనం గా .... ద్వనిస్తూ,
    అభినందనలు మెరాజ్ ఫాతిమా గారు!

    ReplyDelete
    Replies
    1. పిల్లల చదువు, వారి ఆరొగ్యమూ వంటి విషయాల్లో ప్రభుత్వం కొంత శ్రద్ద తీసుకుంటే బాగుంటుంది.
      సర్, మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  6. పిల్లలకు చదువు, బాల్యం అవసరం.
    వాటిని దూరం చెసే పరిస్థితులు
    సమాజంల్ ఉండడం చాలా బాధాకరం

    ReplyDelete
    Replies
    1. వేలమంది పిల్లలు చదువుకొనేందుకే పనిచేస్తున్నారు,
      ఆపని తెచ్చిన డబ్బుతో చదువు ప్రైవేటుగా సాగిస్తున్నారు,
      బిడ్డల బవిత ఓ అగమ్యం.
      సర్, ధన్యవాదాలు మీ స్పందనకు.

      Delete
  7. "ముంగిట్లో తిరగాల్సిన తువ్వాయి, సిమెంటు తట్టై, శ్రమజీవై మసిచేతులతో మురికితేలుతూ, రాబందుల ముక్కులకు రక్తపు ముద్దై, బాల కార్మిక జీవనం భారంగా భవితలేకుండా పోతుంది.
    రూకల మూటలుంటేనే బడి, "అ,ఆ" లు కాదు ఆకటిరాతలు రాస్తూ మద్యాహ్నపు బువ్వుంటేనే బడి వంక చూస్తున్నారు.
    అందుకే .....
    బుడతలకు బువ్వతోపాటు నవ్వుల ఎరవేద్దాం, బుజ్జగించి, బులిపించి అక్షరాల వలవేసి వారి బంగరు భవితకు బాటవేద్దాం, బాటకడ్డుగా ఉన్న ఆకటిని కూకటివేళ్ళతో తొలగిద్దాం."
    చిక్కని సామాజిక భావన పసి జీవితాలు రేపటి జాతి బావుటాల అభ్యున్నతి దిశలో అక్షరాల ఆవేశం .... చాలా బాగుంది. చక్కని కవిత.
    అభినందనలు మెరాజ్ గారు!

    ReplyDelete