Pages

Friday, 8 November 2013

కొత్తొక వింతే....

     

     






      కొత్తొక  వింతే.... 

     విలువలు  వలువలూడదీసుకొని,
     విశృంఖలంగా  నాట్యం చేస్తున్నాయి. 

     ఏమి తినాలో, ఎలాతినాలో  చెప్తూ... ,
     నట్టింట్లో  తిష్ట  వేసిందో  బొమ్మల భూతం. 

     అప్పుడప్పుడూ  అలవోకగా,   
     నంజుకు తింటుంది  కంప్యూటరు  ప్రేతం. 

     స్వచ్చమైన  మైత్రినని  నమ్మిస్తూ... , 
     కొత్త పరిచయాలు కుప్పలు  తెప్పలవుతున్నాయి   

     గుండె గాయాలకు  ఊరట నిస్తామంటూ... ,
     నెత్తుటి వాసన మరిగి కుత్తుక కోస్తున్నాయి. 

     చిన్న పరద్యానం కూడా  నీ ఊపిరిని ఆపేస్తుంది,
     విజ్ఞానమేమోగానీ...విషపుకోయ్యకు  వేలాడదీస్తుంది. 

     చనుబాలను  సైతం  కల్తీ చేయగల  విషవైక్రుతీ... ,
     హైటెక్ ఆలోచనా ,వంచనాలతో... వైరస్ లై ... 
     కంటికిందే   అంటుకుపోతున్నాయి. 

     మతం మత్తూ...,కులం రోచ్చూ.. కలిసి 
     మనుషులను  మాంసపు  ముద్దలను చేసి,
     నంజుకు  తింటున్నాయి. 

     సంపన్న దేశాల  సంకరజాతికి  మొలకెత్తిన మీడియా ,
     ఆ దేశాల  భోగాలను,లాభాలనూ   పెంచుతూ... ,   
     మన మేధస్సుకు   ముష్టి వేస్తుంది. 

     తిరుగుబాటు  సమయమొచ్చింది,
     మనస్సునూ, మనుగడనూ..  మార్చుకుందాం,
     అస్థిరబంధాల  నుండి  అప్రమత్తంగా  ఉందాం.  
  





  


8 comments:

  1. ఏదస్థిరం ?
    ఏది స్థిరం ?
    ఎదశాస్వతం ?
    ఏది శాశ్వతం ?
    భవ బంధాలూ ,
    రాగ బంధాలూ ,
    అనుబంధాలూ,
    మానవ సహజాలు !
    కల్తీలూ , కల్మషాలూ ,
    మోసాలూ ,విద్రోహాలూ ,
    విద్వేషాలూ ,వైషమ్యాలూ ,
    కుటిల మానవ నైజాలు !
    మన బంగారం
    మంచిది కాక ,
    కంసాలి మీద ఎందులక ?
    స్వజాతి వైరానికి ,
    శాస్త్రీయ ఆవిష్కారాలను
    తిట్టు కుంటే దొరుకుతాయా
    పరిష్కారాలు ?

    ReplyDelete
    Replies
    1. సర్, నేను చెప్పింది కూడా అదే "బంగారం (మనస్సు) మంచిదే ఉందికదా అని నిర్లక్ష్యంగా ఉండొద్దూ...
      ఒక్క సారి కొత్త కంసాలి మీద కూడా కన్నేసి ఉంచండీ...:-))).
      శాస్త్రీయ ఆవిష్కారాలన్నీ మంచికే ఉపయోగిస్తే విపరీత పరిణామాలు ఎందుకు ఎదుర్కోవాల్సి ఉంటుంది చెప్పండీ.
      నా కవితపై మీ విష్లేషణలో నాకు ఎన్నో సందేహాలకు సమాదానాలు దొరుకుతాయి.
      ధన్యవాదాలు మీకు.

      Delete
  2. విలువలు వలువలూడదీసుకొని, నట్టింట్లో తిష్ట వేసిందో కంప్యూటరు ప్రేతం. స్వచ్చం నేనని నమ్మిస్తూ...., స్నేహాలు, కొన్ని కొత్త పరిచయాలు, గాయాలకు ఊరట నిస్తామంటూ, కుత్తుక కోస్తూ ....
    చనుబాల కల్తీ, విషవైక్రుతీ... , హైటెక్ ఆలోచన, వంచనలతో.... మతం మత్తూ...,కులం రోచ్చూ.... నంజుకు తింటూ .... సంపన్న దేశాల మీడియా, భోగాలను, లాభాలనూ పెంచుకుంటూ ...., మేధస్సుకు ముష్టి వేస్తూ ....
    ఈ అస్థిరబంధాల నుండి అప్రమత్తత అవసరమేమో, మనసు, మనుగడల యాంత్రికతపై తిరుగుబాటు సమయమే ఇది .... కొత్తొక వింతే .... అనుకోకపోతే
    ఒక కంప్యూటర్, ఒక కపట స్నేహం, మత తత్వం, విష సంస్కృతి, సరళీకృత విధానాలు వేటి స్థానం ఎక్కడో విశ్లేషిస్తూ గమ్యాన్ని నిర్దేసిస్తున్న కవిత ఇది. చాలా బావుంది. ప్రతి వస్తువూ మీదా ప్రత్యేక కవితలు మీ కలం అక్షరరూపాన్నిస్తే చదవాలనిపిస్తుంది.
    ఒక మంచి కవిత "కొత్తొక వింతే" అభినందనలు మెరాజ్ ఫాతిమా గారు.

    ReplyDelete
  3. చంద్ర గారూ, కొత్తని (మార్పుని ) ఆహ్వానించటానికి చాలా సాహసం,సమయస్పూర్తీ కావాలి.
    అమాయకత్వం,అలసత్వం ఉన్న వ్యక్తులు కొంత తడబాటుకు గురికావటం తద్యం.
    నేను చెప్పాలి అనుకున్న విషయాన్ని గ్రహించిన మీకు నా ధన్యవాదాలు

    ReplyDelete
  4. తస్మాత్ జాగ్రత్త
    అంటున్నారా?!
    బాగుంది.
    నెట్ లో నగ్నత్వం
    నట్టింట్లో విశృంకళం.
    నిజమే, పిల్లలని కాపాడుకోవడం
    కత్తి మీద సాములా ఉంది.

    ReplyDelete
    Replies
    1. సర్, మీ స్పందనకు ధన్యవాదాలు.
      అమ్మో ఇప్పటి పిల్లలకు నేర్పాలిన పని లేదు జాగ్రత్తగానే ఉంటారు లెండి.

      Delete
  5. సాంకేతిక సౌలబ్యతలో పడగలిసిరే పాములెన్నో
    అందమైన పసిరికలో గుచ్చుకొనే కంటకాలు
    అంతర్జాలాన నర్తించే విధ్వంసక రీతులెన్నో
    ఎలుక ఇంట దూరినంతనే నిప్పు పెట్టమింటికి
    తేనెతుట్టె కడపోతూ ముసుగు మనకు తప్పనిదే

    ReplyDelete
    Replies
    1. రాఘవేంద్ర రావ్ గారికి, ముందుగా నా బ్లాగ్ కి స్వాగతం.
      మీరన్నట్లు ఎలుక దూరిందని ఇంటికి నిప్పుపెట్టము కదా,
      కానీ మనం చేయవలసిందల్లా ఎలుకను గమనించగలగాలి.
      ధన్యవాదాలు మీ స్పందనకు.

      Delete