Pages

Monday, 11 November 2013

ఆమె వెళ్ళిపోయింది

     ఆమె వెళ్ళిపోయింది 


      



      ఏనాటి బంధమో  పూవుకీ,తావికీ,
      స్వాగతం పలికినట్లు ఆమెనూ స్వాగతించింది  వనం. 

      శిశిరాన్ని రుచి చూసిన ఆమెకు,

      ప్రేమగా  వసంతాన్ని వడ్డించిది. 

      చిగురులు మేస్తూ ఆమె   కూనిరాగం తీసింది,

      కరకు చెరలు వీడి  ఊయలలూగింది. 

      గంతులేసే  మనస్సు  ఒక్కసారిగా,

      ఉత్సాహంతో  హొయలు పోయింది. 

      పూల  పలుకులకు  పరవసించే  వసంతుడు,

      మారిన  ఋతువులకు  పారిపోయాడు,

     అందుకే ఆమె వెళ్ళిపోయింది. 


     ఆలోచనా  తరంగాలపై  అవదుల్లేని లోకాలకు 

     ఆమె వెళ్ళిపోయింది. 

     ఆప్యాయతల, అనుబంధాల  కోసం ఎదురుచూస్తూ  చెకోరమై ,

     ఆమె ఎగిరిపోయింది. 

     ప్రియరాగానికై   తపిస్తూ... వలస పక్షిలా,

     ఆమె  వెళ్ళిపోయింది. 

     ఓ  సుందర స్వప్నమై.. , మధుర గానమై.. , 

     అదృశ్య కవనమై..,అద్భుత శిల్పమై.., అనురాగ ప్రతిమై..,
     అందని లోకాలకు  ఆమె  వెళ్ళిపోయింది  




14 comments:

  1. Chaala chaalaaaaa bagundi fathima gaaru..:-):-)

    ReplyDelete
    Replies
    1. కార్తిక్ గారూ, చాలా సంతోషం మీ అభిమానానికి.

      Delete
  2. Replies
    1. తెలుగమ్మాయికి నా ధన్యవాదాలు.

      Delete
  3. ఆమె ఆగమనం తో, గగనం, వసంతం !
    ఆమె నిగమనం తో , వనం, శిశిరం !
    కాలం ఎపుడూ, ఒక వలయం !
    కాదు ఎపుడూ, సమాంతరం !
    శిశిరం తరువాత, వసంతం తప్పదు !
    అందని లోకాలకు వెళ్ళినా, ఆమె
    ఈ లోకానికి మరలక పోదు !
    ఆమె మరుల విరులు, వికసించుట తప్పదు !

    ReplyDelete
    Replies
    1. వనమంతా తనదే అనుకొనే కోకిల పరవసించి పాడుతుంది,
      శిశిరములో ఆగిపోయిన తన పాటను మళ్ళీ పాడుకొనే సమయం కోసమే చూస్తుంది,
      మీరన్నట్లు కాలం వలయమై... వసంతం రావాలని కోరుకుంటుంది.
      సర్, మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  4. ఏనాటి బంధమో, ఆమెను స్వాగతించింది వనం. ప్రేమగా వసంతాన్ని వడ్డించిది. ఆమె కూనిరాగం తీసి, స్వేచ్చగా ఊయలలూగింది. ఉత్సాహంతో హొయలు పోయింది.
    అంతలోనే ఋతువు మారింది.
    ఆమె వెళ్ళిపోయింది. అవదుల్లేని లోకాలకు, ఒక చెకోరంలా, ఒక వలస పక్షిలా, ఒక సుందర స్వప్నంలా, ఒక మధుర గానంలా, ఒక అదృశ్య కవనంలా, ఒక అద్భుత శిల్పంలా, ఒక అనురాగ ప్రతిమలా .... అందుకోలేని ఏ లోకాలకో ....
    మీ శైలికి కంప్లీట్ గా భిన్నంగా ప్రకృతి, ప్రేమ, అనురాగం, ఎడబాటు వస్తువు గా గొప్ప భావన .... ఈ కవిత.
    అభినందనలు మెరాజ్ గారు! శుభోదయం!!

    ReplyDelete
    Replies
    1. చంద్ర గారూ, నాకే అనిపించింది ఈ కవిత బిన్నంగా ఉందని,
      కోకిలను ఉద్దేసించి రాసిన ఈ కవిత మీకు నచ్చ్చినందుకు ధన్యవాదాలు

      Delete
  5. as usual....beautiful.
    So much agony packed in a small capsule

    ReplyDelete
    Replies
    1. ముందుగా నా బ్లాగ్ కు స్వాగతం.
      మీ స్పందనకు ధన్యవాదాలు..

      Delete
  6. Chaalaa chaalaa nachesindandee...

    ReplyDelete
    Replies
    1. అనూ, మీ స్పందన సంతోషాన్నిచ్చింది.

      Delete
  7. ఆమె కోకిల అనుకుంటున్నా!
    వసంతుడు వచ్చినప్పుడు మళ్ళీ వస్తుందిలెండి, బాధపడకండి!
    సృష్టిలో అందం ఇదే కదా!
    చక్కగా ఒడిసిపట్టారు
    శుభాభినందనలు.

    ReplyDelete
    Replies
    1. ఎంతైనా కవులు కదా కోకిలను గుర్తించారు,
      కోకిల చూసేది వసంతం కోసమే.
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete