Pages

Monday, 18 November 2013

నీకు తెలుసా..?








    నీకు తెలుసా..?

       రేయి గడుస్తుంది నిశ్సబ్దంగా ... 
     తెల్లవారుతుంది అంటే సహజంగా .. 

     ఇహానికీ, పరానికీ మద్య  సాగుతున్న,
     తరాల, (అంతరాల)  వాదనలలో...

     అహాల, అంతస్థుల నడుమ నలిగే జీవితంలో..,
     అస్థిమిత, అంధకార ఆలోచనా తరంగాలలో,

     నేర్పుగా తనను  నడిపించే చెలికాని,
     చేయి అందుకోవాలని చూస్తూ... 

     అగాధాల  అంచుల్లోకి, అంధకార పాయల్లోకి,
     గమ్యమెరుగని  నావలా  అలలపై జారుతూ, 

     మరోమారు గమ్యం కోసం, 
     అతుకు వేసుకున్న  బతుకులో.... 

     ఆమె  మిగిలిపోయింది, ఒంటరిగా  మిగిలిపోయింది.  








12 comments:

  1. ( ఒంటరి గా మిగిలి పోయిన ఆమెకు )

    అగాధాల అంచుల్లో,
    అంధకార పాయల్లో ,
    గమ్యం వెదకడం లో,
    అర్ధం ఏముంది ?

    ఒంటరైనా,
    జంటలైనా ,
    అందరూ
    బాటసారులే !
    తప్పని సరిగా,
    ప్రతి ప్రయాణం,
    ఆగవలసిందే !

    అందుకే,
    నీ జీవితం లో
    ప్రతి క్షణాన్నీ ,
    ప్రేమించు, ప్రేమను పంచు,
    అదే కావాలి, నీ గమ్యం !
    అపుడే, నీ జీవితం రమ్యం !

    ReplyDelete
    Replies
    1. మీ మాటల్లో వేదాంతం వినిపించినా నగ్న సత్యం కనిపిస్తుంది.
      నిజమే అందరమూ బాటసారులమే జీవనం సాగించాలి , ఎప్పుడో ఓ సారి ఆగిపోవాలి
      అంతా తెలిసీ ఈ అనుబంధాలెందుకో... ఆ అన్వేషణే ఈ అక్షర ప్రయాణం.
      సర్, ధన్యవాదాలు మీ స్పందనకు.

      Delete
  2. "అహం, అంతస్థుల మధ్య .., అస్థిమిత, అంధకార ఆలోచనా తరంగాలలో,
    ఇహ, పరాల మధ్య సాగుతున్న, సంఘర్షణలో...
    ఒక చెలికాని, చేయి అందుకునే ఆలోచనల ...
    అగాధాల, అగోచర అలలపై జారుతూ,
    గమ్యం వైపు, ఒంటరిగా అడుగులు వేస్తూ ....
    రేయి గడిచిపోతుంది నిశ్సబ్దంగా ... తెల్లవారబోతుంది అన్నట్లు."

    కవిత చాలా బావుంది. మెరాజ్ గారి భావనావేశ విలక్షణతను ప్రస్తుతించకుండా ఉండలేక పోతున్నాను. శుభాభినందనలు కవయిత్రి గారు.

    ReplyDelete
  3. నా భావనా తరంగాలను వాటి ఆటు పోటులను గుర్తించిన మీరు నా కవితకు మెరుగు పెట్టినట్లు మీ వ్యాఖ్యను వ్రాయటం ఓ గొప్ప అనుభూతి.
    నా కవితలపై మీ రీసెర్చ్ బాగుంది సర్:-)

    ReplyDelete
  4. ఇహ పరాల విషయానికి వస్తే
    భగవంతుడు తనను నమ్మిన వారి
    చేయి విడిచిపెట్టినట్లు
    దాఖలాలు లేవు.
    నిశ్చింతగా ఉండవచ్చు మనం.
    ఇక గమ్యం మారుతూ ఉండడం కూడా
    నిత్య చైతన్యమే,కనుక ఆహ్వానించవచ్చు.
    ఆంపూర్తిగా ఆవిష్కరించారు,
    మరో మారు ప్రయత్నించవచ్చు.

    ReplyDelete
    Replies
    1. గమ్యం కాన రాక, దిశ మారి ఎలాంటి తోవలో నడవాల్సి వస్తుందో తెలుసుకోవటం అసాద్యం.
      నిశ్చంత గా ఉండగలగాలనే ఆశ.
      అసంపూర్తి కావ్యాలే అన్వేషణ కు దారితీస్తాయి.
      నా అక్షర తపస్సు ఎన్ని అవాంతరాలు వచ్చినా కొనసాగుతూనే ఉంటుందిం
      సర్, మీ స్పందనకు నా ధన్యవాదాలు.

      Delete
  5. " మరోమారు గమ్యం కోసం,
    అతుకు వేసుకున్న బతుకులో....

    ఆమె మిగిలిపోయింది, ఒంటరిగా మిగిలిపోయింది".......... చాలా హృద్యంగా ఉంది అక్కా

    ReplyDelete
    Replies
    1. శోభా డియర్. , నచ్చినందుకు సంతోషం.
      నా బ్లాగ్ చూసినందుకు ధన్యవాదం.

      Delete
  6. స్త్రీ హృదయం ఎంత సున్నితమైనదో ,కళ్ళతో చూస్తే తెలియదు .

    మనసుతో చూడాలి . ఆనాడే అంతరాలు తొలిగి ,ఆలంబన

    దొరుకుతుంది .

    ReplyDelete
    Replies
    1. శ్రీదేవి గారూ, నిజమే మీరన్నది మనసుకు కళ్ళుండాలి.

      Delete