అది పదహారోసారి మంగమ్మకూర రుచి చూడటం. సాయంత్రం నుంచీ కాలుగాలిన పిల్లిలా ఇంట్లోకీ బైటకీ తిరుగుతూనే ఉందామె సాయంకాలం 5 గంటలవుతుంది.
ఆమె భర్త చంద్రం వీధి చివర మలుపులో సైకిల్ మీద వస్తూ కనిపించాడు. అంతే గబ,గబా ఇంట్లోకి వచ్చి మట్టిగోడకి తగిలించిన చిన్ని అద్దం పెంకులో ముఖం చూసుకొని బొట్టు సరిచేసుకుంది,
ఆయనకి తొందరగా అన్నం పెట్టేసి,సినిమాకుతీసుకెళ్తానని నిన్నరాత్రి తనతో చెప్పిన విషయం గుర్తుచెయ్యాలి అనుకుంది మంగమ్మ (ఆతగాణ్ణి ఏమాత్రం విసిగించకూడదూ అనుకుంది కూడా)
చిరునవ్వుతో గుమ్మం లో నిల్చుంది.
" ఏంటే అడ్డంగానిల్చున్నావ్? కాస్తా చిరాకు ద్వనించింది చంద్రం గొంతులో.
"హి,హీ ఏమీ లేదు ఈరో గారేంటోఉషారుగా వస్తుంటే."నవ్వుతూ అడ్డుతొలిగింది.
"ఏడిసినట్ట్టుంది,ట్రాపిక్కులో సైకిలు తొక్కుకొని ఒచ్చేసరికి పాణం పోతుంది"విసుగ్గా అన్నాడు.
" ఏడినీళ్ళు పెట్టాను తానం చేసిరా అన్నం వడ్డిత్త్తా, కూరేంటో తెలుసా.నీకిట్టమైన కోడిగుడ్ల పులుసే, " నవ్వుతూ హడావిడి పెట్టింది మంగ.
***
చంద్రం అన్నం కూరా కలుపుతూ ఉన్నాడు. మంగమ్మ పైట కొంగుతో విసురుతుంది....
" అబ్బా.. కూర ఎంత బాగుందే," ఒసే... మంగీ నీ చేతి వంట అమృతమే.. "
" ఇదిగో.. ఒక్క ముద్ద తిను, " ముద్ద కలిపి గోముగా తినిపించబోయాడు చంద్రం.
" అయ్యో నువ్వు తిను బావా.."మొకమాటంగా తిరస్కరించింది.
" ఒక్క ముద్దే నా చేత్తో తిను ". బుజ్జగించాడు.
"నీకు బాగుందంటే అదే పదేలు, కడుపునిండా తిను బావా.. " సంబరపడిపోయింది మంగమ్మ.
" ఏదీ ఆ..అను.." ముద్ద నోటిదగ్గర పెట్టాడు చంద్రం.
" ఆ... " నోరు తెరిచింది మంగమ్మ.
" ఒసేవ్, నీళ్ళేయే..ఆ పరద్దేనమేందే... నొరుతెరుచుకొని చూస్తున్నావేంటే ? గా..ట్టిగా అరుస్తూ చిందులేస్తూ పీటని ఒక్క తన్ను తన్నాడు చంద్రం.
తుండు విదిలించి భుజం మీద వేసుకుంటూ..
" ఆ కూరలో ఏందో తక్కువైందీ, ఇంకేందో ఎక్కువైందీ.. అయ్యేందో కలుపుకు తిని ఎర్రి మొఖమా.. " అంటూ వీధి వాకిలి దాటాడు సదరు పతి దేవుడు.
కూర చట్టి ముందు మంగమ్మ ఎంత సేపు కూర్చుందో...
'
"ఆయనకి తొందరగా అన్నం పెట్టేసి, సినిమాకుతీసుకెళ్తానని నిన్నరాత్రి తనతో చెప్పిన విషయం గుర్తుచెయ్యాలి అనుకుంది మంగమ్మ (ఆతగాణ్ణి ఏమాత్రం విసిగించకూడదూ అనుకుంది .... ఊహల్లోకి జారి పోయింది)
ReplyDelete............
" ఒసేవ్, నీళ్ళేయే..ఆ పరద్దేనమేందే...నొరుతెరుచుకొని చూస్తున్నావేంటే ? గా..ట్టిగా అరుస్తూ, చిందులేస్తూ అతగాడు పీటని ఒక్క తన్ను తన్నడం తో ఉలిక్కిపడింది.
తుండు విదిలించి భుజం మీద వేసుకుంటూ.. బయటిక్కదిలాడు.
కూర చట్టి ముందు మంగమ్మ ఎంత సేపు కూర్చుందో... "
ఒకటనుకుంటే ఒకటి జరగడం జీవితం లో పరిపాటి. బాగుంది కథ, కథనం.
అభినందనలు మెరాజ్ గారు.
నిజమే జీవితం మనం అనుకున్నట్లు జరగదు, కానీ కొంచం సున్నితంగా, నిస్స్వార్దంగా ఆలోచించగలిగితే....
Deleteఓపిగ్గా చదివిన మీకు నా ధన్యవాదాలు సర్.
మంగమ్మ చేతి కూర, రుచి మరిగాడు కానీ ,
ReplyDeleteఆమె చిరు కోరిక 'వాసన' గ్రహించ లేక పోయాడు !
ఆమె జీవితం, రుచి కరం చేయలేక పోయాడు, మొగుడు !
కధనం బాగుంది ! ఇంకొద్దిగా వివరణ ఉంటే , ఇంకా ' రుచి ' గా ఉండేది ! మంచి ప్రయత్నం ! అభినందనలు !
మీకధ కు, ' షరా' కన్నా ' రుచి ' అని పేరుంటే బాగుండేది !
చూశారా మొగుడు ఎంత నిర్దయుడొ ..:-))
Deleteఇకపోతే షరా అంటే "అనుబంధం" అనే అర్దం కూడా ఉంది కదా అందుకని అలా పేరు పెట్టాను.
నా ప్రయత్నం అనే మీ మాటకు చాలా సంతోషం వేసింది.
సర్, మరో రుచి రాయటానికి ప్రయత్నిస్తాను.
సున్నితమైన భార్యాభర్తల బంధాన్ని భార్య పాయింట్ ఆఫ్ వ్యూ లో ప్రెజెంట్ చేసారు. బాగుంది.
ReplyDeleteఇంకా ప్రయత్నించాలి. బహుశా, చివరలో ఒక చిన్న ట్విస్ట్ ఉండే అంశాలు తీసుకోండి. కవితల నుంచి కథలలోకి ప్రస్తాహనం బాఘుంది, కీపిటప్.
సర్, కథలు మలచటం నాకు అంతగా రాదు, అది మీ వంటి రచయితల సొంతం.
Deleteమీ కథలు ఎంత పెద్దవైనా చదవటానికి బాగుంటాయి.