Pages

Wednesday, 6 November 2013

ఇది ఆవేశమా?

     




    ఇది ఆవేశమా?

        

    ఎముకలు  నమిలే  ఎలుగులై .... 
     రక్తం  తాగే  జలగలై ... 
     అధిక  దరలు కబళిస్తుంటే,

     నిర్లిప్తతను  దులుపుకొనీ.. నిరాశను వదిలించుకొనీ,
     పనిలో నిమగ్నమైన రోజుకూలీ..,
     శ్రమ ఫలితానికై   చేయిచాపితే,
      
     ప్రలోభాలే లాభాలుగా నమ్మించి,
     వారానికోక్కసారి  వేతనం  ఇచ్చే  గాడిదకొడుకులు,
     వారానికొక్కసారే  తింటున్నారా....? 

     రెక్కాడితేగానీ  డొక్కాడని  దీనులను ,
     మురికి వాడలు   తమ  ముద్దుబిడ్డలను  చేసుకొని,
     రోగాల  రగ్గులు  కప్పుతున్నాయి. 

     ఆనందం  వెతుక్కొనే  నెపమో, 
     సమస్యల నుండి   జారుకొవటమో,
     సగటు  మనిషి సారాయి సంద్రాన  మునుగుతున్నాడు. 

     కులమతాల కోటాలో కుమ్ముక్కై,
     అసమర్దులే  అందలం  ఎక్కుతుంటే,
     నిరుద్యోగి  ఎర్రగా  చూడటంలో  వింతేముందీ..?  

     ముఖాలపై ముసుగులు తీయటం లేదు,
     మూర్కపు జనాన్ని మత్తులో  ముంచుతున్నారు,
     జనం మేలుకుంటే  ఎప్పుడో  ఓట్ల  తూటాలకే,
     ఎన్కౌంటర్  అయ్యేవారు. 

     ఆశల, ఊహల,  అనాలోచితా  దారుల్లో,
     అందరమూ ప్రయాణిస్తున్నాం,సమాంతర  రేఖలమై..,
     అవును , ఎప్పటికీ  ఒక్కటి కాలేకపోతున్నాము. 

     

     
,
   


14 comments:

  1. Idi kadupumandina aavesham nijame

    ReplyDelete
    Replies
    1. నిజమే, కడుపుమండుతుంది కొన్ని అన్యాయాలను చూసినప్పుడు.
      చదివి వాఖ్యానించిన మీకు ధన్యవాదాలు.

      Delete
  2. రాతలు మార్చేది,' పై వాడే ' అని అనుకున్నంత కాలం,
    రేఖలు కలవడానికి రాహు కాలం !
    మీ కవితా బాణాలు , మనసుకు గుచ్చుకున్నా,
    మనుషులు మారడమనేది సున్నా !

    ReplyDelete
    Replies
    1. సుదాకర్ గారూ, మనుషులు మారటానికి నావంతుగా అక్షరాన్ని సందిస్తున్నాను
      చూద్దాం... ఒక్కరైనా మారితే చాలు కదా.

      Delete
  3. ఎలుగులై, జలగలై అధిక దరలు కబళిస్తూ, చేతికందని రోజుకూలీ శ్రమ ఫలితం ....
    రోగాల రగ్గుల్లో దీన జనం,
    అది ఆనందమో సమస్యల నుండి పలాయనమో, సారాయి సంద్రం లో సగటు మనిషి.
    కుల మతాల కోటాలో అసమర్దులు అందలం ఎక్కడం కారణం అయి నిరుద్యోగి కళ్ళెర్రబడ్డం సహజం.
    నాయకత్వ ముసుగులో మోసం చేస్తున్న నాయకులు ....
    గొర్రెల్లా భావిస్తున్న అమాయక జనమంతా ఒక్కటయ్యిన్నాడు ఆ జనచైతన్యం ఓటు హక్కుగా మారి ఎన్కౌంటర్ అవ్వక తప్పదు.
    అవేశం ఆలోచన గా మారితే పరిణామం ఎలా ఉంటుందో తెలియపరుస్తూ చైతన్యావశ్యకతను గుర్తుచేస్తూ ....
    "ఇది ఆవేశమా?" కవిత
    అభినందనలు మెరాజ్ గారు! సుప్రభాతం!!

    ReplyDelete
    Replies
    1. చంద్ర శేఖర్ గారూ, నా కవితకు దర్పణం మీ కామెంట్,
      నేను ఏమి చెప్పాలి అనుకున్నానో నా భావాన్ని వడపోసే మీకు నా ధన్యవాదాలు.

      Delete
  4. మనది అరణ్యరోదనవుతోందేమో! వినేవారు కనపడటం లేదు, అలాగని చెప్పడమూ మానలేం కదా!!

    ReplyDelete
    Replies
    1. సర్, నిజమే కదా..,
      అలాగని ఊరుకోలేము.సమాజం ఎప్పుడూ ఒకేలా ఉండదని ఆశ మన చేత ఇలా రాయిస్తుంటుంది.

      Delete
  5. భావం, భాష ఒకదానితో ఒకటి
    పోటీ పడి మరీ పండాయి.
    మార్పు రావడం అనివార్యం.
    మనిషిలోని మంచితనాన్ని
    వెతికి, పట్టి, పెంచి, పోషించి
    మార్పుకి ఆహ్వానం పలుకుదాం.
    అభినందనలు

    ReplyDelete
    Replies
    1. సర్, మీ స్పందనతో ధైర్యం వచ్చింది,
      మనందరమూ మార్పుని కోరుకొనే వాళ్ళమే... ఇలా ఇంకొందరు కలుస్తారు ఇదీ నా ఆశ.
      కొన్ని సమస్యలకు మీ వంటి వారి నుండి పరిష్కారాలు దొరుకుతాయి కదా...ఇది ఒకరకంగా నేను చేసే అన్వేషణ.
      చదివిన మీకు నా ధన్యవాదాలు.

      Delete
  6. ilaanti avesham andarilo vaste entha baaguntundo ee prapanchamani anipistundi....
    your poetry really beautiful...:-)::-)

    ReplyDelete
    Replies
    1. కార్తిక్ గారూ, మీ ప్రశంసకు ధన్యవాదాలు.

      Delete
  7. "వారానికోక్కసారి వేతనం ఇచ్చే గాడిదకొడుకులు,
    వారానికొక్కసారే తింటున్నారా....?"

    "రెక్కాడితేగానీ డొక్కాడని దీనులను,
    మురికి వాడలు తమ ముద్దుబిడ్డలను చేసుకొని,
    రోగాల రగ్గులు కప్పుతున్నాయి."

    "జనం మేలుకుంటే ఎప్పుడో ఓట్ల తూటాలకే,
    ఎన్కౌంటర్ అయ్యేవారు."

    ఫాతిమా గారు!
    కవితలో పై పంక్తులు హృదయానికి హత్తుకొన్నాయి.
    అభినందనలు!


    ReplyDelete
    Replies
    1. సర్, మీ వంటి విద్యాధికులు నా కవితలను మెచ్చుకోవటం నాకు స్పూర్తిదాయకం.
      నా బ్లాగ్ దర్సించిన మీకు నా ధన్యవాదాలు.

      Delete