Pages

Friday, 22 November 2013

రాయికన్నా రాయివి నీవు కసాయివి నీవు.









రాయికన్నారాయివి నీవూ....కసాయివి నీవు. 



          నిదురలేని  కన్నులను  కలవర పరచే
       కలవు నీవు. 

       చేయని నేరానికి దోషిని  చేసి సంజాయిషీ అడిగే 
       సహవాసివి నీవు. 

       సలపని పోరులో, తెలియని  వైరంలో గెలిచిన,
       భీరువు నీవు. 

       తొణికిన మనస్సునీ,వణికే హృదయాన్నీ అపార్దం చేసుకున్న,
       అసురుడవు నీవు. 

       ప్రేమ సందేశాన్ని  అందించే కపోతాన్ని  కాళ్ళు నరికిన 
       వ్యాధుడివి(బోయవాడు)  నీవు. 
       కల్మషమెరుగని  కన్నీటికి   కూడా  కరగని రాయివి ,
       కసాయివి నీవు. 




10 comments:

  1. Replies
    1. ప్రేరణా.. చాలా సంతొషంగా ఉందమ్మా మీ స్పందనకు.

      Delete
  2. అలలూ , అలజడీ రేపిన
    ఆ లలనకు, ఆవేశం,
    ఎందువలన ?

    ఆమె తీక్షణ దూషణా బాణాల వాడి కి,
    'కపోత' వీక్షణకు ముందే,
    ఎగిరి పోయుంటాయి, ప్రాణాలు, బోయ వాడికి !

    ReplyDelete
    Replies
    1. నిజమా:-)
      సర్, ధన్యవాదాలు మీ స్పందనకు.

      Delete
  3. నిద్దురరాని కన్నుల కలవరం కలవు. మది తొణికినా, ఎద వణికినా అపార్దం చేసుకుని, చేయని నేరానికి దోషిని చేసి సంజాయిషీ అడిగే సహవాసం. కన్నీటికీ కరగని కసాయితనం .... నీవు.
    భావ ప్రకటన బలంగా ఉంది. అభినందనలు మెరాజ్ గారు. శుభోదయం!

    ReplyDelete
    Replies
    1. చంద్రశేఖర్ గారికి నా ధన్యవాదాలు.

      Delete
  4. Replies
    1. అహ్మద్ గారూ, ధన్యవాదాలు.

      Delete
  5. ప్రియమైన శత్రువు అనుకుంటా!
    తిట్టడంలో కూడా ఇంత కవిత్వమా?
    శబ్బాష్. బాగుంది.

    ReplyDelete
    Replies
    1. కాదు అతి దగ్గరి శతృవు, తిట్టినట్లు అనిపించకూడదుగా.. అందుకే ఈ కవిత్వం:-)
      సర్, సరదాగా రాసిన కవిత,
      ధన్యవాదాలు మీ స్పందనకు.

      Delete