అల్లరి
అలసిపోయి ఇంటికొస్తానా..
అలిగి ఏ మూలో నక్కి ఉంటావ్.
అన్నం తినననే నీ మంకుపట్టూ,
అందరూ తిట్టారనే నీ కంప్లైంటూ..,
హడావిడిగా ఉండే నా పని వేళలూ..,
నా గది ముందు తచ్చాడే నీ అడుగులూ..,
స్నానం చేయననీ, మంచం దిగననీ.. నీ మొరాయింపూ,
వీది, వీధంతా నీమాట వినలేదనే నీ దబాయింపూ,
జేబులోని చిల్లరంతా నీదేననే గద్దింపూ ..,
వీధి చివరి దుకాణం వరకూ తీసుకెళ్ళమనే అర్దింపూ..,
నిన్నుతప్ప ఇంకెవరినీ దగ్గర తీయరాదనే మొండితనం,
నన్ను ఒక్కఅంగుళం కూడా కదలనివ్వని నీ పంతం.
నీ చుట్టూ ఇందరున్నా..ఎవ్వరూ లేరనుకొనే ఒంటరితనం,
సంతానాన్ని మాత్రమే గుర్తించే అమ్మతనం.
( వయస్సు మీదపడి మతిలేని ఎందరో తల్లులు చేసే అల్లరే ఇది,
మన అల్లరిని ముద్దుగా భరించిన వారి అల్లరిని బాధ్యతగా భరిద్దాం)
ఆ మూలన నక్కి వొదిగి కూర్చున్నావు. అందరూ తిడుతున్నారు.., అన్నం తినను, స్నానం చేయను, మంచం దిగను.. అంటూ ఎవరూ నా మాట వినడం లేదు అని దబాయిస్తున్నావు. ఆ చిల్లరంతా ఇటివ్వు, వీధి చివరి దుకాణం వరకూ తీసుకెళ్ళు.., అంటూ నన్ను నీ సొంతం అనుకుని పంతానికి పోతున్నావు. నన్ను నీబిడ్డే అనుకుంటున్నావో ఏమో .... అమ్మా నీ అల్లరిని భరించడం లో ఇంత ఆనందం ఉందని ఇప్పుడే తెలిసింది.
ReplyDelete( వయస్సు మీదపడి మతిలేని ఎందరో తల్లులు చేసే అల్లరే ఇది, మన అల్లరిని ముద్దుగా భరించిన వారి అల్లరిని మనం బాధ్యతగా భరిస్తే బావుంటుందనే ....)
సున్నిత అనురాగ భావనల పద శిల్పం
కవిత హృద్యమం గా ఉంది.
అభినందనలు మెరాజ్ ఫాతిమా గారు! శుభోదయం!!
చంద్ర గారూ, సున్నితమైన ఈ భావం ప్రతి సంతానాన్నీ కదిలించగలిగితే చాలు.
Deleteధన్యవాదాలు.
కళ్ళు చెమరించాయి...
ReplyDeleteఅమ్మ గుర్తుకొచ్చింది...
మొన్నటి వరకు నా దగ్గర చెన్నైలో ఉంది.
ఇప్పుడు తమ్ముడి దగ్గర హైదరాబాదులో.
వెంటనే వెళ్ళి పలకరించాలనిపిస్తోంది.
సర్, అమ్మ ని గుర్తు తెచ్చిన నా మాటలు సార్దకమయ్యాయి.
Deleteధన్యవాదాలు మీ స్పందనకు, త్వరలోనే అమ్మగారికి మీ ఆదరణ లబిస్తుందని ఆశిస్తూ..
మూలము గొప్పది. అభినందనలండీ...
ReplyDeleteప్రసాద్ గారూ, ధన్యవాదాలు మీ స్పందనకు.
Deleteమీ ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగా ఉంటాయండి
ReplyDeleteపద్మా, మీ అభిమానానికి నా ధన్యవాదాలు.
Deleteఅబ్బ!ఎంత కాలానికి నీ కవితా చెరుకుగడ దొరికిందమ్మా!అతి మధురం.వృద్ధ అమ్మల గూర్చి రాసే నీ కవితలు యువతకు నీతి పాఠాలు."కొడుకా ఇదేనా జీవితం"అనే కవితను నీ పేరుతో ముద్రించాను.
ReplyDeleteసర్, నేనుకూడా చాలా కాలానికి మీ ఆత్మీయ వ్యాఖ్యను పొందగలిగాను,
Deleteకొన్ని కారణాలవల్లా ఫేస్బుక్ తీసివేశాను. కానీ మీ అభిమానాన్ని తిరిగి పొందగలిగాను, మీ ఆశ్శీస్సులకొసం నా అక్షరాలు ఎదురుచూస్తూ ఉంటాయి,