నీ వాలు చూపుల గాలం
నా గుండె కవాటానికి,
చిక్కుకుంది.
నా మన:మందిరం,
చేరుకుంది,
నీ చిలిపి చూపుల చక్కదనం,
నా వలపు వాకిట,
నీ సోగచూపుల సౌందర్యం,
నా ఎదముంగిట,
పరచుకుంది.
నీ ఆర్తి చూపుల కోమలం
నా ఆశల దోసిట,
నీ కాటుక చూపుల కలికితనం,
నా మది భావాలను,
మీటింది.
నీ మాలిమి చూపుల మంచితనం,
నా తీపి పలుకులను,
మాల కడుతుంది.
నీ దొంగ చూపుల దోపిడితనం
నా మనసు మర్మాలను
వెతుకుతుంది.
నీ అలక చూపుల అల్లరితనం,
నా దాహార్తిని,
దాచేస్తుంది.
నీ కరుణ చూపుల కమ్మదనం
నా ఆశయాలకు,
బాట వేస్తుంది .
నీ స్నేహ చూపుల చల్లదనం,
నా జీవితాన్ని,
నీకంకితం చేస్తుంది
అమ్మబాబోయ్, చూపుల్లో ఎన్నిరకాలో!
ReplyDeleteఇంకా ఎన్నో చూపులూ....చెప్పలేని భావాలూ కనిపిస్తాయి నయనాలలో.
Deleteధన్యవాదాలు మీ స్పందనకు వర్మాజి.
ఒక స్త్రీ కళ్ళను ఆమె చూపుల పర్యవసానాన్ని సరళత్వం కోణాలను మాత్రం ఎంతో అందంగా ఆవిష్కరించారు. బావుంది. అభినందనలు మెరాజ్ ఫాతిమా గారు.
ReplyDeleteThis comment has been removed by the author.
Deleteధన్యవాదాలు చంద్రశేఖర్ సర్.
Deleteవాలుకంటి కడగంటి చూపుతో లోకాన్ని జయించగలదంటారు. మొత్తానికి చూపునో చూపు చూశారు :)
ReplyDeleteరాజ్యాలే కూలిపోయాయి అంటారు పెద్దలు.
Deleteబాగున్నాయి చూపులు!
ReplyDeleteThanks sir.
Deleteఇలాంటి చూపు లన్నీ " ముందు చూపు " ఉన్నప్పుడే అందగిస్తాయేమో కదా ! మేడమ్ ?
ReplyDeleteమీరు చూడ లేదు అవన్నీ ముందుచూపులే..:-))
Deletechoopu kavithwam chaala baagundi.
ReplyDeleteధన్యవాదాలు రావ్ గారు.
Delete