ఎవరు నీవు?
కలత నిదురలో కనిపించే,
కమ్మటి కలవా...?
తూరుపు తలుపు తెరిచిన,
తొలి ఉషస్సువా...?
కుబ్జలో అంత:సౌన్దర్యాన్నిచూసిన ,
కన్నయ్యవా...?
గుండె గుడిలో కొలువైన,
మనో దైవానివా...?
భావ ప్రపంచాన వెలసిన ,
అద్భుత అక్షరశ్రీవా...?
హృదయానికి స్పందన నేర్పిన,
తీయని శ్వాసవా... ?
యెదపై ఎన్నటికీ చెరగని,
వెన్నెల సంతకానివా ...?
మదిలో ఊహగా మెదులుతూనే ,
ఎదుట పడని వాస్తవానివా...?
చాలా బాగుంది మీ కవిత.
ReplyDeleteధన్యవాదాలు వర్మగారు ,
Deleteకనిపించీ కనిపించని, కమ్మటి కలవో .... తొలి ఉషస్సువో .... కన్నయ్యవో .... మనో దైవానివో .... అద్భుత అక్షరశ్రీవో .... తీయని శ్వాసవో .... వెన్నెల సంతకానివో .... మదిలో ఊహగా మెదులి, ఎదుట పడని వాస్తవానివో ....? ఎవరివో నీవు??
ReplyDeleteచిత్రం గా! మనో ఆహ్లాద వేళల్లో ఉక్కిరిబిక్కిరయ్యిన క్షణాల్లో మది తలపుల తలుపులు తెరుచుకుని కురిసిన ప్రశ్నల వర్షం లా
అభినందనలు మెరాజ్ ఫాతిమా గారు! సుప్రభాతం!!
చంద్ర గారూ, మదిలో ఊహగా మెదిలే ఎన్నో భావనలు కవిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
Deleteఅలజడీ, ఆహ్లాదమూ, ఇలా ఎన్నో భావాలకు కవి లోనవుతారు. తన మానసిక స్థికి అక్షర రూపం ఇస్తాడు.
నా కవితల్లొ ఉన్న సున్నిత భావాలను విష్లేషించే మీకు నా ధన్యవాదాలు.
ఎవరో కనిపెట్టి చెప్పాలనుకుంటే,
ReplyDeleteమనిషిని అటు నిలబెట్టారు.
ఇటు తిరిగాక చూసి చెప్తాం ఎవరో.
అందాకా మీరు చెప్పిన అనేక సమాధానాల్లో
ఇమిడే అనంత కవితా శక్తిని
మీకందించిన ఆ సరస్వతీ దేవికి
శిరసు వంచి నమస్కరిస్తాం.
నేనూ అదే చూస్తున్నా... ఎప్పుడు ఇటుతిరుగుతారా అని.
Deleteమీరు చెప్పిన కవితా శక్తికి స్పూర్తి కూడా...అమ్మలాంటి అక్షరశ్రీకారమే...
సర్, మీ ప్రశంసకు నా హ్రుదయపూర్వక ధన్యవాదాలు.
చిత్రం లో మనిషిని, ఇటు తిప్పకుండా ,
ReplyDeleteమీ ఊహలను ఎటో తిప్పుతున్నారే !
చిత్రం లోని మనిషిని ఇటుతిప్పితే.. ఊహలు ఎటుతిరుగుతాయో...:-))
Deleteఇన్ని భావాలకు కారణమైన తనని చూడాలనే నాకూ ఉంది.
సర్, మీ సమయాన్ని వెచ్చించి చదివిన మీకు ధన్యవాదాలు.
ఎదుట పడని వాస్తవాన్ని....ఊహల్లో నిలుపుకుంటూ...స్ఫూర్తి నింపుకుంటూ పయనించక తప్పదు కదా....
ReplyDeleteఅద్భుతంగా రాసారు.
అనూ.. మీ విష్లేషణ ఎంత సున్నితంగా ఉంది,
Deleteవాస్తవాన్ని ఆశించినా, స్పూర్తి ముఖ్యం కదా.
ధన్యవాదాలు మీకు.
మీరజ్ మీ ఈ కవిత లోని " చిత్రం " ప్రతి మనిషిలో ఒకటుంటుంది . వాస్తవాల్ని చూపారు .
ReplyDeleteకాదు ,లేదు అనడానికి వీల్లేదు . ఎందుకంటే ఇది నిజంగా నిజం . చాలా బాగుంది .
ప్రతి ఒక్కరికీ స్పూర్తినిచ్చే ఇంకో హృదయం ఉంటుంది, కాదంటే అది ఆత్మవంచన అవుతుంది.
ReplyDelete