సైకత బంధాలు.
ఎడారి ప్రస్తానంలో ,
తెలీని తీరాలను వెతుకుతూ,
ఎంతకాలమో ఈ పరుగు.
తెగిన రెక్కల పచ్చి నెత్తుటి
వాసనింకా ఆరకముందే,
ఎదురుదెబ్బల బెదురు.
ఎంతదూరమేగినా శూన్యమే,
ఎప్పటికీ... ఒంటరి యానమే,
ఎప్పుడో తెగిన గమ్యం.
గుండెను బండకేసి కొడుతున్నట్లూ,
కాల్చిన త్రిశూలాన్ని కళ్ళలో,
గుచ్చినట్లూ భావన.
కసుక్కున గొంతుతెగి నేలరాలిన మల్లెను,
బరువైన పాదంతో అదిమిపట్టిన,
రాక్షసానందం.
శూన్యంలో నుండి,శూన్యంలోకి
జారిపోతున్న ఆలోచనా తరంగాలూ,
చీకటిని అలుముకున్న క్షణాలు.
రంగుమార్చుకుంటున్న రక్త బంధాలూ,
పెద్దరికానికి విలువివ్వలేదన్న,
సామాజిక గురివిందలు.
ముసుగేసుకున్న అంతరాత్మలను,
నిలదీసి అడిగితే ఎదిరించారన్న,
ఆరోపణలు.
మరణాన్ని మట్టిలో కలిపేందుకు,
పెగుబంధాలూ, ప్రియ బంధాలూ,
దాటివచ్చిన మైలు రాళ్ళు.
వీడ్కోలు సమయాన నేస్తమా....
కఫన్ చాటున నా చిరునవ్వులు
నీకే చెందాలి.
కఫన్ చాటున చిరునవ్వులు
ReplyDeleteఅనే మాట చాలా బాగుంది.
అలాగే ఆ భగవంతుని దయ వలన అంతరంగంలో ప్రశాంతత కూడా ఉండాలి.
జీవితానికి అర్థం వెదకడం అశాంతి.
అర్థవంతమైన జీవ్రితాన్ని గడుపుతున్నామని నమ్మడం శాంతి.
తనను మరచి లోకం కోసం ఆలోచించే వాళ్ళకు భగవంతుడే రక్ష.
లోకాన్ని మరచి తన గురించే ఆలోచించే వాళ్ళకు మనసే ఒక శిక్ష.
అందుకే ప్రశాంతత ఉన్న మనిషికి కఫన్ చాటు చిరునవ్వులు
ఎప్పుడూ ఉంటాయి. అవి పొందిన వాళ్ళు ధన్యులు.
ఏమిటో మీ కవితలు చదివి మేము కూడా కవితా దేవత
మ్రోల మోకరిల్లుతున్నాము.
"తనను మరచి లోకం కోసం ఆలోచించే వాళ్ళకు భగవంతుడే రక్ష.
Deleteలోకాన్ని మరచి తన గురించే ఆలోచించే వాళ్ళకు మనసే ఒక శిక్ష."
పై వాఖ్యాలు అక్షర సత్యం,
కానీ, మానసిక ప్రశాంతత స్వార్దమున్న చోటే లబిస్తుందేమో,
మీ స్పందనకు సంతోషం సర్, ధన్యవాదాలు.
సమాజంలో సైకోలు ఎక్కువైతే బంధాలు సైకత బంధాలే అవుతాయి. మీ కవిత చాలా భారంగా ఉంది మీరజ్ . వాస్తవాలు ఇలానే ఉంటాయి కదా మరి.
ReplyDeleteసైకోలు ఎలాంటి బంధాలనూ అంగీకరించరు, లౌఖ్యం తెలిసినవారే సైకత బంధాలను పొషిస్తారు.
Deleteదేవీ మీ స్పందనకు ధన్యవాదాలు.
జీవనయానం లో మనిషెప్పుడూ ఒంటరే. పుట్టేటప్పుడూ పోయేటప్పుడూ కూడా .... అలసట తెలీకుండా ఉండేందుకే ఈ బంధాలు బాందవ్యాలు. ఆలోచించి చూడండి ప్రతి చిరుగాలి తాకిడికి ఊగిపోయే ఆకులా కాక, ఎన్ని ఉపద్రవాలనైనా ఎదుర్కుని నిలబడే కాండమై ఆశ్రయాన్నిచ్చే ఆదర్శమైతే ఎంత బాగుంటుందో జీవితం. వాస్తవాలకు దూరంగా పారిపోయేవారిని చూసి బాధపడి మార్చ లేము కదా....
ReplyDeleteచిరునవ్వూ ప్రకృతి పరిమళాలు అందరివి .... అందరినీ నీవని సంబోధించే పెద్దరికం వీడ్కోలుకు చేరువయ్యాకే వస్తుంది మనిషిలో. స్పందనలో ఏదేదో రాయించిన మీ కవితకు మీకూ అభినందనలు.
శుభోదయం మెరాజ్ ఫాతిమా గారు!
జీవితం మీరన్నట్లు నీడనిచ్చే కాండం కావాలంటే, దాని వేళ్ళు నరక కూడదు కదా,
Deleteస్వారదముతో నిండిన మనుష్యుల మద్య స్నేహాన్ని వెతికే కంటే ఓ కుక్కని చేరదీయమని ఓ మహానుభావుడు సెలవిచ్చాడు.(జీవితానుభవాలు)
మీ స్పందనకు ధన్యవాదాలు.
నేస్తమా !
ReplyDeleteదారంతటా ఇసుక ఎండమావులనే దర్సిస్తే ఎలా ?
సైకత బంధాలలో కూడా ' నీటి చెలిమ ' చెలుము లను చూడవా ?
సమాజానికి
' పాజిటివ్ ' సందేశాల
కవితా పరీమళాల
సుమహారాల నందించవా ?
----- సుజన-సృజన
ఎడారిప్రస్తానములో...ఎంతనడచినా ఇసుకతుఫానులే ఎదురవుతున్నాయి,నిజమే నీటిచలమ కనిపిస్తుంది, వెతకాలి,వెతకాలి.
Deleteమీ స్పందన చాలా కాలానికి కనిపించింది.(నీటి చలమలా) దన్యవాదాలు సర్,
आगे आगे
ReplyDeleteआगे आगे चलना होगा !
अपनी गठरी आप उठाके ,
कहाँ ठहरना कहाँ ठिकाना
परिचय हीन जगत में तुजको
आगे आगे चलना होगा !
हर पल सोंचना पड़ता है।
Deleteलेकिन कबी बी ,
फूल और काँटा की फरक नहीं समजापाते ,
यही है जिन्दगी :-)
सर, धन्यवाद आपका रिप्लाई केलिए
This comment has been removed by the author.
ReplyDeleteచాలా చాలా బాగుంది అండీ
ReplyDeleteసాయి రెడ్డిగారూ, నా బ్లాగ్ కి స్వాగతం,
Deleteధన్యవాదాలు మీ స్పందనకు.