కళ్ళు తెరువ్
విశ్లేషణా నేత్రాలతో వీక్షిస్తే ,
కధం తొక్కే అంతరంగాన్ని కదిలిస్తే,
ఆలోచనలో పాత్రలన్నీ,
మన ప్రమేయం లేకుండానే బైటికొస్తాయి.
శవాల్లా,చరించే శరీరాలతో,
పనికిరాని కబుర్లతో ,పనిలేని నత్త నడకలతో,
నిత్యావసరాలను సైతం పెడచెవిన పెట్టి,
నమ్ముకున్నోళ్ళను నట్టేట ముంచి,
రాజకీయాన్ని అవపోసన పట్టినట్లూ,
రాష్ట్రాన్ని తానే రక్షిస్తున్నట్లూ ,
అతి సామాన్య పౌరుడివే అయినా,
అత్యంత గొప్ప ఆయుధం ఓటున్నా,
ఎన్నుకున్నోళ్ళు ధనాన్ని దాచుకుంటున్నా,
తన్నుకొన్నోళ్ళు జనాన్ని దోచుకుంటున్నా,
నాకెందుకులే అనుకుంటే, దృతరాష్ట్రునిలా కూర్చుంటే,
కలియుగ కురుక్షేత్రాన్ని కళ్ళారా చూస్తావు.
ఇటువంటి వాళ్ళ గూర్చే పాపం ఒక కవిగారు " కళ్ళు ఉండి చూడలేరు కొంతమంది జనం " అని ఏనాడో రాసారు . పాపం చెవులు ఉండి వినలేదు ఈ జనం .కవిత చాలా బాగుంది మీరజ్ .
ReplyDeleteప్రతిదీ, నాకెందుకులే అనుకొని పొవటమే , ప్రగతికి ఆనకట్ట అవుతుంది,
Deleteధన్యవాదాలు దేవీ,
True!
ReplyDeleteవర్మాజి ధన్యవాదాలు.
Deleteకళ్ళుతెరిస్తే అంతా చీకటే....కళ్ళుమూసుకుంటే కనీసం నలకలైనా పడకుండా ఉంటాయేమో అని జాగ్రత్త వహించేవాళ్ళు చాలామందే ఉన్నారనుకుంటానండి.Well said madam
ReplyDeleteనిజమే, కళ్ళుమూసుకోవటమే ఉత్తమం అనుకొనే సమాజం మనది.
Deleteవిశ్లేషణా నేత్రాలతో వీక్షణ , కధం తొక్కే అంతరంగ కదిలిక,
ReplyDeleteనిత్యావసరాలను సైతం పెడచెవిన పెట్టి, నమ్ముకున్నోళ్ళను నట్టేట ముంచి, ఎన్నుకున్నోళ్ళు ధనాన్ని దాచుకుని, తన అనుకున్నోళ్ళు జనాన్ని దోచుకుని, నాకెందుకులే అని దృతరాష్ట్రునిలా కూర్చుంటే, కలియుగ కురుక్షేత్రాన్ని .... ధర్మ సంస్థాపనని చూడక పోయినా వినక తప్పదు .
హస్తిన లో జెండా ఎగరేసిన ఆం ఆద్మీ పార్టీకి, కవిత ద్వారా కారణాల్ని చెప్పిన మెరాజ్ గారికి అభినందనలు.
తస్మాత్ జాగ్రత్త అని అక్షరాల కొరడా ఝుళిపించడం చాలా బాగుంది.
శుభోదయం!!
ప్రతి మనిషీ తన అంతరంగానికి సమాదానం ఇవ్వాలి, ఆత్మ విమర్శ చేసుకోవాలి,
Deleteకానీ అబద్రతా భావం మనిషిని కుంగదీస్తుంది, సమాదానాలు వెతకటానికి బయపడి సామాజిక సవాళ్ళను తప్పుకొని తిరుగుతున్నారు.
"The darkest places in hell are reserved for those who maintain their neutrality in times of moral crisis" Dan Browning in INFERNO (his new novel).
ReplyDelete"ఎన్నుకున్నోళ్ళు ధనాన్ని దాచుకుంటున్నా,
తన్నుకొన్నోళ్ళు జనాన్ని దోచుకుంటున్నా,
నాకెందుకులే అనుకుంటే, దృతరాష్ట్రునిలా కూర్చుంటే,
కలియుగ కురుక్షేత్రాన్ని కళ్ళారా చూస్తావు. "
Meraj Fathima in " కళ్ళు తెరువ్ "
బాగా చెప్పారు.
సర్, నా పుస్తకం (అంతరాత్మ ) లో చాలా సవాళ్ళు ఉన్నాయి, వాటికి సమాదానాలు, తెలుసుకోవటమే నేను సాగించే అక్షర పొరు.
Deleteపరిష్కరించే శక్తి మనకు లేకపోవచ్చు, కనీసం అక్షరించే శక్తి ఉంటే చాలు.( ఉందని ప్రోత్సాహించిన మీకు
ధన్యవాదాలు)
కవిత బాగుంది ఫాతిమా గారు!
ReplyDeleteధన్యవాదాలు నాగేంద్ర గారు.
Deleteకవిత బాగుంది మెరాజ్ గారు. కళ్లుండీ చూడలేని వారు - చెవులుండీ వినలేని వారు - మన'సున్నా' స్పందించలేరు.
ReplyDeleteనిజమే కదా సర్,
Deleteధన్యవాదాలు మీ స్పందనకు.
కనువిప్పు కలిగించే కవిత....ఎంతమంది కళ్ళుతెరుస్తారో చూడాలి
ReplyDeleteమీ ప్రశంసకు ధన్యవాదాలు
ReplyDelete