Pages

Thursday, 10 October 2013

జీవన పయనం

   

  




  జీవన పయనం 

   నీటిమీద గీసిన చిత్రం 
   చెదిరిపోవటం తద్యం.

   ప్రతి బంధం లోనూ,
   అందమైన ఓ ఒప్పందం.

   చలాకీగా సంద్రాన్ని ఈదటం నైపుణ్యం.
   నావ ఆగటానికి లంగరే శరణ్యం.

   మరణం ఒకేసారి రావటం సహజం 
   కానీ  కాలం ఆగిపొతే అసహజం.

   స్వప్నాన్ని సాకారం చేసుకొనేందుకే యుద్దం.
   అందుకై అవాస్తవ దారిలో  నడకే అనివార్యం.

12 comments:

  1. నీటి మీద రాసుకున్న చిత్రాలు ఈ బంధాలు, అందమైన వొప్పందాలు. జీవన పయనం, నది లో ఈదే నైపుణ్యం అవసరం. ఒకేసారి వస్తుంది మరణం .... స్వప్న సాకారం కోసమే యుద్దం. ఒక్కోసారి అవాస్తవిక దారిలో నడవడమూ అనివార్యమే.
    గొప్ప భావన క్లుప్తంగా, ఒక గీతలా, చెప్పిన విధానం బాగుంది. అభినందనలు ఫాతిమా గారు!

    ReplyDelete
    Replies
    1. సర్, చూశారా గీతా సారాన్ని ఎంతబాగా పట్టేశారో .. నా కవితా వాచకానికి మీ స్పందన గైడు లాంటిది.

      Delete
  2. జీవితమే ఓ అందాల పూలవనం
    ప్రతి క్షణం ఆహ్లాదభారితం
    కోపతాపాలా ప్రేమ ద్వేషాల సమ్మేళనం
    రస రాగాలా భావగీతాల సుమహారం
    వన్నె తరగని అనుబంధాల సుత్రబంధానం
    ఎన్నో ఎన్నెన్నో మధురానుభూతుల సమాహారం

    చాల చాల బాగుంది మ్యడం ఈ కవిత

    ReplyDelete
    Replies
    1. శ్రీధర్ గారూ, మీరు చెప్పినది నాణెనికి ఆవలి జీవితం.
      నిజమే అన్నీ కలగలిపిన సమ్మేళనమే జీవితం.
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  3. బాగుందండి మీ చిరుకవిత్వం

    ReplyDelete
    Replies
    1. సోదరి ప్రేరణకి మనస్పూర్తిగా ధన్యవాదాలు.

      Delete
  4. చిన్న కవితైనా, తాత్వికతో ఏదో... బాగుంది.

    ReplyDelete
    Replies
    1. వర్మాజీ, తాత్వికమూ,తర్కమూ,తత్వమూ, ఇవన్నీ జీవిత పరమార్దాలే... మనకనుగుణముగా బతకటమే లవ్ క్యం .

      Delete

  5. 'స్వప్నాన్ని సాకారం చేసుకొనేందుకే యుద్దం.
    అందుకై అవాస్తవ దారిలో నడకే అనివార్యం. '

    నడక వీలు పడలేదని శిల అయినట్లున్నాడు మీ మానవుడు.

    ReplyDelete
    Replies
    1. సర్, స్వప్నాన్ని సాకారం చేసుకోవటానికి కలల యుద్దం చెయ్యాలి.
      ఇకపోతే, అవాస్తవ బాటలో నడవటం అందరికీ సాద్యం కాదు.
      అందుకే పాపం ఆ మానవుడు శిల అయ్యాడు.

      Delete