బాటసారినై
కొత్త కత్తి అంచుమీద నడుస్తుంటే....,
కొలువు దొరకని దేవులాటలో..,
గొడ్డుకారం గొంతు దిగకుంటే..,
ఆరిపొతున్న కంటిచెమ్మకై ...
దిగులు దివాణం లో...,
తలరాత తగలబడుతుంటే..
అన్నం కుండలో చేయి పెడితే..,
ఖాళీతనపు కడవలో..,
ఆకలి కేకలు వేస్తుంటే...
కర్మ సిద్దాంతాలను తలకెత్తుకుంటే..,
తప్పొప్పుల చిట్టాలో..,
వేదాంతం వెక్కిరిస్తుంటే..
దూరాన్ని కాళ్ళతో కొలుస్తూ,
ఆశకు పునర్జన్మనిస్తూ..,
కొత్త బాటకై వేట సాగిస్తున్నా.
kavitha bagundi medam.
ReplyDeleteఅహ్మద్ గారూ, థాంక్స్.
Deleteహత్తుకునేలా రాసారు....inspiring...unable to express in words...
ReplyDeleteఅనూ, ధన్యవాదాలు.
Delete"కొత్త కత్తి అంచుమీద నడక ...., కొలువు దొరకని దేవులాటలో ...., కర్మ సిద్దాంతాలు తలకెత్తుకున్న ...., తప్పొప్పుల చిట్టాల ...., వేదాంతం వెక్కిరింతలో ...., ఆశకు పునర్జన్మ ...., జీవ పోరాటం!"
ReplyDeleteఅనుక్షణమూ సమశ్యా పూరణాలే అవి .... ఫలవంతమా, అర్ధవంతమా అని చూడని ప్రయత్నాల ఆరాటమే జీవితం అనిపించేలా .... మీ "బాటసారి" కవిత
అభినందనలు మెరాజ్ ఫాతిమా గారు! సుప్రభాతం!
సర్, ధన్యవాదాలు.
Deleteకర్మ సిద్దాంతాలను తలకెత్తుకుంటే..,
ReplyDeleteతప్పొప్పుల చిట్టాలో..,
వేదాంతం వెక్కిరిస్తుంటే.....నచ్చిందండి!
పద్మా, మీకు నా ధన్యవాదాలు.
Deleteవిమర్శనాత్మకం గానూ , స్ఫూర్తి దాయకం గానూ ఉంది కవిత ! కానీ మీరు రాసిన కవిత్వమంత అధ్వాన్నం గా అసలు పరిస్థితి లేదనుకుంటా మెరాజ్ ! వళ్ళు వంచి పనిచేసే వారికి , తగినంత సంపాదన ఉంది , ప్రత్యేకించి నగరాలలో ! ఉదాహరణకు, రెండు గంటలు , ఒక్క ఇంట్లో గిన్నెలు కడిగే వారికి కూడా , నెలకు రెండు మూడు వేలకు పైగా సంపాదన ఉంది ఈరోజుల్లో ! ఆ పని కూడా నమ్మకం గా చేసే వారు దొరకక ఇబ్బంది పడుతున్నారు అవసరం ఉన్నఅనేక మంది ! బ్రతుకు తెరువు కోసం , సంపాదనా మార్గాలతో , చదివిన చదువును ముడి పెట్ట కూడదు ! ఇంకో విషయం , ఉద్యోగం దొరకలేదని ప్రభుత్వాన్ని నిందించే ముందు , ప్రతి తల్లి దండ్రీ కూడా , వారు పుట్టించే సంతానానికి ఏమి చేయగలరో అవగాహన లేకుండా కేవలం ' దేవుడు ఇస్తున్నాడు , పుడుతున్నారు ' అనే మైండ్ ఫ్రేం ఉన్నంత కాలం , ఇట్లాంటి ' బాటసారులు ' పుడుతూనే ఉంటారు !
ReplyDeleteనిజమే నిస్సందేహంగా మరీ అద్వాన్నంగా లేదు వారి పరిస్థితి , కానీ వారిపై నమ్మకం లేకపోవటమూ,(నమ్మలేని పరిస్థితులు కూడా ఉన్నాయి కాదనలేము.) వల్లా వారికి స్తిర నివాసానికి అవకాశం లేకుండా ఉంది.
Deleteఅదిక దరలూ, పట్టణ జీవనానికి సరిపడా ఆదాయం సరిపోకపోవటమూ ఇలా ఎన్నో...
మీరన్నట్లు సంతాన నియత్రణ లేకపోవటమూ అందుకే,
కర్మ సిద్దాంతాన్ని తలకెత్తుకుంటున్నారు అన్నాను.
సర్, మీ స్పందనకు ధన్యవాదాలు.